మణిపూర్ లో కూడా నెగ్గిన బలపరీక్ష..

 

గోవాలో జరిగిన బలపరీక్షలో ఇప్పటికే బీజేపీ నెగ్గి అధికారం చేపట్టింది. ఇప్పుడు మణిపూర్ అసెంబ్లీ బలపరీక్షలో కూడా బీజేపీ నెగ్గింది. మణిపూర్లో మొత్తం 60 స్థానాలకు గాను ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో మొత్తం 33మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికాయి. దీంతో ఈ రోజు ఆ రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నంగ్ తొంబన్ బీరేన్ సింగ్ నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కొని గెలిచారు.