తెరాస విలీనం..డౌటే

 

 TRS in rethink mode on merger with Congress, TRS merger with Congress, Telangana bill, congress

 

 

ఎన్నికల్లోగా తెలంగాణ రావడం అనుమానస్పందంగా మారినట్టే .. కాంగ్రెస్ లో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం కూడా సందేహాస్పదంగా మారింది. గత రెండ్రోజులుగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. సోమవారం విలేఖరులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ ... తెరాస విలీనంపై అడిగిన ప్రశ్నలకు మండిపడ్డారు.

 

అసలు విలీనానికి తెలంగాణా అంశానికి సంబంధం ఏముందంటూ రంకెలేశారు. తెలంగాణా ఏర్పటనేది రాజ్యాంగపరమైన ప్రక్రియ అనీ, విలీనం పార్టీల మధ్య విషయం అనీ గుర్తు చేశారు. అదే తరహాలో మంగళవారం ఏఐసిసి నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. తాము మాత ఇచ్చాం కాబట్టి తెలంగాణా ఇస్తున్నామన్న దిగ్విజయ్ .. దీనికి విలీనానికి సంబంధం లేదన్నారు.



మరి ఇప్పుడిలా మాట్లాడుతున్నా ఇదే నేతలు తెలంగాణ ఇస్తామన్న ప్రకటన వెంటనే తెరాస విలీనం గురించి ఎందుకు మాట్లాడారంటూ రాజకీయ వార్తాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ కుట్రలో భాగంగానే విలీనంపై రెండు పార్టీలు వెనక్కి తగ్గాయనే వాదన వినిపిస్తోంది.