Home » ఇదేమి చిత్రమో
“ఇదేమి చిత్రమో”
Vammoi (Idemi Chitramo)
వామ్మోయ్ …!
అతను రోడ్డుపై పారిపోతున్నాడు వేగంగా… అతన్ని కొందరు మనుషులు తరుముతున్నారు… వారి చేతుల్లో రాళ్ళు, కట్టెలు, బరిశెలు, గొడ్డళ్ళు లాంటి పరికరాలు తళతళా మెరుస్తున్నాయి.
“వద్దు … వద్దు… నన్నేం చేయొద్దు… నన్నేం చేయొద్దు…”
అతను పరుగు ఆపకుండానే గట్టిగా అరుస్తున్నాడు…
“వద్దు… వద్దు… నన్నేం చేయొద్దు…”
“ఒరేయ్ ఆగరా… ఆగు… నిన్ను అలా ఇలా కాదురా ముక్కలు ముక్కలుగా నరికేసి కాకులకు గద్దలకు నీ పార్టులన్నీ వేసేస్తాంరా…” ఓ వ్యక్తి పరుగు ఆపకుండానే వీరావేశంగా అన్నాడు.
“అయ్యబాబోయ్… మీకు దండం పెడ్తాను [...]

