పీకే పై పీకే సర్వే...జనసేన ఉందనే తెలీదట...

 

ఈ మధ్య రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయంటే.. తమ పార్టీల మీద కాన్సన్ ట్రేషన్ కంటే.. పక్క పార్టీల మీద కాన్సన్ ట్రేషన్ పెరిగిపోయింది. పక్క పార్టీల వాళ్లు ఏం చేస్తున్నారు.. వారికి ప్రజల మద్దతు ఎంత ఉంది.. ఇలా అన్నింటిమీద దృష్టిపెడుతున్నారు. దీనిలో భాగంగానే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఓ సర్వే చేసిందట. అది కూడా ఎవరి మీదో కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై. అదేంటీ టీడీపీని వదిలేసి పవన్ పై చేయడం ఏంటి అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి లాజిక్..

 

గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్, టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచింది. ఓ రకంగా టీడీపీ-బీజేపీ గెలవడంలో పవన్ కీలక పాత్ర పోషించారన్న మాట వాస్తవమే. దీంతో పవన్ కింగ్ మేకర్ అయ్యాడు. అయితే నంద్యాల, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పవన్ సహాయం లేకుండానే టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో రాబోయే ఎన్నికల్లో  పవన్ ప్రభావం ఏమిటి? ఆయన ప్రభావం ఎంత వరకూ ఉంటుంది అనే దానిపై ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ పరిశోధించిందట. ఈ పరిశోధనల్లో ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి తెలిసిందట. అదేంటంటే.. ఇంత వరకూ జనసేన అనే పార్టీ ఒకటి ఉందనేది రూరల్ ఆంధ్రాలో తెలీనే తెలియదట. పవన్ కల్యాణ్ పార్టీ గురించి  పేపర్లు, వెబ్ సైట్లు రాసుకోవడం, సోషల్ మీడియాలో పెయిడ్ పేజెస్ రన్ కావడమే కానీ.. సామాన్య ప్రజానీకానికి పవన్ పార్టీ ఒకటుందనేది తెలీదనేది.. ప్రశాంత్ కిషోర్ సర్వే ఫీడ్ బ్యాక్. అంతేకాదు.. ప్రస్తుత పరిస్థితే ఉంటే మాత్రం పవన్ కల్యాణ్ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయలేదని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు.

 

మరి తమ పార్టీ సంగతి పక్కన పెట్టి పక్కన పార్టీ గురించి సర్వే చేయడం కామెడీగా ఉంది. పక్కన పార్టీ మీద పెట్టినంద శ్రద్ద.. ముందు తమ పార్టీలో ఉన్న వారు పక్క పార్టీలోకి పోకుండా చూసుకునే దానిపై పెడితే బావుండేది. అయినా సర్వేలపై ఆధారపడి రాజకీయాలు నడపడం అనేది చాలా కష్టం. ఎందుకంటే.. సర్వేలు కూడా ఒక్కోసారి మారిపోయి.. రాజకీయ నేతల తలరాతలే మారిపోయిన రోజులు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఈ విషయం తెలుసుకుంటే వారికే మంచిది.