Untitled Document
.Content
{
background-color:#006699;
font-size:12px;
font-family:Arial, Helvetica, sans-serif;
}
.Table
{
border:groove;
border-bottom-color:#9BEAF0;
}
.Text10px
{
font-family:Arial, Helvetica, sans-serif;
font-weight:bold;
font-size:10px;
color: #FFFFFF;
line-height: 22px;
}
|
| Tone Ads |
 |
| |
 |
|
|
|
|
Hair colouring gives new look
| హెయిర్ కలరింగ్ తో కొత్త రూపం |
| |
|
ఆధునికయుగంలో చోటుచేసుకున్న అనేకానేక మార్పులలో అలంకరణ కూడా ఒకటి. మగువల మేకప్ లో రోజుకొక ఫ్యాషన్ వచ్చి చేరుతోంది. చీర లేదా లంగా ఓణీ, తుమ్మెద రెక్కల్లాంటి నల్లటి కురులతో బారెడు జడ. తలనిండా పువ్వులు... ఇలా వుండేది పది పదిహేను సంవత్సరాల క్రితం వరకూ స్త్రీల అలంకరణ. ఇప్పుడు వస్త్రధారణ దగ్గరనుంచి ఆలంకరణ వరకూ ఆన్ని విషయాలలోనూ పెను మార్పులు చోటుచేసుకున్నాయి. |
|
|
|
బారెడు జడ స్థానంలో పొట్టిజుట్టు వచ్చి చేరాయి. బాబ్డ్ హెయిర్ లేదా పోనీటేయిల్ ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్ . పూర్వం జుట్టు ఎంత నల్లగా వుంటే అంత అందం అనుకునే వారు. ఆ ట్రెండ్ ఇప్పుడు లేదు. జుట్టు అసలు రంగుని మార్చేస్తూ రకరకాల రంగులు వేసుకుంటున్నారు. ఒక్కో సందర్భానికి ఒక్కో రంగుని ఉపయోగిస్తున్నారు. హెయిర్ కలరింగ్ మీద మునుపెన్నడూ లేనంత మక్కువ పెరిగిపోయింది. ఈనాటి మహిళలకు కాలంతో పాటు మార్పు సహజమే అయినా అది హేల్దీగా వున్నంత వరకూ ఎలాంటి నష్టమూ జరగదు. అవగాహన లేకుండా హేయిల్ కలరింగ్ కి వెళితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. జుట్టుకి కలర్ వేయించుకునేటప్పుడు లేదా వేసుకునేటప్పుడు ఏ రంగు వేసుకుంటున్నారు? ఎలా వేసుకోవాలి? అన్నది ముఖ్యం. వాటి గురించిన కొన్ని సూచనలు మీ కోసం.... |
- చర్మం రంగుని అనుసరించి జుట్టుకు రంగును ఎంపిక చేసుకోవాలి. మార్కెట్ లో బ్రౌన్, నీలం, ఎరుపు, పసుపు రంగులు లభ్యమవుతున్నాయి. బ్రౌన్ లేదా లేత ఎరుపు రంగు చాలా మందికి మ్యాచ్ అయ్యే కలర్స్.
- మొదటిసారి రంగు వేసుకునేటప్పుడు మెడ దగ్గర నుంచి ప్రారంభించాలి.
- ప్రారంభంలోనే శాశ్వతంగా వుండే రంగుల జోలికి పోకూడదు. ఏడెనిమిది సార్లు షాంపూ చేసుకుంటే పోయే రంగులను మాత్రమే వేసుకోవాలి.
- హెయిర్ కలరింగ్ ప్యాకెట్ మీద వున్న బొమ్మల కన్నా దాని మీద ముద్రించిన సమాచారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలి.
- ఇంట్లోనే రంగు వేసుకోదలచిన వారు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. మీ జుట్టుకి ఏ రంగు సరిపోతుంది? ఏ కంపెనీ రంగు మంచిది? ఎంత మోతాదులో వేసుకోవాలి? అన్న వివరాలు తెలుసుకున్న తరువాతే కలరింగ్ వేసుకోవడం మొదలుపెట్టండి.
- రంగు వేసుకునేటప్పుడు భుజం చుట్టూ బట్ట కప్పుకోవాలి. నుదుటిమీద కొంతభాగం క్రీం రాసుకోవాలి. అంతా అయిపొయిన తరువాత దూది లేదా మెత్తటి బట్టతో క్రీముతో సహా రంగును కూడా శుభ్రంగా తుడుచుకుని స్నానానికి వెళ్ళాలి.
- ఎక్కువగా స్విమ్ చేసేవారు, ఎండలో తిరిగేవారు హెయిర్ కలరింగ్ జోలికి పోకుండా వుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- రంగు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా గ్లోవ్స్ ను ఉపయోగించాలి. కొన్ని రంగులు గోల్లకి హాని చేయవచ్చు.
- రంగు వేసుకున్న తరువాత వారానికి ఒక్కసారన్నా షాంపూ, కండిషనర్ ని ఉపయోగించాల్సి వుంటుంది.
- గర్భిణులు జుట్టుకు రంగు వేసుకోకుండా వుంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని మీద భిన్నాభిప్రాయాలున్నా వీరు ప్రసవం అయ్యేంత వరకూ రంగు వేసుకోకుండా వుంటేనే మంచిది.
- జుట్టు మూడొంతులు గ్రే కలర్ కి మారినట్టయితే సేమీ పర్మనెంట్ రంగును వేసుకోవలసి వుంటుంది.
|
|
| Previous |
|
|
|
|