గుండె కి ఆహరం

  

 

వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది అరటిపండు - రోజుకో అరటిపండు ఆరోగ్యాన్నిస్తుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు అయితే రోజుకో అరటి పండు తినడం ద్వారా గుండె జబ్బులను చాల వరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు అంటున్నాయి కొన్ని పరిశోధనలు.

 

 

రోజుకో అరటిపండు తినడం వల్ల ఒక్కసారిగా దాడిచేసే ఆకస్మిక గుండె నెప్పులనుంచి 40 శాతం రక్షణ పొందువచ్చుట దీనికి కారణం అరటిపండులో  సమృద్దిగా  ఉండే  పొటాషియం బి.పి ని అదుపు లోవుంచి రక్త పోటు రాకుండా కాపాడుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక క్యారెట్లు కూడా అరటిపండ్లతో  సమానంగా గుండె జబ్బులను నియంత్రిస్తుంది, అంటున్నారు ఆహార నిపుణులు క్యారేట్లోని కెరోటినాయిడ్లకు గుండె జబ్బులు నివారించే శక్తి ఉంటుంది రోజుకి 5 పచ్చి   క్యారెట్లను తినాలని ఇలా తినటం వల్ల గుండె జబ్బులను 68 శాతం నియంత్రిచవచ్చునని గట్టిగ చెబుతున్నారు హార్వర్డ్  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. '
 

అలాగే ఎక్కువ శాతం గుండె జబ్బులకు రక్తం గడ్డ కట్టడమే ముఖ్య కారణంగా వుంటుంది - అందుకు   " బ్లాక్ టీ " చక్కటి పరిష్కారమట  రోజుకి రెండు కప్పుల బ్లాకు టీ  60శాతం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అలాగే మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది. అంతే కాదు వీటన్నిటితో పాటు కంటినిండా చక్కటి నిద్రకూడా ఎంతో ముఖ్యం. పనుల్లోపడి నిద్రపోయే సమయం తగ్గిపోతే గుండె జబ్బులు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారువైద్య నిపుణులు. 

 మరి గుండెని భద్రంగా చూసుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తారు కదు.

                                                               - రమ