టి ఎఫెక్ట్: 15 సీమాంద్ర మంత్రులు రిజైన్!

 

 

 

సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదిహేను మంది సీమాంద్ర మంత్రులు రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. నేషనల్ కాన్పరెన్సు కూడా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన విషయాన్ని గమనిస్తే పార్టీ అధిష్టానం తమ వైఖరి మార్చుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.

 

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఫలితం వస్తే పదిహేను మంది మంత్రులం రాజీనామా లేఖలపై సంతకాలు చేసి సిద్ధంగా ఉన్నామన్నారు.సమైక్య రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నామని, విభజన నిర్ణయం జరిగాక మంత్రులుగా కొనసాగడం సరికాదని భావిస్తున్నామని అన్నారు.తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామా ఆమోదించాలని తమ లేఖలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చినట్లు చెప్పారు.



రాయలసీమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. రాయలసీమ ఎమ్మెల్యేలతో సమావేశం జరపాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.