హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కీలక అంశంమైన ఫ్రీజోన్ పై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఆమోదించడాన్ని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తీవ్రంగా తప్పుపట్టారు. ఫ్రీజోన్ పై ఎటువంటి చర్చ లేకుండా అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఏకపక్షంగా ఆమోదించడం దారుణమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. ఏ ప్రాంత ప్రజలకు ఎంతమేర నష్టం, ఎవరికి లాభం అనే అంశాలను కూలంకషంగా చర్చించిన పిమ్మట ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆయన [...]
నదిలో బస్సుపడి 18మంది మృతి..
ఖాట్మండు: పశ్చిమ నేపాల్‌లో గురువారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన కిట్టూ అనే గ్రామంలో జరిగింది. కాక్రే విహార్ యాతాయాత్ ప్రైవేట్ సంస్ధకు చెందిన ఈ బస్సు దాయ్‌లెఖ్ నుంచి కుర్ఖేత్ జిల్లాకు ప్రయాణిస్తుండగా కాలీకోట్ – సురేత్ హైవే మీది నుంచి వేగంగా ప్రవహిస్తున్న కర్నాలి నదిలో పడిపోయింది. దాంతో 18 మంది అక్కడికక్కడే [...]
పదవికోసమే ఏకపక్ష నిర్ణయాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటానికే రోశయ్య అఖిలపక్షం పేరుతో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం చేయబోయే 14 ఎఫ్ రాజ్యాంగ సవరణను ఉమా తీవ్రంగా విమర్శించారు. మొత్తం 3,488 పోలీసు నియామకాల్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాదులు 1750 మంది నియామకం కాగా, తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంలో 1713మంది నియామకం అయినట్లు తెలిపారు. అన్ని ప్రాంతాల వారి మనోభావాలు స్వీకరించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం సరికాదని [...]
పార్టీ నిర్ణయానికి కట్టుబడదాం
హైదరాబాద్: ఫ్రీజోన్ అంశంపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఈ అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురువారం ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని బుజ్జగించే యత్నాలు చేశారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగానే ఫ్రీజోన్ పై చట్ట సవరణకు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నట్లు రోశయ్య తెలిపారు. కాగా తీర్మానానికి ఆమోదం తెలిపితే తెలంగాణకు సానుకూల సంకేతాలు వెళ్తాయన్న సీమాంధ్ర నేతల వాదనను ముఖ్యమంత్రి ఏకీభవించలేదు. అటువంటిది ఏమీ [...]
తీవ్రమైన ఉద్యమానికి శ్రీకారం
హైదరాబాద్: ఫ్రీజోన్ అంశంపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ ను ఆరో జోన్ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందన్నారు. హైదరాబాద్ ఆరో జోన్ [...]
19న తెలుగు చిత్రపరిశ్రమ బంద్
హైదరాబాద్: పైరసీని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఈ నెల 19న బంద్ పాటించాలని, సినిమా థియేటర్లు, షూటింగ్ లు, ఇతర సంబంధిత కార్యాలయాలు, కార్యకలాపాలు ఏవీ ఆ రోజు పని చేయరాదని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పిలుపు నిచ్చింది. పైరసీకి వ్యతిరేకంగా ఫిలిం చాంబర్ వద్ద ‘మాయగాడు’ చిత్ర నిర్మాత యలమంచిలి రవిచంద్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష కు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్‌టిఆర్, అల్లు అర్జున్, నిర్మాత రామానాయుడులతోపాటు సినీ [...]
ఊరిస్తున్న రోశయ్య విస్తరణ
కృష్ణాజిల్లా: రోశయ్య మంత్రి వర్గ విస్తరణ యువ ఎమ్మెల్యేలను ఊరిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ముఖ్యమంత్రి మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. రోశయ్య క్యాబినెట్‌లో జిల్లా నుంచి మరొక ఎమ్మెల్యేకు మంత్రి పదవి కల్పించాలనే ఒత్తిడి పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగితే జిల్లా నుంచి పేర్ని వెంకట్రామయ్య (నాని) లేదా మల్లాది విష్ణులలో ఒకరికి చాన్సు లభించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఎస్‌సీలకు అవకాశం కల్పిస్తే దాస్‌కు మంత్రి [...]
కేటాయింపులు మూరెడు…
విజయవాడ: రైల్వే బడ్జెట్‌లో హామీల వర్షం కురిసినా, నిధుల కేటాయింపులో మాత్రం విజయవాడ డివిజన్‌కు అరకొర కేటాయింపులే మిగిలాయి. ఆశగా ఎదురుచూస్తున్న విజయవాడ – గుడివాడ – మచీలీపట్నం – భీమవరం – నిడదవోలు డబ్బీంగ్ పనులకు పైసా కూడా కేటాయింపులు జరగలేదు. ఈ పనులకు ప్లానింగ్ కమిషన్ ఆమోదం రాకపోవడం వల్ల ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయించలేదని, దీంతో ఈ ఏడాది ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాజెక్టుల్లో కూడా [...]
భారీగా దొంగనొట్ల చెలామణి!
న్యూఢిల్లీ: దేశంలో భారీగా దొంగనోట్లు చెలామణిలో ఉన్నట్లు ఆర్‌బీఐ అనుమానిస్తోంది. వెయ్యి, ఐదు వందల రూపాయలలో దొంగనోట్లు చెలామణి అధికంగా ఉందని బ్యాంకులను ఆర్‌బీఐ అప్రమత్తం చేసింది. వెయ్యి రూపాయల నోట్లలో 2ఏసీ, 8ఏక్యూ సీరిస్‌లలో దొంగనొట్లు ఉన్నట్లు తెలిపింది. ఐదు వందల రూపాయల నోట్లలో 10ఏక్యూ సీరిస్‌లో దొంగనోట్లు ఉన్నట్లు గతంలో స్పష్టం చేసింది.
సినీ ప్రముఖుల మద్ధతు
హైదరాబాద్: చిత్రపరిశ్రమను అతలాకుతలం చేస్తోన్న పైరసీని అరికట్టాలని, పైరసీకి పాల్పడే వారిని గూండా చట్టం కింద శిక్షించాలని కోరుతూ సినీ నిర్మాత, ‘మాయగాడు’చిత్ర నిర్మాత రవిచంద్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు సినీ ప్రముఖులు అనేకమంది మద్దతు తెలుపుతున్నారు. బుధవారంతో ఆయన దీక్ష మూడవరోజుకు చేరింది. ప్రముఖ నటులు, పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి, మురళీమోహన్, దగ్గుపాటి సురేష్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీ ఆర్ తదితరులు పైరసీ రక్కసికి వ్యతిరేకంగా పోరాడుతున్న రవిచంద్ దీక్షకు మద్దతు ప్రకటించారు. పైరసీకి [...]

