ఘనంగా టిడిపి 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

 

 32nd Anniversary Of TDP, Chandra Babu 32nd Anniversary Of TDP, TDP Chandra Babu

 

 

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

 

సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈనాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

 

తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.



తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.