చంద్రబాబు ను ఫాలో అవుతున్న కేసీఆర్....

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాజకీయ చాణుక్యుడు అన్న పేరు కూడా ఉంది. అయితే ఈ పేరు ఆయనకు ఊరికే ఏం రాలేదులెండి. అందరూ రాజకీయ నేతలు ప్రస్తుతం గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు మాత్రం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఆ దిశగా వ్యూహాలు పన్నుతుంటారు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తాజాగా నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి...మరోసారి నిజంగానే రాజకీయ చాణుక్యుడు అని నిరూపించుకున్నారు. రెండు ఎన్నికల్లో గెలిచి అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చారు.

 

ఎన్నికల్లో తామే గెలుస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ కు ఈ ఓటమి గట్టిగానే షాకిచ్చింది. ఇక మిత్రపక్ష మైనా టీడీపీపై వాదనలు పెట్టుకునే బీజేపీకి చంద్రబాబు గట్టిగానే సమాధానం చెప్పారు. వైసీపీతో పెట్టుకునే ఆలోచనలు ఏమన్నా ఉంటే.. చంద్రబాబు దెబ్బకు ఆ ఆలోచనలు ఆవిరైపోయి ఉంటాయి.మాకు తోక‌గా ఉంటేనే ఏపీలో మీకు భ‌విష్య‌త్తు లేకుంటే ఏపీలో మీకు టోపీనే అనే విష‌యం క‌మ‌ల‌నాథుల‌కు అర్థం అయ్యేలా చేశారు. ఇక మన రాష్ట్ర నేతలకే కాదు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బాబు వ్యూహానికి షాకైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే..కేసీఆర్ చేయించిన సర్వేలో టీడీపీ ఓటమి పాలవుతుందని..వైసీపీ మెజార్టీతో గెలుస్తుందని.. కాస్త వైసీపీకి ఫేవర్ గానే మాట్లాడారు. కానీ ఫలితాలు చూసి కేసీఆరే ఖంగుతిన్నారు.

 

అందుకే కేసీఆర్ కూడా చంద్రబాబు వ్యూహాన్నే పన్నాలని చూస్తున్నారట. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి... ఆతరువాత టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఉపఎన్నిక తేవాల‌ని కేసీఆర్ ప్లాన్ వేశారట‌. అంతేకాదు.. న‌ల్గొండ ఎంపీ స్థానంతో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానానికి కూడా ఉపఎన్నిక‌లు జ‌రిపించేందుకు కేసీఆర్ పావులు క‌దుపుతున్నారని స‌మాచారం. ఎలాగైతే నంద్యాల ఉప ఎన్నికను 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించి టీడీపీ గెలిచి..వైసీపీని దెబ్బకొట్టిందో.. అలాగే... ఈ రెండుచోట్ల విజ‌యం సాధించి 2019 ఫైన‌ల్స్‌కి ముందు కాంగ్రెస్‌ని కోలుకోలేని దెబ్బ తీయాల‌ని కేసీఆర్ ప్లాన్ గీశారుట‌. దీంతో కేసీఆర్ కూడా చంద్రబాబు ను ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుద్దో..? లేదో చూద్దాం.. ?