జయలలిత ఆస్తులపై పిటిషన్... జాతీయం చేయాలి..

Publish Date:Jan 11, 2017

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులను జాతీయం చేయాలని కోరుతూ.. తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ  మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జయలలితకు వారసులెవరూ లేరు కనుక ఆమె ఆస్తులు జాతీయం చేయాలని.. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారం అంతా నిర్వహించేందుకు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని...ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

By
en-us Politics News -