హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణా రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీలో టీడీపీ ఇక పై కొనసాగకూడదనే నిర్ణయానికి దాదాపు వచ్చినట్లు సమాచారం. టిజెఎసి కన్వీనర్ గా వున్న కోదండరాం పనితీరుపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇకపై తామే సొంతంగా ఉద్యమాన్ని చేపట్టాలనుకున్న వీరు ఇందుకోసం తెలంగాణా టీడీపీ అడహాక్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచనప్రాయంగా అంగీకరించారు. కాంగ్రెస్ తప్ప ఇతర [...]
వసంతోత్సవ హేల “హోళీ’
కాలచక్ర భ్రమణంలో, షడ్రుతు సంక్రమణంలో, మాఘపౌర్ణిమ మధురాతి మధుర చంద్రికా స్నపితావరణంలో, శిశిర వసంతాల పరిణామ పర్యావరణభరణంలో, పచ్చని చివురుల యవనిక తొలగించుకు వచ్చే, మంజుహాస విలసన్నవ లతాంత మాలికా తోరణంలో, మందమందమలయా నిలయ చారణంలో, “ముగ్ధ’ లా వాసనాగ్ధలా, మన తనువులనీ, మనసులన్నీ పరిరంభించి, పరవశింపజేసే పండుగ, వసంతోత్సవ హేల హోలీ. వర్ణ వర్ణార్ణవంలో, ఒళ్లు మరిచి జలకాలాటలో, తేలేతరుణంలో, కుల, మత, వర్ణ వ్యత్యాసాలే కాక, వావి వరుసలు కూడా పాటించాలనే నియమంలేని, స్త్రీ [...]
రంగుల రంగేళికి ఆశీస్సులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రతిపక్ష నాయకుడు ఎన్. చంద్రబాబునాయుడు, ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి రాష్ట్ర ప్రజలకు హోళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రంగుల పండగను స్నేహ, సౌభ్రాతృత్వాలతో జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీని జరుపుకుంటారన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా సంతోషంగా ఉండడం ఈ పండగ ప్రత్యేకతన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించడం, లౌకిక విలువలను కలిగివుండడం, సోదరభావం [...]
టీమిండియా అదుర్స్
న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్ లో భారత్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. కోట్లాది భారతీయుల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ తొలిమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుచేసింది. కిక్కిరిసిన ప్రేక్షకుల జేజేల నడుమ భావోద్వేగాల సమరం లో పైచేయి సాధించి.. అభిమానులకు ఘనమైన కానుక నందించింది. న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియంలో ఆదివారం ప్రపంచహాకీ పోటీలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి బోణీ కొట్టడం.. అందునా ఆ గెలుపు పొరుగుదేశం పాక్ పై కావడం… ప్రపంచకప్ భారత్ [...]
ఇక శ్రీవారి సన్నిధిలోకి ‘ మంగేష్కర్’
కన్యాకుమారి: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్యాంసులుగా ప్రముఖ గాయనీమణులు లతా మంగేష్కర్, శోభారాజ్ లను నియమిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆదివారం కన్యాకుమారిలో టీటీడీ బోర్డు సమావేశాలు జరిగాయి. ఇతర రాష్ట్రంలో తొలిసారి సమావేశమయిన టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీకి రికార్డు స్థాయిలో రూ.1,338 కోట్లతో బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటిసారి లాభనష్టరహిత బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. స్వామివారి శీఘ్ర దర్శనం ద్వారా వచ్చే ఏడాది రూ.వంద కోట్లు [...]
బాబూ నీవు ఎటు: వీహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను టిడిపి నేత ఎర్రన్నాయుడు విమర్శించడం తగదన్నారు. తెలంగాణకు అనుకూలం అని తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విషయాన్ని ఆ పార్టీ నేత ఎర్రన్నాయుడు మరచిపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నాళ్ళుగా వివిధ అంశాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి వివరిస్తామని విహెచ్ చెప్పారు.
ముక్కలు..ముఖ్యమంత్రులు
హైదరాబాద్: రాష్ట్రం ఒకటి, రెండు, నాలుగు, పది ముక్కలు కావాలని కొందరు కోరుకుంటున్నారు. అలా రాష్ట్రం ఎన్ని ముక్కలైతే అంత మంది ముఖ్యమంత్రులు అవ్వొచ్చనే స్వార్ధంతో కొందరు రాష్ట్రం ముక్కలు కావాలని కోరుకుంటున్నారు అని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అలాగే రాష్ట్రం చిన్న, చిన్న ముక్కలైతే పెట్టుబడుదారులు, రాజకీయ నాయకులకే లాభమని స్పష్టం చేశారు. అందుకే వారి అభిప్రాయంతో తాను విభేదిస్తున్నానని చెప్పారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే నా నిర్ణయాన్ని [...]
‘టిటిడి’ కి 1400 కోట్ల బడ్జెట్
కన్యాకుమారి: తమిళనాడు లోని కన్యాకుమారి లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1400కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రెండవ ఘాట్ రోడ్డుకు మూడు కోట్ల 60 లక్షల రూపాయలతో మరమ్మత్తులు చేయించాలని తీర్మానించారు. తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి దేవాలయ మహాద్వార ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. కుమారధార, పసుపు ధార ద్వారా త్రాగునీరు అందించడానికి పది కోట్ల 50 లక్షల రూపాయలతో టెండర్ [...]
‘3ఇడియట్స్’ ‘7 అవార్డ్స్’
ముంబయి: అందరూ ఊహించినట్లుగానే ‘3ఇడియట్స్’చిత్రం ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట పండించనుంది. 55వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవంలో ఈ చిత్రానికి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ మాటల రచయిత, ఉత్తమ సహాయ నటుడు తదితర అవార్డులన్నీ ‘3 ఇడియట్స్’ చిత్రం సొంతంచేసుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన డిఫరెంట్ మూవీ ‘దేవ్ డీ’కూడా చెప్పుకోదగిన స్థాయిలో అవార్డులు సొంతం చేసుకొని [...]
రైతుల విత్తనాభివృద్దికి ఆర్ధికసహాయం
చల్లపల్లి: రైతులే విత్తనాలను అభివృద్ది చేసేలా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలని పశుసంవర్ధకశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి కోరారు. కృష్ణా మండలం (కృష్ణా, గుంటూరు, ప్రకాశం) రైతుసదస్సు ఘంటసాల జెడ్పీ హైస్కూల్‌లో జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఎంతో అభివృద్ది చేసినా సాధించిన ప్రగతిని సొమ్ము చేసుకునే ప్రబుద్దులు ఉన్నారన్నారు. విత్తనాభివృద్దిని గ్రామాల్లోకి తీసుకువెళ్లి రైతులతో తయారు చేయించాలన్నారు. ఇందుకు అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పశుసంపదను [...]

