తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. దీనితో మన నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు. ఇది మనకేకాక చాంద్రమానం అనుసరించే కన్నడీయులకు, మహారాష్ట్రులకు కూడా సంవత్సరాది. ఇది చైత్రశుద్ద [...]
పడకేసిన పరిశ్రమలు
హైదరాబాద్: ఎండలు ముదురుతున్న కొద్దీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతోంది. వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ కోతల వల్ల హెచ్.టి వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పరిశ్రమల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై విద్యుత్ కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. వచ్చే మూడునెలల్లో ఇదే పరిస్ధితి కొనసాగితే, పరిశ్రమలను మూసివేసే ప్రమాదం ఉందని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జనవరి నెలలోనే ట్రాన్స్‌కో, డిస్కాం [...]
ప్రకృతి పరిమళం ఈ పుష్పం
విజయవాడ: మత్తెక్కించే సువాసనతో ఎంతటి వారినైనా తన దాసోహులను చేసుకునే సత్తా కలిగిన ప్రకృతి పరిమళం మల్లెపూలతో నగరం గుభాళిస్తోంది. ప్రతి వేసవి కాలాన ప్రకృతి నుంచి జాలువారే ఈ పూలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మల్లెపూల రాకకోసం ఎదురుచూడని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఆడపడుచూ రెండు దోసిళ్ళ పూలతో తన వాలుజడను సింగారించుకోవాలని ఆరాటపడుతుంది. బాలిక మొదలుకుని కాటికి కాలుచాచిన వృద్ధురాలి వరకూ మల్లెపూల సీజన్ వేసవి కోసం నిరీక్షిస్తుంటారు. [...]
ఘంటసాల స్వగ్రామానికి కొరవడిన గుర్తింపు
అగాధమౌ జలనధిలోని ఆణిముత్యానికి అచ్చమైన నిర్వచనం మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ‘సోకాల మరుగున దాగి సుఖమున్నదిలే’ అని ఆయన ఆలపించిన గీతం కూడా ఆ సంగీత కళానిధి జీవితానికి అతి చక్కని అన్వయమంటే అతిశయోక్తి కాబోదు. ఆ గాన గాంధర్వుడు భౌతికంగా మన అందరికీ దూరమైనా ఆయన గానం అజరామరం. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి సినీసాహిత్యమనే బంగారానికి అద్దిన పరిమళం ఘంటసాల అమరగానం.
కృష్ణాజిల్లా దివిసీమ లోని మోపిదేవి మండలం, టేకుపల్లి అనే కుగ్రామంలో [...]
శక్తిస్వరూపిణి ‘మహిళ’
ఈరోజు నిజంగా ఓపండుగ రోజు. అదే శత వసంత మహిళా దినోత్సవం. సాధికారతకు పట్టాభిషేక ముహుర్తం… అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నూరేళ్ళు. రెండు ప్రత్యేక సందర్భాలు కలిసివచ్చే రోజు. ఆరంభనాదం – ఓంకారం! ఓంకారంలో స్త్రీ స్వరం నిక్షిప్తమై ఉంది. అందుకే- ఓం నమః ఉమన్ నమః. మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీ విముక్తికోసం పోరాడేవారికి స్ఫూర్తినిచ్చే రోజు. మార్చి-8వ తేదీకి చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఉంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నీడిల్ ట్రేడ్ కు [...]
అంతటి ప్రాముఖ్యం దీనికే సొంతం…
కుంభమేళ ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని హరిద్వార్ పట్టణంలో వైభవంగా కొనసాగుతోంది. దేశవిదేశాలలోని ఎంతోమంది భక్తులు ఈ పవిత్ర మేళాలో పాల్గొనేందుకు అసంఖ్యాకంగా విచ్చేస్తున్నారు. రకరకాల సాధువులు, భక్తులతో హరిద్వార్ సందడిని తలపిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేళాని పూర్ణకుంభమేళాగా, 6 సంవత్సరాల కొకసారి జరిగేదాన్ని అర్ధకుంభమేళగా పిలుస్తారు. దీంతోపాటు ప్రతి 3 సంవత్సరాల కొకసారి అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయని పట్టణాల్లోఒక్కొక్క కుంభమేళ జరుగుతుంది. బహుష్కృతి కుంభరాశిలోకి, సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన రోజునుంచి ఈ మేళ [...]
మహిళ మహరాణి అవుతుందా?
మహిళా బిల్లుకు ఇంతకు ముందెన్నడూ లేనంత అనుకూల వాతావరణం పార్లమెంట్లో ఈ సారి కనిపిస్తున్నది. మహిళలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ బంగారు తరుణం నిజంగా బంగరమేనా? చట్టసభల్లో మహిళలకు మంచిరోజులొస్తాయి సరే ఆ మంచి సాధారణ మహిళలకు ఏ స్థాయిలో చేరనుంది. మహిళలు దీనిపట్ల ఎట్లాంటి భావనలను వ్యక్తపరుస్తున్నారనేది ముఖ్యం. పురుషాధిక్య సమాజంలో మహిళలు తమ ఉనికిని కాపాడుకోడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తమ హక్కుల కోసం, అవకాశాల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన [...]
శ్రీవారికి పక్కరాష్ట్రంలో నామాలు…
మన సొమ్ము కాకపోతే ఎంతైనా ఎలాగయినా ఖర్చుపెట్టవచ్చు అంటారు తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలి పెద్దలు కన్యాకుమారిలో సమావేశం నిర్వహించిన తీరు ఇందుకు ఉదాహరణలని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు. తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారిగా పాలకమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తమిళనాడులోని కన్యాకుమారిలో ఆదివారం జరిగింది. టీటీడీ సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ తో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు. పాలకమండలి సమావేశం తిరుమలలో పెట్టకుండా కన్యాకుమారిలో నిర్వహించడం పట్ల పలువురు భక్తులు ఆభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. [...]
వసంతోత్సవ హేల “హోళీ’
కాలచక్ర భ్రమణంలో, షడ్రుతు సంక్రమణంలో, మాఘపౌర్ణిమ మధురాతి మధుర చంద్రికా స్నపితావరణంలో, శిశిర వసంతాల పరిణామ పర్యావరణభరణంలో, పచ్చని చివురుల యవనిక తొలగించుకు వచ్చే, మంజుహాస విలసన్నవ లతాంత మాలికా తోరణంలో, మందమందమలయా నిలయ చారణంలో, “ముగ్ధ’ లా వాసనాగ్ధలా, మన తనువులనీ, మనసులన్నీ పరిరంభించి, పరవశింపజేసే పండుగ, వసంతోత్సవ హేల హోలీ. వర్ణ వర్ణార్ణవంలో, ఒళ్లు మరిచి జలకాలాటలో, తేలేతరుణంలో, కుల, మత, వర్ణ వ్యత్యాసాలే కాక, వావి వరుసలు కూడా పాటించాలనే నియమంలేని, స్త్రీ [...]
ఆ ఒక్కటీ సాధిస్తే..
వ్యక్తిగతంగా మాస్టర్ కెరీర్ పరిపూర్ణమయింది. ఇక మిగిలింది ఒక్కటే.. వన్డే ప్రపంచ కప్. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆరాధ్యదైవం సచిన్, ఎప్పటినుంచో ఎందరినో ఊరిస్తూ వస్తున్న వన్డేల్లో డబుల్ సెంచరీ చివరికి మాస్టర్ కే అందింది. ఇదేదో అల్లాటప్పా జట్టుపై సాధించిన రికార్డు కాదు. ఏ జింబాబ్వే పైనో, కెన్యా పైనో ఈ ఘనత సాధిస్తే ఏముందిలే అనుకోవచ్చు. కానీ సచిన్ ప్రస్థుతం క్రికెట్ లో అత్యుత్తమ పేస్, బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాపై ఈ విజయం [...]

