ఏపీ లోని 140 కరోనా పాజిటివ్ కేసులు, తబ్లీగ్ జమాత్ పుణ్యమే: అధికారులు

* విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిద్ధమవుతున్న టెస్టింగ్ ల్యాబ్స్
* బాపట్ల లో యువకుడి ఆత్మహత్యపై విచారణకు సి.ఎం. ఆదేశం

ఢిల్లీ సదస్సులో పాల్గొన్నవారు, వారితో కాంటాక్టు అయిన వారికి పరీక్షలు నిర్వహించామని, ఢిల్లీలో జమాత్‌కు 1085 మంది హాజరయ్యారని, వీరిలో మన రాష్ట్రంలో ఉన్నవాళ్లు 946 మందిని గుర్తించామని అధికారులు, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి  వివరించారు. కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ, బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ 946 మందిలో 881 మంది ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మంది పాజిటివ్‌గా కేసులుగా నిర్ధారణ అయ్యాయని అధికారులు సి ఎం కు వివరించారు. ఇంకా 65 మందికి సంబంధించి ల్యాబ్‌ నుంచి ఫలితాలు రావాలన్న అధికారులు. పైన పేర్కొన్న 946 మందితో కాంటాక్ట్‌ అయినవారిలో 616 మంది పరీక్షలు నిర్వహించగా ఇందులో 32 మంది పాజిటివ్‌ కేసులుగా నిర్ధారణ అయ్యాయని వెల్లడి. కాంటాక్ట్‌ అయిన మరో 335 మంది ల్యాబ్‌ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందన్నఅధికారులు. రాష్ట్రంలోని మొత్తం 161 పాజిటివ్‌ కేసుల్లో 140 మంది ఢిల్లీ జమాతే సదస్సుకు వెళ్లినవారు, వారిలో టాక్ట్‌ అయినవారేనని అధికారులు వెల్లడించారు.


రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని తెలిపిన అధికారులు, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా వైద్యుల మ్యాపింగ్‌ చేసినట్టు ముఖ్యమంత్రికి వివరించారు. ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం సూచించారు. పోలీసుల డేటాను, వైద్య సిబ్బంది డేటాను, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వే డేటాను వీటన్నింటిని విశ్లేషించుకుని ఆ మేరకు వైద్య పరీక్షల విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని సి ఎం ఆదేశించారు.

అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌లు, వాటిని సామర్థ్యంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. గుంటూరు, కడప ల్యాబ్‌ల్లో టెస్టింగ్‌ ప్రారంభమైందని వివరించిన అధికారులు. వచ్చే సోమవారం నుంచి విశాఖపట్నంలో ల్యాబ్‌ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ఒకరోజులో కనీసం 700 మందికి పరీక్షలు చేయించే అవకాశం ఉందన్న అధికారులు
అలాగే ప్రయివేటు ల్యాబ్‌ల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న అధికారులు. వారంరోజుల్లో విజయవాడలో ఈ ప్రయివేటు ల్యాబ్‌ సిద్ధమవుతుందని, మొత్తంగా రోజుకు 900 మందికి పరీక్షలు వరకూ చేయగలిగే సామర్థ్యానికి చేరుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

రాష్ట్రం వెలుపల ఉన్న తెలుగువారి పరిస్థితులపై ఆరాతీసిన సీఎం. ముంబై, గిర్, వారణాశి, గోవా, అజ్మీర్, తమిళనాడు ప్రాంతాల్లో చిక్కుకున్నారని తెలిపిన అధికారులు. వీరికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలన్న సీఎంపెద్ద సంఖ్యలో తెలుగువారు ఉన్నచోట ఒక అధికారిని పంపి వారి బాగోగులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్న సీఎం.

అలాగే క్వారంటైన్, ఐసోలేషన్లలో ఎస్‌ఓపీ పాటించాలన్న సీఎం. కనీస వసతులు, సదుపాయాలు పాటించేలా ఎస్‌ఓపీ ఉండాలన్న సీఎం. అలాగే, బాపట్ల యువకుడు ఆత్మహత్య కేసు విషయలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.