కాంగ్రెస్-జేడీఎస్‌లకు అక్షింతలు... బలపరీక్ష వాయిదా వేయాలి ఓకే నా...!

 

ప్రొటెం స్పీకర్ గా బీజేపీ బోపయ్యను నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రొటెం స్పీకర్‌గా బొపయ్య నియామకం సరికాదని కాంగ్రెస్ తరఫు లాయర్ కపిల్ సిబాల్ అన్నారు. ఆయన విశ్వాస పరీక్ష చేపట్టవద్దన్నారు. గతంలో కోర్టు ఆయనకు మొట్టికాయలు వేసిందన్నారు. ప్రొటెం స్పీకర్ నియామకం ఏకపక్ష నిర్ణయమని కపిల్ సిబాల్ చెప్పారు. సీనియర్ మోస్ట్ లీడర్ ప్రొటెం స్పీకర్ కావాలన్నారు. బోపయ్యను ప్రొటం స్పీకర్‌గా నియమించడం ద్వారా నియమ, నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. బోపయ్య నియామకం విషయమే సిబాల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడం వరకైతే ఫర్వాలేదని, కానీ ఆయన విశ్వాస పరీక్షను లీడ్ చేయడం సరికాదన్నారు.

 

ఇక దానికి సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ఎప్పుడు కూడా సీనియర్ నేతలో ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించలేదు కదా అని ప్రశ్నించారు. డివిజన్ ద్వారా బలపరీక్షకు ఆదేశాలు జారీ చేస్తామని, అసెంబ్లీ బలపరీక్షను లైవ్ ద్వారా ప్రసారం చేయాలని ఆదేసాలు జారీ చేస్తామని, మీరు చెప్పినట్లు ప్రొటెం స్పీకర్ నియామకంపై విచారణ జరగాలంటే ఆయనకు నోటీసు ఇవ్వాలని, అప్పుడు బలపరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే కాంగ్రెస్- జేడీఎస్ అడిగిన సౌకర్యాలకు అంగీకరించింది.