Previous Page Next Page 
పాదాభివందనం పేజి 4

'అమ్మా'

కూతురి పిలుపుకి ఉలికి పడిందామె. ఆమె మనస్సులోని ఆలోచనా తరంగాలు నిస్థరంగాలయ్యాయి. 'వూ' అంటూ కదలింది.

ఎప్పటిలాగే ఆమె కళ్ళు నిస్పృహతో, నిర్లిప్తంతో వాలిపోయాయి. వారం రోజుల నాడు అకాల వసంతం లాగా కరుణించి కన్పించి అతను మళ్ళీ ఈ వారం రోజులుగా కనిపించనేలేదు. ఏదైనా బాధ్యతతో ఎటైనా వెళ్ళాడా? లేక వూళ్ళోనే ఉండి రావటం లేదా? అంతుపట్టలేదు భువనకి.

'రోజు నువు వచ్చేది ఇక్కదికేనా, అమ్మా!"

'వూ'

'నాకు భలే కోపంగా ఉంది- తెలుసా!'

'ఎందుకట?"

'నువు రోజు వచ్చేది ఇక్కడికే అని చెపితేనేనూ వచ్చేదాన్ని, ఎంత అందం! ఏం అందం! ఈ గాలి, ఈ పూలు, ఈ నీళ్ళు, ఈగలగలలు, ఈ కదలికలు ......ఓహ్......సహజసుందరం.'

'నీవు, నీ పుస్తకాలు, నీ శరత్, నీ విశ్వనాధ, నీ సులోచన- వాళ్ళంతా ఎక్కడికి వెళతారు-

'ఇక్కడకంటితో ఇంత అందాన్ని చదవ గలిగినప్పుడు అక్కడి అందాలు తాత్కాలికంగా లేకపోయిన ఫర్లేదు. ఏ డిల్లీలోనో- ఎక్కడనో చూడవలసిన అందాలు ఇక్కడ ఈ నంద్యాలలో చూస్తున్నాము'

భువన ఏమి మాట్లాడలేదు. ఆ చెరువు నీళ్ళలో కదలాడే చేపకళ్ళలాగే ఆమె కళ్ళు అయన కోసం ఎదురు చూస్తున్నాయి. "నీవు రావు నింగి రాదు' అన్నట్టుగా ఉందామెకి.

'వందనాలు'

గండుకోయిల షడ్జమం లోపలికి నట్లింది. ప్రేమనాదం, వేదనాదం జంట స్వరల్లాగా వినిపించినట్లైంది. ఇద్దరూ చప్పున తిరిగి చూశారు.

పొందూరు జరి అంచు ఖద్దరు ధోవతి. తెల్లటి ఖద్దరుచొక్కా- సచ్చతకి ప్రతిబింబంలాగా ఉన్నాడతను. నుదుట పొడవుగా ఉండే ముంగురులు సాయం సమయవీచికలకి అలా అలా కదలాడుతూఉన్నాయి.

భువన కళ్ళు నెలరాజుని చుసిన కలువమోములా విచ్చుకున్నాయి. ఆప్రయట్నంగా 'వందనం' అని,'ఇన్నాళ్ళు కనిపించలేదేమిటి? అంది. ఆ కంఠంతో స్నేహవాత్సల్యాలు తొంగి చూసే నిషురం-దర్శనానికై వస్తే కనిప[కనిచకపోతే కలిగే ఆశా భంగం వినిపించాయి. జవాబుగా నవ్వేడతను.

'మా అమ్మాయి ప్రియంవద......'

'నమస్కారం........' గౌరవభావం ఉట్టిపడే గొంతుకతో అంది.

'మీ అమ్మాయా? అతని కంఠంలో దాచినా దాగని ఆశ్చర్యం,. ఆ కళ్ళలో మీకింతవయస్సున్న కుతురున్నదా అన్న భావం. ఆమె అందానికి, శరీర లావణ్యానికి, సౌష్టవానికి, ఆ సౌష్టవాలని కాపాడుకుంటున్న ఆరోగ్యానికి అభినందనలు కనిపించాయి. ఆ కళ్ళలో.

భువన ఏమి అనలేదు. నిశ్శబ్దం ఏరులా ప్రవహిస్తుంది. మాటల కందని ఆత్మీయత మనస్సులకి మాత్రం తెలిసే రాగభావన ఇద్దరి మధ్య ప్రవహిస్తున్నది.

'మా ప్రియ పుస్తకాలు బాగా చదువుతుంది.' అవునా ! చూశారాయన.

ప్రియంవద ముఖంలో సహజమైన సిగ్గు తారట్లాడింది. అది భేషజానికి తెచ్చి పెట్టుకున్న సిగ్గు కాదు.

'చదవటమే కాదు, బాగా విమర్శిస్తుంది. విశ్వనాధ వారి భావుకత, శరత్ స్త్రీ మనోచిత్రణ. యద్దనపూడి తరగతి స్త్రీ ల మనస్సుకి పెట్టె అద్దం లాటి రచనా విధానం. చలం శైలి అత్మదైర్యం- ఇలా ఇలా చెబుతుంది.

'వురుకోమ్మా!"

'అంకుల్ కూడా బాగా చదువుతారమ్మా'

'మీ వద్ద ఏమేం పుస్తకాలు ఉన్నాయి. అంకుల్?'

'ప్రబంధాలు, నవలలు, నాటకాలు, ప్రవాసనాలు, చెకోవ్, గోర్కి, మామ్హెరాల్ డ్ రాబిన్స్ టాగోర్, ఆర్కేనారాయణ్.......'

ప్రియంవద కళ్ళు విచ్చుకున్నాయి ఆశ్చర్యానందాలతో.

'నువు విదేశీ- ముఖ్యంగా ఇంగ్లిష్, తష్యన్ సాహిత్యంచదవలమ్మా'

'అలాగేనండి. మా నాన్నగారు చదవరు. అమ్మ మానేశారు. ఎప్పుడూ మౌనం. తను వీణవాయిస్తారట. నాకు నేర్పమన్నాను. ఉహూ- కనీసం వినిపించందే! అవునా, అంకుల్ ఒక సందేహం భర్తకి ఇష్టం లేకపోతే దేన్నయినా వదిలెయ్యాలా?'

'ఆ కాపురాన్ని తప్ప' తమాషాగా అన్నారాయన. ఫక్కున నవ్వింది ప్రియంవద. 'అదొదిలేస్తే భర్తతో పేచిలేదు. మా నాన్న గారికి సంగీతం గిట్టదు. అయన సినిమాలు చూడరు. రికార్డులు వినరు. నాట్యాలు చూడరు. పుస్తకాలు చదవరు. భువనేశ్వర్ అదో తరహా వ్యక్తి.

'కానీ సిగరెట్స్ విపరీతంగా కాలుస్తాడు. 'కోపంగా అంది ప్రియంవద. తండ్రిగారు ఆయనకి పరిచయమే అని తెలియటంతో ఆ మాట అంది. మా అమ్మ పదిహేడేళ్ళకాపురంలో ఆయనతో వాటిని మాన్పించలేకపోయింది.

'క్లబ్బుకి వెళ్ళకుండా ఆపలేకపోయింది.'

'అవును. ఆ రెండూ ఆమె చేయలేదు. ప్రియంవద అంది.'

'మీరు మా ఇంటికి ఎప్పుడూ వస్తారు?" ప్రియ ప్రశ్నించింది.

అయన భువన వైపు చూశారు. తలొంచుకుందామె. అయితే ఆ అరక్షణంలోనే అయన ఆమె కళ్ళలోని భావాన్ని చదివారు. వసంతం కోసం శిశిరంలో తపించిన చెట్లలాగా, గ్రీష్మంలో తపించిననది కన్యలు వర్షం కోసం ఎదురు తెన్నులు చూసినట్లుగా ఆ కళ్ళలో ఆర్తి కనిపించింది.

'ఎప్పుడైనా వస్తాను.' రేపోస్తారా? అమ్మ పుట్టిన రోజు. చప్పున అంది.

'తప్పకుండా వస్తాను. ' ఆ గొంతులో ఒక పర్వదినం రోజున పరమేశ్వరిని దర్శనం చేసుకోబోయే ఆర్తి కనిపించింది.

ప్రియంవద 'అభిజ్ఞాన శాకుంతలం' లో శకుంతల మనస్సుని గురించి అడిగింది.చప్పున. సబంధం లేని ప్రశ్న. హటాత్తుగా అడిగింది. రజనికి శకుంతల అంటే ఎంతో అభిమానం కాళిదాసు మర్మజ్ఞాత అంతా వివరించాడు అతను. విషయం ఏకరువు పెట్టాడు.

'మీరు గొప్ప భావుకులు' అంది భువన చప్పట్లు చరిచింది ప్రియంవద.  


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS