యూపీ బీఎస్పీ నేత హత్య కలకలం..

 

ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ నేతపై దుండగులు దాడి చేశారు. వివరాల ప్రకారం..యూపీ లోని అలహాబాద్ లో ద్విచక్ర వాహనంపై వ‌చ్చిన పలువురు దుండగులు బీఎస్పీ పార్టీ నేత‌ మొహ‌మ్మ‌ద్ ష‌మీని గుర్తు తుపాకీతో కాల్చి పారిపోయారు. సంఘటనా స్థలంలోనే షమీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్య‌నాథ్‌ ప్ర‌మాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆగ్ర‌హించిన కొంద‌రు ఆ పార్టీ కార్య‌కర్త‌లు భారీ నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.