పళనీ స్వామే సీఎం.. పార్టీ బాధ్యతలు పన్నీర్ సెల్వానికి..


గత కొద్ది రోజులుగా తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడైతే అన్నాడీఎంక్ ఉప ప్రధాన కార్యదర్శి అయిన దినకరన్ ఈసీ అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయో.. అప్పటినుండి మరో కొత్త మలుపు తిరిగాయి. ఇక ఈ నేపథ్యంలోనే చేసేది పళనిస్వామి వర్గం, పన్నీర్ సెల్వం వర్గంతో విలీనం కావడానికి ఒప్పుకుంది. దీనిలో భాగంగానే గత రెండు రోజులుగా రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చర్చలు.. ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాలని పన్నీర్ సెల్వం చేసిన డిమాండ్ కు పళనీ స్వామి కూడా ఒప్పుకొని అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగాలని, పార్టీ బాధ్యతలు పన్నీర్ సెల్వానికి అప్పగించాలన్న ప్రతిపాదనలకు రెండు వర్గాలూ అంగీకరించారు. అయితే అమ్మ మృతిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్ కు.. ఈ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులో జరుగుతుంది కాబట్టి.. కొన్ని రోజులు ఈ అంశాన్ని పక్కన పెడదామని... కోర్టు నిర్ణయం తరువాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని పళని స్వామి వర్గం చెప్పడంతో.. దానికి పన్నీర్ సెల్వం అంగీకారం తెలపడంతో ప్రస్తుతానికి అన్నాడీఎంకే సంక్షోభానికి తెరపడినట్లు అయింది.