కేంద్ర మంత్రులను దువ్వుతున్న కేసీఆర్...


ఎవరి సొమ్ములతో పండగ గిఫ్టులు ఇస్తున్నారు..?ప్రభుత్వ సొమ్ముతో మంత్రులకు, అధికారులకే గిఫ్టులు ఇవ్వడం ఏమిటి ? ఇప్పటి వరకు ఎక్కడన్నా ఇలాంటి సంప్రదాయం ఉందా..? ఇంతకీ ఈ ప్రశ్నలు ఎవరు ఎవరికి వేస్తున్నారు..? ఎవరు ఎవరిని తిడుతున్నారు అనే కదా డౌట్. ఇంకెవర్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్న ప్రశ్నలు. ఇంతకీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు...ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు అంటే... కేంద్రమంత్రులందరికీ కేసీఆర్ గిఫ్టులు ఇవ్వాలని ప్లాన్ వేశారంట. దీపావళి సందర్భంగా కేంద్రంలోని ముఖ్యులందరికీ ఖరీదైన కానుకలు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ బాధ్యతలను కేటీఆర్ తీసుకున్నాడట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా..  మూడు వందలకుపైగా కేంద్ర మంత్రులను, ముఖ్య అధికారులను ఎంపిక చేసి వాళ్లందరికీ ఖరీదైన గిఫ్టులను ఇవ్వడానికి ప్రిపేర్ అవుతోందట తెలంగాణ ప్రభుత్వం. ఒక్కోరికి ఇచ్చే గిఫ్ట్స్ ఖరీదు యాభై వేల రూపాయల వరకూ అని తెలుస్తోంది, దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గిఫ్టులను ఇస్తున్నారట. దీంతో కేసీఆర్ పై విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలైతే ఎవరి సొమ్మని కేసీఆర్ ఇలా ఖర్చుపెడుతున్నారని అంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇవేమి పట్టించుకోవట్లేదు. గిఫ్టులు సెలెక్ట్ చేసే పనిలోనే ఉన్నారు. మరి ప్రతిపక్ష నేతల విమర్శలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూద్దాం..