న్యూడిల్లీ: అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీనితో లోక్‌సభలో ప్రతిపాదిత బిల్లు ప్రవేశపెట్టడంపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిసున్న ఎస్‌పి ఆధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ జెడియు అద్యక్షుడు శరద్‌యాదవ్ గురువారం ఆర్ధికమంత్రి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోవడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది. సమావేశంలో తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనరర్జీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్, డియంకె నాయకుడు టీ.ఆర్ బాలు [...]
ఆ దిశగా నేతల్లో ఆలోచనలు
హైదరాబాద్: మహిళా బిల్లుకు మోక్షం లభిస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 100 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది మగ ఎంపీలు తమ స్థానాలు కోల్పోతారు. ప్రస్తుతం శాసనసభలో 35 మంది, లోక్‌సభలో ఐదుగురు మహిళా ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము కోల్పోనున్న స్థానాల్లో తమ పట్టు కొనసాగించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో తమ కుటుంబాల నుంచి ఎవరిని బరిలోకి దించాలన్న దిశగా నేతల్లో ఆలోచనలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ మహిళలకు [...]
పంతం నెగ్గించుకున్న యాదవ్స్
న్యూఢిల్లీ: మహిళా బిల్లు వల్ల బీసీ, మైనారిటీ, దళితులకు అన్యాయం జరుగుతుందనే వాదనతో మొదటి నుంచి బిల్లును వ్యతిరేకిస్తున్న ఆర్జేడీ, ఎస్పీ, జేడీ(యు) అధినేతలు లాలు, ములాయం, శరద్ యాదవ్ లు తమ పంతం నెగ్గించుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరు చేస్తున్న ఆందోళనతో కేంద్రం దిగివచ్చింది. మహిళాబిల్లుపై అందరి వాదనలు వింటామని, ఇందుకోసం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్రమంత్రి ప్రణబ్ ప్రకటించారు. తొలి నుంచి ఈ మూడు పార్టీలు మహిళా బిల్లును ప్రస్తుత [...]
‘సమైక్యవాదం వెనుకబడుతోంది’
హైదరాబాద్: రాష్ట్రంలో సమైక్యవాదం వెనకబడుతోందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. అందుకు కాంగ్రెస్ రాయలసీమ శానససభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని జేసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యవాదం నినాదం ఇవ్వకుండా ప్రత్యామ్నాయం గురించి ఆలోచనలు జరుగుతున్నట్లు జేసీ ప్రకటన తెలియజేస్తోందని ఆయన అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి ప్రకటనపై [...]
‘సీమను భరించలేం’
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే రాయలసీమను తెలంగాణతో కలిపి ఉంచాలనే తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపాదనను కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ్యుడు పి. శంకరరావు తిరస్కరించారు. రాయలసీమను తెలంగాణ భరించలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాయలసీమ వల్లనే తెలంగాణ వెనుకబడిపోయిందని ఆయన అన్నారు. వనరులున్నా తెలంగాణ అభివృద్ధి జరగకపోవడానికి రాయలసీమ నేతలే కారణమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించింది సీమవాసులేనన్నారు. వారి నుంచి తెలంగాణకు ఎక్కువ నష్టం [...]
పార్లమెంటులో తెలంగాణ బిల్లు!
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు భారతీయ జనతాపార్టీ సమాయత్తం అవుతోంది. శుక్రవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింగ్ రూఢీ ఈ బిల్లుకు లోక్ సభలో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ విషయమై రాష్ట్ర బీజేపీ నేత విద్యాసాగర్ రావును వివరణ అడుగగా…తమ పార్టీ తెలంగాణకు ఎప్పటినుంచో అనుకూలంగా [...]
జేసీ కొత్త నినాదం
హైదరాబాద్: రాష్ట్ర విభజన తప్పనిసరైతే… రాయలసీమను తెలంగాణలో కలపాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజనపై చర్చించేందుకు బుధవారం సమావేశమైన రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర వారికి ఎలాంటి నష్టం లేదని, సీమకే ఎక్కువ నష్టం అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతం ఆంధ్రాతో కలిసి ఉండటం వల్ల నీటి సమస్య వస్తుందన్న ఆయన… తెలంగాణ సాయం లేకుండా రాయలసీమకు చుక్కనీరు కూడా దక్కదని, రాష్ట్రం [...]
దానిలోనూ మార్చి 16లోపేనంట…
న్యూఢిల్లీ: రాజ్యసభ ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుని మార్చి 16లోపే లోక్‌సభలోనూ ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ అభిమతమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పి.కె. బన్సాల్ చెప్పారు. మార్చి 16న లోక్‌సభ మూడు వారాల విరామం కోసం వాయిదా పడుతుంది. కాబట్టి ఈ లోపే బిల్లుని సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
బలం ఉన్నా సాహసించని ప్రభుత్వం
న్యూఢ్లిలీ: మహిళా బిల్లు ఆమోదంలో తొలి అంకం ముగిసింది. లోక్‌సభ ఆమోదం ద్వారా మలి అంకం కూడా పూర్తయితే చరిత్రాత్మక ఘటం ఆవిష్కృతమవుతుంది. అది ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత పరిస్ధితులను పరిశీలిస్తే బిల్లును లోక్‌సభలో వెంటనే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. సోనియా స్పందన కూడా దీన్ని ద్రువీకరిస్తోంది. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్ నుంచి ఆమె వెళ్తున్నప్పుడు లోక్‌సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశ పెడుతున్నారన్న ప్రశ్న ఎదుర్కొన్నారు. దానికి ఆమే సరైన సమాధానం దాటవేశారు. చూద్దాం [...]
తొలి అడుగు వేశామన్న సోనియా
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ ప్రకియలో తొలి అడుగు వేశామని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. రాజ్యసభలో మహిళా బిల్లు అమోదం పొందినందుకు సంతోషంగా ఉందని అమె వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత తన భర్త రాజీవ్ గాంధీ స్వప్నమని ఆమె గుర్తు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఉత్సాహవంతురాలని సోనియా కొనియాడారు. ఆమెతో తానింకా మాట్లాడలేదన్నారు. తమతో సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టిందని అంతకుముందు [...]

