75 శాతం మందికి మోడీ ఎవరో తెలీదా...!

నరేంద్ర మోడీ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి స్థాయికి ఎదిగి,దేశం వ్యాప్తంగా తెలిసారు.. తర్వాత దేశ ప్రధానై, ప్రపంచ శక్తివంతమైన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.. కానీ ఒక సర్వే చూస్తే మాత్రం అక్కడ మోడీ అంతమందికి తెలీదా అంటూ ఆశ్చర్యపోతారు.. కెనడాలోని చార్లొవిక్స్ ప్రాంతంలో, ప్రపంచ నేతల గురించి కెనడా వాసులకు ఎంతమేరకు తెల్సి ఉంటుందని ఒక సర్వే నిర్వహించారు.. ఆ సర్వే లో మోడీ గురించి అడగగా సుమారు 75 శాతం మంది అసలు తమకి మోడీ ఎవరో తెలియదు అన్నారట.. ఇంకో కొసమెరుపు ఏంటంటే, వారిని ట్రంప్ గురించి అడిగితే అహంకారి, అబద్దాలకోరు  అంటూ మండిపడ్డారట.