అవనిగడ్డ: మచిలీపట్నం – రేపల్లె రైలుమార్గం నిర్మించాలని కోస్తా ఉద్యమకారులు ప్రధానమంత్రి, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీలను కోరుతూ లేఖలు పంపారు. గత 40 ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నమని, 2005లో రూ.276 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. రైలుమార్గంతో దివిసీమ, మచిలీపట్నం పోర్టులు అభివృద్ది చేందుతాయని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేయాలని జిల్లాకు చెందిన శాసనసభ్యులు, పార్లమెంటుసభ్యులు, మంత్రులు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు విజ్ఞాపన పత్రాలు పంపారు. కాగా విజయవాడ రైల్వే డివిజన్‌లో కొత్త రైల్వే లైన్ల [...]
అడ్డగోలు తవ్వకాలు…సమీప గ్రామాలవారు ఆందోళన
విజయవాడ: కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందనే రీతిలో కరకట్ట నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కృష్ణా కరకట్ట నిర్మాణ పనులు అవినీతి మట్టి కొట్టుకుపోతున్నాయి. తోట్లవల్లూరు మండలం ఐలూరు, గుర్విందపల్లి వద్ద నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు నియమనిబంధనలు గాలికి వదిలేస్తే, అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. యాభై మీటర్లు లోపే మట్టి తవ్వకాలు జరపడం, తేమతో కూడిన మట్టి ఉపయోగించడం వల్ల కట్టకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, తద్వారా సమీప గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం [...]
ఎంపీలు బడ్జెట్‌పై మేల్కోండి
విజయవాడ డివిజన్‌కు ఆరేళ్లుగా రైల్వే బడ్జెట్‌లో నిరాశే మిగులుతోంది. అధిక ఆదాయం కలిగి ఉన్నా కేటాయింపుల్లో చిన్నచూపునకు గురవుతున్నది. ఏడు జిల్లాల్లో విస్తరించిన ఈ డివిజన్ ఉత్తర, దక్షిణ భారత దేశాన్ని కలిపే కీలక జంక్షన్. కొత్త రైల్వేలైన్లు, విద్యుధ్దీకరణ, డబ్బింగ్ పనులకు సర్వేలతో సరిపెడుతున్నారే తప్ప నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. కొత్త రైళ్లు రాకపోగా ఉన్నవి తరలిపోతున్నాయి. బడ్జెట్ వచ్చిన తర్వాత అన్యాయం జరిగిందని గోల చేయడం కన్నా ముందుగానే మేలుకొని డివిజన్‌కు [...]
తరలిపోతున్న రైళ్లు… బడ్జెట్ వచ్చాక నిరసన
విజయవాడ: మనకు రావాల్సిన రైళ్లు రాకపోగా ఉన్న రైళ్లు భువనేశ్వర్‌కు తరలిపోతున్నాయి. నిరుటి బడ్జెట్‌లో మచిలీపట్నం – ముంబై మధ్య ఓ రైలు నడపనున్నట్లు ప్రకటించారు. అది ఇంతవరకూ పట్టాలెక్కలేదు. ఈ ఏడాది బడ్జెట్ వచ్చే సరికి దాన్ని విశాఖపట్నం – ముంబైగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ పట్టుబట్టి మచిలీపట్నం – ముంబై రైలును తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడంతో ఆ రైలు గురించి పట్టించుకునే వారు [...]
జోహ్రా, నఫీసాలకు కల్పనా చావ్లా అవార్డు
న్యూడ్లిల్లీ: ప్రముఖ నటి, సంఘసేవకురాలు నఫీసాఅలీ, జోహ్రా సెహగల్ (91) లకు కల్పానా చావ్లా ఎక్సలెన్స్ అవార్ఢును చావ్లా తండ్రి బెనారసి లాల్ చావ్లా ప్రదానం చేశారు. అయితే జొహ్రా సెహగల్ బదులుగా ఆమే కుమార్తె కిరణ్ ఈ అవార్ఢును అందుకున్నారు. వీరితో పాటు నేతాజీసుబాష్ చంద్రబోస్‌తో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిన కెప్టెన్ లక్ష్మి సెహగల్, పదవి విరమణ చేసిన ఐపిఎస్ అధికారి కిరణ్‌బేడి, పంజాబీ సాహితీవేత్త పద్మశ్రీ అజిత్ కౌర్, గాయకురాలు శాంతి [...]
ఎగిసి పడుతోన్న సీమాంధ్రా!
విజయవాడ: తెలంగాణ అంశంపై కేంద్రం అనుసరించే అసంబద్దమైన వైఖరి వల్ల సీమాంధ్రాలో నిరసన జ్వాలను చెలరేగుతున్నాయి. ఇప్పటి వరకూ శాంతియుతంగా, సౌమ్యంగా ఉన్న సమైక్యాంధ్రావాసులు ఎగిసిపడే రోజులు దగ్గర పడుతున్నాయి. దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుకు సిద్దం అవుతోన్న విధానం చూస్తుంటే పరిస్ధితులు చేయిదాటి పోయే ప్రమాదం ఉందనిపిస్తోంది. సీమాంధ్రలో ఇప్పటి వరకూ పోరాటపటిమ అనుకున్నంత వాడి, వేడితో రూపొందలేదని, ముందుకు సాగలేదని భావిస్తున్నారు. కానీ కేంద్రం విధానం ఒకవైపు, తెలంగాణాల నాయకులు వ్యవహరించే తీరు [...]
నేను మిమ్మల్ని రమ్మన్నాన్నా…?
వేలూరు: తమిళనాడులోని వేలూరు శ్రీపురం బంగారుగుడిని ముఖ్యమంత్రి కె. రోశయ్య కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. కాగా ఈ శ్రీపురం పర్యటనలో మీడియాపై రోశయ్య ఒకింత అసహనం ప్రదర్శించారు. తిరుపతి, చిత్తూరు నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు మాట్లాడాలని కోరగా… “నేను కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చా… ఇక్కడ మాట్లాడను’ అని కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం రెండు గంటలకే మీ పర్యటన కవరేజీ కోసం వచ్చామని, అయితే ఆలయ అధికారులు తమను అనుమతించలేదని జర్నలిస్టులు చెప్పడంతో [...]
2రెట్లు పెరగనున్న జీతాలు
హైదరాబాద్: యూజీసీ సవరించిన స్కేళ్లను అమలుపరచాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని దాదాపు పదివేల మంది అధ్యాపకులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో దాదాపు ఏడు వేల మంది, విశ్వవిద్యాలయాలలో మూడు వేల మంది కలుపుకొని మొత్తం పదివేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరంతా అసిస్టెంట్ ప్రొపెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అధ్యాపకుల హోదా, అనుభవం ఆధారంగా వారి మూల వేతనాలు రెండున్నరరెట్లకు పైగా పెరగనున్నాయి. [...]
జేఏసీపై అధిష్టానం పవర్
న్యూఢిల్లీ: తెలంగాణ జెఎసి ని వీడి బయటకు రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణకు సంబంధించి మీడియా వద్ద ఏమీ మాట్లాడకూడదని కూడా అధిష్టానం వారిని ఆదేశించింది. క్రమశిక్షణ ఉల్లంఘించి తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీ హెచ్చరించారు. కమిటీ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోలేదని, అంతవరకూ అందరూ సంయమనం పాటించాలని మొయిలీ సూచించారు. తెలంగాణపై ఏర్పాటు చేయదలచిన కమిటీ విధివిధానాలు [...]
కమిటీని అడ్డుకుంటాం
గుంటూరు: కేంద్రప్రభుత్వం వేయబోయే కమిటీని వ్యతిరేకిస్తున్నామని, దీన్ని అడ్డుకుంటామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కేంద్రం కమిటీ వేయడం సరికాదని తెలిపారు. విభజన అంటూ జరిగితే ముందు తమిళనాడును విభజించాలని డిమాండ్ చేశారు. చిదంబరం చర్యలను అనుమానిస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలను సంప్రదించకుండా చిదంబరం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ తెలంగాణనేతలు జేఏసీలో చేరడమంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అన్నారు.

