Read more!

ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికల కోడ్ వర్తించదా?

Publish Date:Mar 19, 2024

ఆంధ్రప్రదేశ్ లో అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి మీడియా సమావేశం ఏర్పాటు కేసి మరీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. ఈ ప్రకటనతో దేశం అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం ఎన్నికల కోడ్ అమలు అవుతున్న పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైసీపీ ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ దాడులకు గురైన బాధితులు ఫిర్యాదులు చేస్తే.. పోలీసలు మాత్రం బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. దాడులు చేసిన వారు దర్జాగా తిరుగుతున్నారు. ఇక ఫ్లెక్సీల తొలగింపు విషయానికి వస్తే.. పోలీసువారి పహారాతో అధికారులు సెలక్టివ్ గా తెలుగుదేశం, జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. వైసీపీకి చెందిన ఫ్లెక్సీల జోలికి వెళ్లడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నా.. ఎన్నికల సంఘం కళ్లకు మాత్రం కనిపించడం లేదు.   అన్నిటికీ మించి అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాల కంటే జగన్ మోహన్ రెడ్డి సేవలో తరించడమే ముఖ్యమన్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర సచివాలయ అధికారులు జగన్ సేవ కోసం ఎన్నికల కోడ్ ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తుందన్న బెదురు వారిలో కనిపించడం లేదు. ఎన్నికల సంఘం పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాదన్న ధీమాయో ఏమో.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకూ ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్, ఆయన కేబినెట్ మంత్రుల ఫొటోలను ఇంకా తొలగించలేదు.  అలాగే వైసీపీ  నవరత్నాల పథకాల లోగో, సంక్షేమ పథకాల వివరాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన   48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలను తొలగించాలి. అలా తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అవేమీ జరగడం లేదు.  అంతే కాదు.. చివరికి టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పంపిణీ చేసే ప్యాడ్ లతో కూడా వైసీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే కోడ్ ను ఉల్లంఘించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఆర్డీవో ఆ ప్యాడ్ లను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసి కూడా ఎమ్మెల్యే అనుచరుల బెదరింపులకు తలొగ్గి వాటిని ఉపంసంహరించుకున్నారని తెలిసింది.  ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.   ఏపీకి ఎన్నికల కోడ్ వర్తించదా అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. 

మనిషి జీవితంలో గురువు ప్రాధాన్యత తెలిపే కథనం!!

Publish Date:Oct 9, 2023

సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు

Publish Date:Mar 15, 2021

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు..ఆయన నోటీసులు ఇచ్చారు. అమరావతి రాజధానిలో అసైన్డ్ భూములు కొనుగోలు అమ్మకాలపై చంద్రబాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.  41సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. నోటీసులు  ఇచ్చాక ఇన్వెస్టిగేషన్ కు పిలుస్తామని ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు. అమరావతి నుంచి రెండు సీఐడీ బృందాలు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులుకూ సీఐడీ నోటీసులు  అందాయి. 41 సీఆర్పీసీ కింద మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 

ఎదుటివారిలో ఈ గుణాన్ని గుర్తిస్తున్నారా?

Publish Date:Mar 18, 2024

జీవితం చాలా విలువైనది. చాలా అందమైనది. ఇటువంటి విలువైన నీ జీవితం పట్ల సమాజానికి మంచి సదభిప్రాయం వుండాలి. మనం మన వ్యక్తిగత విషయాల పట్ల ఎదుటివారి దృష్టిలో విలువలు సంపాదించాలి. జీవితంలో కష్టసుఖాలు లాభనష్టాలు అల్లుకుపోయి వుంటాయి. వాటిని అందుకుని తీరకతప్పదు. మన జీవితంలో వచ్చిన కష్టనష్టాలకు గల కారణాలను వాస్తవాలను గ్రహించాలి. మనకు వచ్చిన కష్టనష్టాలకు ఇతరులు బాధ్యులు అని వారిని నిందించకూడదు. వారే నీ కష్టాలకు బాధ్యులు అని నీవు వారి పట్ల అంచనా వేయకూడదు. ఒకప్పుడు ఒక వ్యక్తి చాలా సంపన్నుడు. అతనికి చాలా డబ్బు వుండేది. ఆ డబ్బంతా ఏమి చేయాలో అతనికి తోచక తన స్నేహితుడిని ఈ డబ్బంతా ఏమి చేయాలో తెలియడం లేదు. ఏదైనా సలహా ఇవ్వమని కోరతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టాలలో వున్నాడు. అతనికి నీవు డబ్బులు ఇస్తే అతను తన కష్టాలు తీరిన తరువాత వడ్డీతో సహా నీ డబ్బులు నీకు ఇస్తాడు. నీకు నీ డబ్బు ఇంకా రెట్టింపు అవుతుంది. తరువాత రాబోయే తరాలకు కూడా నీ డబ్బు ఉపయోగపడుతుంది. అని సలహా ఇచ్చి నీవు కూడా ఆలోచించు నేను చెప్పిన సలహా సరి అయినది అని అనిపిస్తేనే నీవు ఈ పని చేయి అని చెబుతాడు.  స్నేహితుడు చెప్పిన సలహా సరైనది అని తన మనసుకు తోచింది. స్నేహితుడు చెప్పినట్లుగా అతను కష్టాల్లో వున్న ఆ వ్యక్తికి డబ్బును ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత స్నేహితుడు చెప్పినట్లుగా ఆ వ్యక్తి ఇతనికి వడ్డీతో సహా డబ్బులను తెచ్చి ఇచ్చాడు. స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి డబ్బు రెట్టింపు అయ్యింది. అపుడు అతను స్నేహితుడిని మెచ్చుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఇతనికి బిజినెస్ చేయాలని అనిపించింది. అపుడు మరల స్నేహితుడి సలహాను కోరతాడు. అప్పుడు స్నేహితుడు రొయ్యల బిజినెస్ పెట్టమని సలహా ఇస్తాడు. కొన్ని రోజులు ఆ రొయ్యల బిజినెస్ మంచిలాభం వచ్చింది. ఇలా లాభం రావడానికి కారణం తన స్నేహితుడే అని అతడిని బాగా అభినందించాడు.  తరువాత కొన్ని రోజులకి, ఆ రొయ్యల బిజినెస్ కి సరైన సదుపాయం లేక నష్టం వచ్చింది. ఆ స్నేహితుడు వల్ల అతను చాలా లాభాలు పొందాడు. కానీ నష్టం వచ్చేటప్పటికీ, నా స్నేహితుడు వలన నేను ఈ రొయ్యల బిజినెస్ పెట్టాను. దీనికి కారణం నా స్నేహితుడే అని అతడిని నిందిస్తాడు, అవమానపరుస్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు తనకు లాభాలు వచ్చినప్పుడు మెచ్చుకున్నాడు. తనకు నష్టం వచ్చినప్పుడు మరల నన్ను నిందిస్తున్నాడు. ఎప్పుడూ ఈ వ్యక్తికి సలహా ఇవ్వకూడదు. ఇతను డబ్బుకు విలువ ఇస్తున్నాడు. మనిషికి మనిషిగా విలువను ఇవ్వడంలేదు. అని తన మనస్సులో అనుకుని అతని నుండి దూరంగా వెళ్ళిపోయాడు.  ఇప్పుడు అతనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేరు. నేను నిందించడం వల్లే నా స్నేహితుడు నా నుండి వెళ్ళిపోయాడు అని బాధపడి అతనిలో వున్న చెడు అభిప్రాయాలను తొలగించుకుని మనిషిగా మానవతా విలువలను పెంచుకున్నాడు. ఎప్పుడైనా మనం ఎవరి సలహా అయినా తీసుకున్నప్పుడు ఆ మనిషి చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. అలాగే ఆ మనిషి వలనే నీకు కష్టం వచ్చింది అంటే అందుకు నీవే బాధ్యుడవు. అతని వల్ల పొందిన లాభాన్ని గ్రహించాలి. అతని వల్ల వచ్చిన కష్టాన్ని నిందించకూడదు, మీలోని ఆలోచనా విధానాన్ని గ్రహించాలి, దాన్ని సరిచేసుకోవాలి.  ఎదుటివారు చెప్పారు కదా అని మీరు ఆలోచించకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా వారు చెప్పినట్లుగానే చేసి, అందువల్ల ఏదైనా కష్టం వస్తే వారే బాధ్యులు అని ఎలా నిందించగలరు? మీరే ఆలోచించండి..... మనం మనిషిగా మానవత్వపు విలువలను సంపాదించాలంటే మొదట మనం ఎదుటివారిలో వున్న మంచిని గ్రహించాలి.                                          ◆నిశ్శబ్ద.
[

Health

]

మూడ్‌కి ఆహారానికి సంబంధం ఏమిటి?

Publish Date:Mar 18, 2024

మనిషి ఒక్కో సారి ఒక్కో మూడ్ లో ఉంటాడు. గురువుగారు మంచి  మూడ్ లో ఉన్నారు. లేదా మూడ్ బాగాలేదు అని సహజంగా వింటూ ఉంటాం.అయితే వ్యక్తి మూడ్ లో ఉండాలంటే  ఆహారమే కీలకం అని అంటున్నారు నిపుణులు. మనిషిని మూడ్ లో ఉంచేది అవుట్ అఫ్ మూడ్ కు తీసుకు పోయేది ఆహారమే అంటున్నారు. మన మూడ్ ను సరి చేసేది మనం తీసుకునే ఆహారామే అంటున్నారు నిపుణులు. అసలు ఆహారానికి మూడ్ కు సంబంధం ఏమిటి?అన్నదే ప్రశ్న? మీరు ఎప్పుడైనా ఆకలిగా ఉందని భావించారా? ఉదయం కాని,సాయంత్రం కాని,రాత్రి కాని  ఆకలి వేసి ఉండవచ్చు.అసలు మనిషికి ఆకలి లేని వారు అంటూ ఉండరు. చివరి సారి మీరు ఏమి తిన్నారు?అన్న విషయం చాలా ఆసక్తిగా ఆలోచిస్తారు.? అలా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి,అవి పాస్తా,కావచ్చు,కేక్ కావచ్చు,క్యాండి  కావచ్చు.క్యాండీ మిమ్మల్ని ఎప్పుడూ మూడ్ లో ఉంచదు.అయితే మీ ఒక్కరేకాదు. ఒక పరిశోదన ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలు తినాలని అనిపిస్తాయి.కొన్ని మనల్ని భయ పెడతాయి. కొన్ని ఆహార పదార్ధాలుకార్బన్లు  తీసుకోవడం వల్ల చక్కెర శాతం పెంచుతాయి.మనం దానిపై దృష్టి  పెట్టం కొన్ని సందర్భాలలో ఆహారం తీసుకున్నాక అలిసి పోయేట్లు చేస్తాయి.ఇక అసలు విషయం  ఏమిటి అంటే  పెరుగు మన మూడ్ ను పెంచుతుంది అంటారు. మరో పరిశోదనలో పళ్ళు తినడం ద్వారా కూరగాయలు శాఖాహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్  శాతం తగ్గడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరో పరిశోదనలో మీరు తీసుకునే పెరుగు వల్ల సెరొటోనిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ గా పనిచేస్తుంది.దీని ప్రభావం తో  మన ఫీలింగ్స్ భావాలు వ్యక్తం అవుతాయి.దీనివల్ల ఆనందం ఆరోగ్యం గా ఉంటాయి. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అది అలాంటి ప్రభావం చూపిస్తుంది.అనే విషయాన్నీ దీనివల్ల వచ్చే ప్రభావం  12 రోజుల్లో చూడవచ్చు. మన శరీరంలో ఆహారం  వల్ల వచ్చే ప్రభావం ఉంటె మీ ఆహారం లో మార్పులు చే సుకోవచ్చు. ఆహారం వల్ల  మనం ఎదుర్కునే సవాళ్ళు... మీ భోజనం లో ఆహారం తీసుకునే సమయం నుంచి మూడ్ ట్రాకింగ్ జర్నల్ లో రాయండి మీరు ఏమి తీసుకున్నారో ఏమి తీసుకోలేదో  ప్రతి రోజూ అది కొన్ని నిమిషాలు మాత్రమే  మా ఆహారంలో ఉండే చాయిస్ మీకు అవగాహన కల్పిస్తుంది.అసలు మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం?అన్న విషయం తెలుస్తుంది.అవగాహన కలుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోండి. మీరు ఏం తింటారు?భోజనం తరువాత మీరు తీసుకునే స్నాక్స్ అల్పాహారం ఏం తీసుకుంటారు? ఒక వేళ మీరు తినేంత సమయం లేకుంటే ఒక ఫోటో తీసుకుని రికార్డ్ చేయండి.అది మీకు కొంత మేర  మీకు సహకరిస్తుంది.అన్న విషయాన్ని ఒక జర్నల్ గా లేదా నోట్ యాప్,ఫుడ్ ట్రాకర్ ను మీ ఫోన్ లో తయారు చేసుకోండి తినక ముందు మీ  ఫీల్ ఏమిటి? ఎలా ఉన్నారు? ఏ సమయంలో మీకు ఆకలి వేసింది.?ఒంటరిగా ఉండాలని అనిపించింది?.ఒత్తిడికి గురి అయ్యారా? అలా ఉండడానికి మీరు తీసుకున్న ఆహారం కావచ్చు. అది మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు,లేదా మీరు ఆహారం తీసుకున్నప్పుడు అలసటగా భావించారా? మీరు ఏ అహారాం థేసుకున్నప్పుడు తీపి పదార్ధాలు స్వీట్స్ ఇతర పదార్ధాలు మీ పంటిని ప్రభావితం చేసాయి. ఒత్తిడికి గురికావడానికి ఉప్పు పదార్శాలు చిప్స్,వేపుళ్ళు,వంటి పదార్ధాలు మీ ఫీలింగ్స్ గుర్తించ వచ్చు. ఫీలింగ్స్ కి ప్రవర్తనకి సంబంధం ఉందా ఇది మార్పుగా భావించాలి. తిన్న తరువాత మీరు ఎలా ఫీల్ అవుతారు... ఉదాహరణకి మీరు తీసుకున్న ఆహారం మీకు శక్తి నిచ్చిందా?లేక స్వాంతన చేకురిందా, త్రుప్తి నిచ్చిందా? అనందం కలిగించిందా?మీ మూడ్ ను ఆహారం ఏరకం గా ప్రభావితం చేసింది. దీనిప్రభావం వల్ల భవిష్యత్తులో తెలివైన నిర్ణయం తీసుకోగల నిర్ణయానికి సహకరిస్తుంది. కొంత మంది నిపుణులు  నిర్వహించిన సర్వేలో మనం తీసుకునే ఆహారం మనమూడ్ ను  ప్రభావితం చేస్తాయని నిర్ధారించారు.

కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం

Publish Date:Jul 17, 2020

సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.