పవన్ పై మరోసారి వర్మ సెటైర్.. పవన్ కళ్యాణ్ దేవుడు...


రామ్ గోపాల్ వర్మ సాధారణంగా మాట మీద నిలబడడు అని చాలామంది చాలాసార్లే అన్నారు. అయితే అది మరోసారి నిజం చేశాడు వర్మ. ఇకపై పవన్ కళ్యాణ్ పై ఎలాంటి ట్వీట్స్ చేయను అని ఇంతకుముందు చెప్పిన వర్మ ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ పై ట్వీట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ 'నాకు మొక్కలంటే ప్రేమ..' అంటూ ట్వీట్టర్లో ఓ ట్వీట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన వర్మ... పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో పూరించాలని వర్మ కామెంట్ పెట్టాడు.

'అతడు దేవుడని నేను ఎల్లప్పుడు నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను 'పీకే'తో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్.. అతని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో.. ఇదెంత దుమారం రేపుతుందో చూడాలి.