లారీ బీభత్సం.. 20 మంది మృతి

 

చిత్తూరుజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ దుకాణాలపైకి దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది. వివరాల ప్రకారం.. చిత్తూరుజిల్లా ఏర్పేడులోని పీఎన్‌ రోడ్డులో ఓలారీ విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి.. దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులు వైద్యులను ఆదేశించారు.  సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు ప్రమాద ఘటన పై సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతికి గురయ్యారు.