మోదీ కలల ప్రాజెక్ట్ కు గండి.. 1000 మంది రైతులు పిటిషన్.!!

ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ కు గండి పడేలా ఉంది.. 1000 మంది రైతులు మోదీ కలల ప్రాజెక్ట్ ను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.. మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే గతేడాది సెప్టెంబర్‌లో ముంబై నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించారు.. డిసెంబర్,2017లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.. 2023 ఆగష్టుకల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని తొలుత భావించినా, ఇప్పుడు ఆగష్టు 2022కే పూర్తి చేసి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలు ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. అయితే కేంద్రానికి గుజరాత్ రైతుల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

 

 

దాదాపు 1000 మంది రైతులు ఈ ప్రాజెక్టును ఆపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చేందుకు సిద్దంగా లేమని కోర్టుకు తెలిపారు.. అంతేకాదు భూసేకరణ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అంతేకాదు తమ భూములు మార్కెట్ విలువ ఆధారంగా కొనుగోలు చేయడం లేదని చెప్పారు.. ఇదిలా ఉంటే తమ భూములు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చేస్తే తమకు పరిహారం పరంగా న్యాయం జరగదని చెబుతున్నారు.. అదే కేంద్రం తీసుకుంటే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.. మరోవైపు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.. మోదీ కలల ప్రాజెక్ట్, అందునా రూ.1.08 లక్షల కోట్ల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. మరి ఈ విషయంపై మోదీ సర్కార్ ఎలాంటి తీసుకుంటుందో చూడాలి.