Home » Cine News “Cine News”

దీక్ష విరమించిన నిర్మాత

హైదరాబాద్‌: పైరసీని అరికట్టాడానికి పటిష్టచర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం హామీతో “మాయగాడు’ నిర్మాత చిత్ర రవిచంద్‌ గురవారం ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.  పైరసీకి వ్యతిరేకంగా నాలుగురోజులుగా ఆయన దీక్ష చేస్తున్న విషయం తేలిసిందే.  పైరసీ అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం సినీ ప్రతినిధులకు హామీనిచ్చింది.  దీంతో మురళీమోహన్‌, ఇతర సినీ ప్రముఖులు రవిచంద్రచేత దీక్ష విరమింపజేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పైరసీ నిరోధానకి అర్డినెన్స్‌ తెచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని శ్యాంప్రసాద్‌రెడ్డి చెప్పారు.

March 18 2010 | Posted in Cine News, Headlines | Read More »

బంద్‌ను విరమించిన చిత్రపరిశ్రమ

హైదరాబాద్‌:  పైరసీకీ వ్యతిరేకంగా రేపు ప్రకటించిన బంద్‌ను చిత్ర పరిశ్రమ ఉప సంహరించుకుంది. రేపటి రోజున షూటింగులు యథావిధిగా నిర్వహించుకోవచ్చని, థియేటర్లలో సినిమాలను ప్రదర్శించుకోవచ్చని చిత్ర పరిశ్రమ స్పష్టం చేసింది.  పైరసీకి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణీత కాలవ్యవధిలో కఠిన చట్టాల అమలుకు నిర్ణయం తీసుకోవడం, ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించడంతో చిత్ర పరిశ్రమ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.  దీనితో రేపు బంద్‌ అవసరం లేదని చిత్ర పరిశ్రమ వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. సినీ పరిశ్రమ రేపు [...]

March 18 2010 | Posted in Cine News, Headlines | Read More »

ఎస్సై స్ధాయిలో దాడులు చేయిస్తాం: మంత్రి

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచార, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు.  పైరసీని అరికట్టేందుకు వీడియో పైరసీ చట్టాన్ని బలపరిచి, పటిష్టంగా అమలు చేయాలని చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కోరారని, దానికి తమ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు.  చిత్ర పరిశ్రమతో మొదటినుంచి కాంగ్రెస్‌ పార్టీ సన్నిహితంగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుందని పేర్కొన్నారు.  పైరసీదారులపై ఎస్సై స్ధాయి పోలీసులతో దాడులు చేయిస్తామని తెలిపారు.  తమిళనాడులో తరహాలో పైరసీపై [...]

March 18 2010 | Posted in Cine News, Headlines | Read More »

డిజిటల్‌ పైరసీపై ఉద్యమం

హైదరాబాద్‌: సినీ పరిశ్రమ బంద్‌ రూపంలో డిజిటల్‌ పైరసీపై ఉద్యమం ఉద్దృతం చేసేందుకు సిద్దమైంది.  ఈ ఉద్యమం చిన్న స్ధాయిలో రూపొందగా ఇప్పుడు మరింత తీవ్రంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానల్‌లో పైరసీపై  ‘తెరకు ఉరి’ అనే కార్యక్రమంలో చర్చ జరిగింది. దీనిలో సినీ హీరో మరియు నిర్మాత శివాజీ, తెలుగువన్‌ డాట్‌ కామ్‌ యండీ కంఠంనేని రవిశంకర్‌లు పాల్గొన్నారు. తొలుత రవిశంకర్‌ మాట్లాడుతూ డిజిటల్‌ పైరసీ జరగడానికి రెండు కారణాలు ఉన్నాయన్నారు.  సినిమా [...]

March 18 2010 | Posted in Cine News, TeluguOne Exclusive | Read More »

19న తెలుగు చిత్రపరిశ్రమ బంద్

హైదరాబాద్: పైరసీని నిర్మూలించాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఈ నెల 19న బంద్ పాటించాలని, సినిమా థియేటర్లు, షూటింగ్ లు, ఇతర సంబంధిత కార్యాలయాలు, కార్యకలాపాలు ఏవీ ఆ రోజు పని చేయరాదని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పిలుపు నిచ్చింది. పైరసీకి వ్యతిరేకంగా ఫిలిం చాంబర్ వద్ద ‘మాయగాడు’ చిత్ర నిర్మాత యలమంచిలి రవిచంద్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష కు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్‌టిఆర్, అల్లు అర్జున్, నిర్మాత రామానాయుడులతోపాటు సినీ [...]

March 18 2010 | Posted in Cine News, Regional | Read More »

“దళపతి”గా వస్తున్నఅర్జున్‌

అర్జున్‌ కథానాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం “దళపతి”. కిచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీతారామ ఫిలింస్‌ పతాకంపై నాగరాజు నిర్మిస్తున్నారు. అర్చన, హేమ కథానాయికలు. తమిళంలో “మాసీ” పేరుతో ఈ చిత్రం నిర్మితమవుతుంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ… “ఓ విభిన్న కథాంశంతో అర్జున్‌ యాక్షన్‌ చిత్రాల్లో వైవిధ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దేశరక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో ఓ యువకుడు ఆరాచక వ్యవస్థపై సాగించే సామాజిక [...]

March 17 2010 | Posted in Cine News | Read More »

అప్పుడేనా అంటూ ఇబ్బందిపడ్డ రోజా!

నటి రోజా తెలుగులో ఒకప్పుడు మంచి ఆఫర్లతో అదర గొట్టింది. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల్లోకి ప్రవేశించింఛి, తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా వెలిగింది. అయితే ఎమ్మెల్యే కావాలన్న ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. టి.డి.పి. లో ఇమడలేక బయటికి వచ్చి కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటే అది కుదరక పోవడంతో మళ్ళి సినిమాలను ఆశ్రయించక తప్పలేదు. ‘శంభో శివ శంభో” తో తన [...]

March 17 2010 | Posted in Cine News, Gossip | Read More »

9తారకు తల్లైన మనీషా కొయిరాల!

ఒకప్పుడు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల తార మనీషా కొయిరాల. ఆ తరువాత అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ అవకాశాలు రాక ఏం చేయాలో తోచక సందిగ్దంలో పడిపోయింది. ఇక తనకు హీరోయిన్ ఛాన్స్ రాదని అర్థం కావడంతో సినిమాల్లో ఏ పాత్ర అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు ఇవ్వడంతో నిర్మాతలు కూడా మనీషా విషయంలో సానుకూలంగా ఆలోచించడం మొదలు పెట్టారు. దాంతో అందాల తార [...]

March 17 2010 | Posted in Cine News, Gossip | Read More »

పరుగులు తీస్తున్న “మాయాబజార్”

ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, సిఎస్ఆర్, ముక్కామల, మిక్కిలినేని వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం మరోసారి చరిత్రను క్రియేట్ చేస్తూ కలర్ లో సంచలన విజయాన్ని చేజిక్కించుకుంది. నాటి తరం ప్రేక్షకులు ఆ చిత్ర వైభవాన్ని రంగుల్లో చూసుకుని మురిసిపోతే, ఊహించని విధంగా నేటితరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. పలు కొత్త చిత్రాలు సైతం “మాయాబజార్” ధాటికి విలవిల్లాడాయి. అర్ధ శతదినోత్సవానికి చేరువవుతున్న తరుణంలోనూ “మాయాబజార్” [...]

March 17 2010 | Posted in Cine News | Read More »

త్రిభాషా చిత్రంలో “లీడర్” రానా!

“ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు” వంటి చిత్రాలతో ప్రతిభావంతుడిగా మంచి పేరుతెచ్చుకున్న సెల్వ రాఘవన్ (శ్రీ రాఘవ) దర్శకత్వంలో రానా హీరోగా ఓ చిత్రం రాబోతోంది. “లీడర్”తో భవిష్యత్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న రానా విభిన్న చిత్రాల ద్వారానే నటుడిగా ముందడగు వేయాలనుకుంటున్నారు. శ్రీ రాఘవ దర్శకత్వంలో రానా నటించే ఈ భారీ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మాణం అవుతుంది. జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తారు.

March 17 2010 | Posted in Cine News | Read More »