మరో ట్విస్ట్.. ఇదంతా శశికళనే చేయిస్తున్నారా..?

 

తమిళనాడులో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠంగా మారుతున్నాయి. ఒకపక్క పన్నీర్ సెల్వం వర్గం, పళనీస్వామి వర్గం విలీనంపై చర్చలు జరుగుతుండగా..ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ వ్యవహారం మొత్తం శశికళనే జైలు నుండి నడిపిస్తున్నారా..? అని. పన్నీర్‌ వర్గానికి చెందిన కేపీ మునుస్వామి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నీర్‌ వర్గానికి మద్దతుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ అనంతరం మునుస్వామి మీడియాతో మాట్లాడారు. పళనిస్వామి వర్గం నేతలు చేస్తోన్న పలు వ్యాఖ్యలు పలు సందేహాలకు తావిచ్చేవిగా ఉన్నాయనీ, బెంగళూరు జైలులో ఉన్న శశికళయే ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నట్టు తమకు అనుమానం వస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువర్గాల మధ్య సయోధ్య ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. మరి ఈ వ్యాఖ్యలపై  పళనిస్వామి వర్గం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.