Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 2

"బాలికలను రేప్ చేసి వాళ్ళని నిర్ధాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు "పెద్ద అక్షరాలతో శీర్షిక.
"ఇతడు అబ్దుల్లా , సేబాస్టిన్, శంకర్, అజిత్ సింగ్ మొదలిన రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో తిరుగుతూ అభం శుభం తెలియని పన్నెండేళ్ళలోపు బాలికలని తియ్యని మాటలతో మిటయిలతో చేరదీసి నిర్ధాక్షిణ్యంగా రేప్ చేసి ఆ తరువాత గొంతు నులిమి చంపేసేవాడు. ఆ రకంగా ఇప్పటివరకు ముగ్గుర్ని చంపినట్లు తెలుస్తోంది. ఇతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.'
వివరాలు చదివాక పిచ్చెక్కినట్లయింది జీవన్ కి. పాట్ తో వెయిటర్ తెచ్చిన కాఫీ తాగకుండానే పది రూపాయల నోటు ప్లేటులో పడేసి గాలిలో తేలుతున్నట్లు మోటార్ సైకిల్ నడిపిస్తూ యింటికి చేరుకున్నాడు.
జీవన్ ఇంట్లో అడుగు పెట్టగానే తల్లి పొగలు కక్కుతున్న కాఫీ కప్పుతో వచ్చి "కాఫీ తాగకుండా వెళ్ళిపోయావేమిటిరా! నీకోసం స్ట్రాంగ్ డికాషన్ తీసి చిక్కని గేదేపాలు పొంగుతున్నవి పోసి కలిపి తీసుకొచ్చాను ముందు తాగు" అంది.
అక్క వేడి వేడి పెసరట్టు ప్లేటులో వేసుకొచ్చి "ముందు పెసరట్టు తిని కాఫీ తాగు పొద్దెక్కింది. అల్లం, ఉల్లి ముక్కలు వేసి చేశాను." అంది.
"ముందు కాఫీ.........."
"కాదు ముందు పెసరట్టు"
చెరొకవైపు నుంచి అరుస్తున్న తల్లిని, అక్కని వుద్దేశించి.
"మీరిద్దరూ నోర్ముసుకుని అవతలకి నడవండి." అని కసిరాడు జీవన్ అక్కని తల్లిని అతనలా కసురుకోవడం అదే మొదటిసారి. ఈ పని మొదటే చేసివుంటే ఎంత బాగుండేది." అనుకున్నాడు. ఏది తప్పో,యేది వొప్పో అని కాదు ఆలోచించవలసినది, జీవితాన్ని సవ్యంగా ఎలా ముందుకు నడుపుకుపోవాలా అని ఆలోచించాలి. చాలా ఆలస్యంగా గ్రహించాడు ఈ విషయం.
బెటర్ లేట్ దెన్ నెవర్" అనుకోని భువనేశ్వర్ ఎస్.టి.డి కోడ్ 0674డయల్ చేసి, అణువేద నంబర్ కలిపాడు.
మనసులో అణువేద ఆ టైములో ఏం చేస్తుంటుందో వుహించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె దగ్గర బద్ధకం లేదు. గడియారం ముళ్ళతో పందెం వేసుకున్నట్లు టకటక కదులుతూనే వుంటుంది. బహుశ ఈ పాటికి డాన్సు స్కూలుకి తయారవుతూండొచ్చు.అవతల వైపు నుంచి ఫోన్ రెండుసార్లు రింగ్ అవగానే అణువేద గొంతు వినిపించింది.
"హల్లో! మిసెస్ జీవన్ హియర్!"
ఇటువైపు నుంచి జీవన్ వెంటనే మాట్లాడలేకపోయాడు. తనలో తనే "మిసెస్ జీవన్, మిసెస్ జీవన్" అని మననం చేసుకున్నాడు. మరొక్కసారి ఆ మాటలు వినాలనిపించింది.
"హల్లో!" అటువైపు నుంచి కాస్త గట్టిగా వినిపించింది. ఆలోచనల్లోంచి వర్తమానంలోకి వచ్చాడు. ఎదుట వున్న ప్రమాదం గడగడలాడించింది.
"వేదా! నేను జీవన్ ని ఏం జరిగిందంటే......"
"జీవన్" అన్నమాట వినగానే అటువైపు ఫోను డిస్కనెక్ట్ అయిపొయింది. ఉసురుమన్నాడు జీవన్. ఆమె పంతం ఆయనికి బాగా అనుభవమే తను మాత్రం? ఇప్పుడు కాదు అవన్నీ ఆలోచించవలసింది. మొదట రాగమాలని కాపాడుకోవాలి. మళ్ళీ డయల్ చేశాడు. ఈసారి అటువైపు నుంచి ఐదారు సార్లు రింగైయ్యాక గానీ అణువేద గొంతు వినబడలేదు.
"హల్లో!"
"వేదా! ప్లీజ్ ముఖ్యమైన విషయం......."
"ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ" మళ్ళీ అటువైపు నుంచి ఫోను డిస్కనెక్ట్ అయిపొయింది. తమ జివితాల్లాగే వుంది ఈ ఫోను రుమాలుతో మూతికి పట్టిన చెమట తుడుచుకున్నాడు నిలువునా వొణుకుతున్నాడు. ఘోరమైన ప్రమాదం పొంచి వుంది. అది అణువేదకి చెప్పడానికి విల్లేక పోతోంది. ఇదంతా ఏమిటంటే అసంకల్పితంగా ఆ ప్రమాదం సృష్టించినవాడు తనే! మళ్ళీ డయల్ చేశాడు. భువనేశ్వర్ కి ఈసారి ఫోన్ రింగైందే కాని ఎవరూ అటువైపు నుంచి రిసీవ్ చేసుకోలేదు. అణువేద డాన్సు స్కూలుకి వెళ్ళిపోయి వుంటుంది. అటు సూర్యుడు యిటు పొడిచినా ఆమె పంక్చుయాలిటి తప్పదు. రాగమాల ఏం చేస్తోందో? కాన్వెంట్ యూనిఫాంలో తల్లి పక్కనే వుండి వుంటుంది. ఒక్కసారి ఆ చిన్నారి గొంతు వినగలిగితే యెంత బాగుండును.
"పెసరట్టు"
"కాఫీ................"
వొళ్లు తెలియని కోపంతో రెండు చేతులతో ఆ రెంటిని పైకి ఎగరగొట్టాడు.
అమ్మ, అక్క యిద్దరు చెరో గోడకి అతుక్కుపోయి బొమ్మల్లా నిలబడిపోయారు భయంతో.
వాళ్ళనే మాత్రం లెక్కచేయకుండా వెంటనే తనకి ఛండాలపు ఐడియా యిచ్చి గుండాలను కూడా కుదిర్చి పెట్టిన గిరీశం యింటికి బయల్దేరాడు.
"రావోయిరా! శుభోదయం! అల్పాహారం తీసుకుంటావా!" ఆహ్వానించాడు గిరీశం. కన్యాశుల్కంలో గిరిశానికి వ్యతిరేకంగానా అన్నట్లు, ఈ గిరీశం యెప్పుడు అచ్చ తెలుగులోనే మాట్లాడుతాడు. పొరపాటున గూడ ట్రైన్ అని గాని, రైలు అని గాని అనడు. ధూమ శకటము అనే వాడతాడు.
"శుభోదయం కదయ్యా యిది! నా పాలిటి దురోదయం. నువు కురిర్చిన పెద్ద మనిషి ఎలాంటివాడో చూడు!" పేపర్ అతని ముందు పడేశాడు.
"పెద్దమనిషి అనకు. గుండా అను పెద్దమనుషులు యిలాంటి పనులకు వొప్పుకుంటారయ్యా!" మెత్తగా జీవన్ ని మందలిస్తూనే పేపర్లో వార్త చదివాడు గిరీశం.
"ఇతడు దొంగతనాలు చేస్తాడని నాకు తెలుసు. మరి యింతటి నేరస్థుడని తెలియదు.నువైనా అన్నీ తెలుసుకుని పంపవలసింది."
"నేను మిమ్మల్ని నమ్మాను"
"నే చెప్పిన పనులు అన్నీ నమ్మకంగా చెయ్యబట్టి నేను అతడిని నమ్మను."
"ఇంతకీ అతని అసలు పేరేమిటి? ఎక్కడుంటాడు?"
"నాతో హమేషా" అని చెప్పాడు. ఎప్పుడూ నా సేవలో వుంటానని అర్ధం. ధూమశకటపు వంతెన పక్క నున్న ఉపాహారశాలలో చెబితే తనకు కబురందుతుందన్నాడు ఇంతకు మించి గుండాలు చిరునామాలు యియ్యరని తెలుసుగా?"
"నా మొహం తెలుసు నాతో తన పేరు తమాషా అని చెప్పాడు చూడండి యెలా తమాషా చేస్తానో అన్నాడు పైగా "మీకు లోకజ్ఞానం బొత్తిగా లేదు" అనేది అణువేద అలాంటి చైల్డ్ రేపిస్ట్ ని రాగమాలని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని డబ్బు కూడా యిచ్చి పంపించాను. నిజంగా వెర్రివెధవని."
మంచిపోషణలో వొత్తుగా పెరిగిన క్రాపుని రెండు చేతులతో కసిగా పిక్కున్నాడు.
చాలా ఉల్లాసంగా వుంది. జాన్ గోవింద్ కి. జేబులో పర్సు బరువుగా తగిలినప్పుడల్లా అతనికి అలాగే వుంటుంది. ఆంధ్రాలో ఒక వూరి నుంచి మరొక వురికి లారీల ,మీద ప్రయాణం చెయ్యడమే అతనికి అలవాటు. తనబోటి వాళ్ళ అదృష్టం కొద్ది ఆంధ్రాలో లారీలు రాత్రింబవళ్ళు అన్నీ రోడ్డు మీద వీరవిహారం చేస్తూనే వుంటాయి. అనుకున్న పని ముగించుకునే వరకు అజ్ఞాతవాసం బెటర్. లారీ డ్రైవర్ కి అక్కడక్కడ కాస్త "తీర్ధం" పోయిస్తే చాలు సుఖంగా సాగిపోతుంది ప్రయాణం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS