దినకరన్ కు ఐదు రోజుల కస్టడీ...

 

త‌మిళ‌నాడు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో పోలీసులు ఆయ‌న‌ను మ‌రిన్ని అంశాల‌పై ప్ర‌శ్నించ‌నున్నారు. కాగా రెండాకుల గుర్తు కేటాయించాల‌ని కోరుతూ ఎన్నిక‌ల అధికారికి లంచం ఇవ్వ‌బోయాడ‌ని ఆరోప‌ణ‌లు వచ్చిన సంగతి విదితమే. అయితే విచారణలో దినకరన్ మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు అంగీకరించాడు.. కానీ  తాను అతడికి డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు. మరి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.