భత్కల్‌ విడుదలకు కేజ్రీవాల్ కిడ్నాప్?

 

 

 

ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను విడిపించుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కిడ్నాప్ చేయడానికి ఐఎం కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని కేజ్రీవాల్ దృష్టికి తీసుకొనివెళ్ళారు. 'జడ్' కేటగిరీ భద్రత కల్పించడానికి అనుమతించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇతర నగరాలలో కూడా బాంబు పేలుళ్ళతో భయోత్పాతం సృష్టించాలని కూడా ఉగ్రవాదులు చూస్తున్నట్లు తెలిసింది.

 

కేంద్ర నిఘావర్గాలు హెచ్చరికతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యాసిన్ భత్కల్‌ను విచారణ నిమిత్తం బెంగళూరుకు తరలించిన నేపథ్యంలో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసే అవకాశాలున్నాయనే హెచ్చరికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, కేఎస్ఆర్‌పీ బలగాలతో పాటు విమానాశ్రయ ప్రత్యేక బృందాలు బందోబస్తులో పాల్గొన్నాయి.