చాక్లెట్స్ తో మొటిమలకి చెక్..!

 

చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే. తీయ్యటి చాక్లెట్స్ తినటానికి ఓ కారణం దొరకాలే కాని తినకుండా ఉండగలమా ? ఏ పుట్టినరోజుకో, పండగకో, కాదు ఇప్పడిక రోజు చాక్లెట్స్ తినడానికి ఓ తియ్యటి కారణం దొరికింది. అదే మొటిమ అవునండీ! అందమైన ముఖానికి ఓ చిన్ని మొటిమైన పెద్ద మచ్చ కిందే లెక్క అందులోనూ టీనేజ్ అమ్మాయికి మొటిమలతో పెద్ద పేచినే. ఇలా మొటిమలతో వేగలేని వారికీ ఓ తియ్యటి మందు కనిపెట్టిందో అమెరికా కంపెనీ విటమిన్లు, మినరల్స్తో నింపే ఓ చాక్లెట్ను తయారుచేశారు. వాటిని రోజుకు 2 నుంచి 5 దాకా తింటే చలట. రెండు మూడు వారాల్లోనే మొటిమలు తగ్గిపోవటం గ్యారెంటి అంటున్నారు.

ఈ చాక్లెట్ లో వాడే విటమిన్లు, మినరల్స్ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనా తగ్గుతాయట. అలాగే చర్మం లోపలకి చేరే జిడ్డుని కూడా తొలగిస్తాయట. దాంతో క్రమంగా మొటిమలు కూడా తగ్గుతాయట కాబట్టి మొటిమల కోసం క్రీములు, పైపూతలు వేసుకునే కష్టం లేదిక అందుకోసం గంటలు, గంటలు సమయం వృదా చేయక్కర్లేదు. హాయిగా ఓ తియ్యటి చాక్లెట్ నోట్లో వేసుకోవటమే. ఇంతకి ఆ చాక్లెట్ పేరు చెప్పలేదు కదు ' ఫ్రూటెల్స్' పేరుతో దొరికే ఈ చాక్లెట్ కీ ఇప్పుడు విదేశాలలో బోల్డంత డిమాండ్. కాదా మరి టీనేజ్ అమ్మాయిల్నే కాదు అబ్బాయిల్ని దడదడల లాడించే మొటిమలా మజాకానా!

....రమ