యువతితో బిజెపి ఎమ్మెల్యే లాడ్జ్ లో రాసలీలలు

 

 

Sex Scandal  BJP MLA Raghupathy Bhat, BJP MLA sex CD row, BJP MLA Raghupathy Bhat sex CD row

 

 

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజులు సమయం ఉండగా బీజేపీకి గట్టి ఎదుదెబ్బ తగిలింది. ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్ ఓ యువతితో లాడ్జ్ లో రాసలీలలు ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొందరు రహస్యంగా సీసీటీవి కెమెరాల్లో బంధించి మీడియాకు విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద దుమారం చెలరేగింది.

 

ఈ ఎమ్మెల్యే భార్య కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందులో రఘుపతిభట్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు పోలీసుల దర్యాప్తులో వుంది. తాజాగా మరో మరో సెక్స్ స్కాంలో అడ్డంగా దొరికిపోయారు. అయితే ఆ సీడీలో ఉన్నది తాను కాదని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని, ఏదో ఒకటి తేలే వరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని రఘుపతి భట్ స్పష్టం చేశారు.