సెరెనా నేర్పే పాఠ౦

 

 

Serena French Open crown, Serena French Open 2013,  Serena French Open title

 

 

సెరెనా విలియమ్స్ రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని గెలిచింది. ఇది వార్తగా చదివి వదిలెయ్యలేం! ఎందుకంటే ''11 సంవత్సరాలుగా ఫ్రెంచ్ ఓపెన్ లో సెరెనా ఓడిపోతూనే ఉంది.'' గత సంవత్సరమైతే మొదటి రౌండ్ లోనే ఓటమి పాలైంది. ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని గెలిచినా... అప్పుడు తన వయస్సు 20, మరి ఇప్పుడు 32 ఏళ్ళ సెరెనా విలియమ్స్ గెలుపు వెనక కనిపించే నిజాలివి...

 

ఓడిపోతూ కూడా నమ్మకం వదులుకోలేదు. ఆ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకొని వాటిని అధిగమించేదుకు కఠినంగా శ్రమించింది.మట్టికోర్టులో అడలేక పోవటాన్ని చాలెంజ్ గా తీసుకోని కోచ్ ని పెట్టుకొని మట్టికోర్టులో కొన్ని నెలల పాటు కఠోర సాధన చేసింది. చివరికి ఓడిపోయినా చోటనే గెలిచి, ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇంత పట్టుదల, దీక్ష, కృషి ఉన్నాయి కాబట్టే సెరెనా విలియమ్స్ ఖాతాలో 16 గ్రాండ్ స్లామ్ లు ఉన్నాయి.

ఎప్పుడైనా, ఎక్కడైనా ఓటమి మనల్ని కృంగదీసినపుడు సెరెనాని ఒక్కసారి గుర్తు చేసుకుంటే....ఓడిపోయేది గెలవటం కోసమేనని తెలిసి దూకుడుగా మరింత ముందుకు అడుగువేయగలం. లక్ష్యం ఉండటం గొప్ప కాదు... ఆ లక్ష్యం కోసం చేసే ప్రయాణం గొప్పది. సెరెనా విలియమ్స్ మనకి నేర్పే గొప్ప పాఠమీదే.