గిల్గిట్-బాల్టిస్థాన్ భారత్ దే.. పాకిస్థాన్ ఆక్రమించుకుంది..


గిల్గిట్-బాల్టిస్థాన్ విషయంలో బ్రిటన్ పార్లమెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గిల్గిట్-బాల్టిస్థాన్ ను ఐదో రాష్ట్రంగా పాకిస్థాన్ ప్రకటించడాన్ని బ్రిటన్ పార్లమెంటు తప్పబట్టింది. చట్టబద్ధంగా ఈ భూభాగం భారతేదేశంలోని జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోనిదని..  1947లో చట్ట విరుద్ధంగా, అక్రమంగా ఈ భూభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించుకుందని తెలిపింది. దీనికి సంబంధించి ఈ నెల 23న కన్సర్వేటివ్ నేత బాబ్ బ్లాక్ మన్  పార్లమెంటులో తీర్మానాన్ని ప్రతిపాదించాడు. ఈ తీర్మానంలో వివాదాస్పదమైన ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకునే విధంగా పాక్ ప్రకటన ఉందని.. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల ప్రాథమిక హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయని..  కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా అక్కడి పౌరులకు లేదని చెప్పింది.