రాహుల్ గాంధీ కుర్తాపై నెటిజన్ల జోకులు...

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై జోకుల్ పేలడం కామన్ థింగే. ఇప్పుడు మరోసారి నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు రాహుల్ గాంధీ. అది కూడా ఆయన చొక్కాపై. అసలు సంగతేంటంటే... ఉత్తరాఖండ్ లోని ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ  రాహుల్‌ తను వేసుకున్న కుర్తా చిరిగిందని.. జేబులో చెయ్యి పెట్టి మరీ అక్కడ ఉన్న వారికి చూపించాడు. అంతేకాదు దీనిపై కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ‘నా కుర్తా జేబు చిరిగిపోయింది. కానీ ఇది నాకు పెద్ద విషయం కాదు. కానీ మీరు ఎప్పుడైనా మోదీజీ చిరిగిన బట్టలు వేసుకోవడం చూశారా. ఆయన పేదల ప్రతినిధి అని చెప్తుంటారు కానీ పేదలపై రాజకీయాలు చేస్తున్నారు’ అని అన్నారు. అంతే ఇంకేముంది ఈ ఫొటో కాస్త నెటిజన్ల కంట్లో పడింది. దీనిపై ఒకటే కామెంట్లు విసురుతున్నారు. ఆ జోకులపై మీరు కూడా ఓ లుక్కేయండి.


‘కొత్త కుర్తా కొనుక్కోలేరు కానీ విదేశాల్లో సెలవులు గడపగలరా? డ్రామాలు ఆపండి’
‘మన ప్రియమైన రాహుల్‌గాంధీకి సరైన కుర్తా లేదు, పాతది వేసుకున్నారు. రూపాయి విరాళం ఇవ్వండి’
‘చార్టర్డ్‌ ప్లేన్‌లో వెళ్లేప్పుడు కుర్తా చిరిగిందా సర్‌?’
‘మనల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి రాహుల్‌ హాలిడేస్‌ నుంచి వచ్చేశారు. వి లవ్‌ యు, వి మిస్‌ యు’
‘నేను పేదవాడిని అని చెప్పుకోవడం అసలు ఎలాంటి అబద్ధం, ఈ మనిషి స్టుపిడిటీకి హద్దే లేదు’
‘విదేశాల్లో చాలా రోజులు సెలవులు గడిపి వచ్చి వెంటనే మోదీ పేదలను పట్టించుకోవట్లేదు అని విమర్శలు మొదలుపెట్టారా?’