జగన్‌కీ కట్టేశారు..

 

 

 

గతంలో నిరసన తెలపడం అంటే నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం వరకూ వుండేది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా అది బతికున్న నాయకులకు కూడా సమాధులు కట్టడం వరకూ వెళ్ళింది. మొన్నామధ్య సమైక్యాంధ్ర ఉద్యమకారులు సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారు. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. నాయకులకు సమాధి కడితే లేనిపోని గొడవలవుతాయి కాబట్టి ఇక ఈ సమాధుల సంప్రదాయం కొనసాగదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే సీమాంధ్రులు సమాధులు కట్టగా మేం మాత్రం కట్టలేమా అనుకున్నారేమో తెలంగాణ వాదులు కూడా సమాధి కట్టేశారు.



అది కూడా వైకాపా నాయకుడు జగన్ ఫొటోకి! హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నందుకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే జగన్ ఫొటోకి సమాధి కట్టారు. ఆ సమాధి మీద వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం పెట్టి కర్మకాండలు కూడా చేశారు.