సాయితేజ్ వర్సెస్ రణ్ వీర్!
on Feb 22, 2021
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`, `సోలో బ్రతుకే సో బెటర్`.. ఇలా హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు యువ కథానాయకుడు సాయితేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. వెర్సటైల్ డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో `రిపబ్లిక్` చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. కట్ చేస్తే.. అదే రోజున మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా జనం ముందుకు రానుంది.
ఆ చిత్రమే.. `83`. భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలిచినప్పటి పరిస్థితుల నేపథ్యంలో.. కపిల్ దేవ్ బయోపిక్ గా `83` రూపొందింది. కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో అతని శ్రీమతి రోమీ భాటియాగా దీపికా పదుకొణే యాక్ట్ చేసింది. `రంగం` ఫేమ్ జీవా.. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో అభినయించాడు. కాగా, ప్రధానంగా హిందీలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ జూన్ 4న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అదే రోజున పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. దీంతో.. సాయితేజ్ కి రణ్ వీర్ సింగ్ నుంచి పోటీ అనివార్యమవుతోంది.
మరి.. ఈ పోటీలో ఎవరు ఆ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారో చూడాలి.