Previous Page Next Page 
భామ కలాపం పేజి 2

 

    "నువ్వే లైన్ లో వెళతావు? హొటల్స్ నా?" అన్నాడు సతీష్.


    "వాట్ ఎల్స్?" అంది సుదీర. "హొటల్ బిజినెస్సే! పెద్ద చెయిన్ ఆఫ్ హొటల్స్ స్టార్ట్ చెయ్యాలని ఉంది నాకు. షేరటన్, హిల్దన్- ఇక్కడ ఇండియాలో "తాజ్, ఒబరాయ్ గ్రూప్ ఆఫ్ హొటల్స్ లాగా... ఐ వాన్ట్ స్టార్ ఏ ఫైవ్ స్టార్ హొటల్ ఇన్ ఎవ్విరి బిగ్ సిటీ!"


    "నో డౌట్! నువ్వు సాధించి తిరతావు."

    
    "ఎలా?"

 

    "మీ మమ్మీ , డాడి తలుచుకుంటే కొండమీది కోతి అయినా దిగి రాదా?"


    నవ్వింది సుదీర. దెబ్బకి దెబ్బ కొట్టేవన్నమాట!"

 

    సతీష్ కూడా నవ్వేశాడు. తరవాత తమకంగా సుదీర వైపు చూస్తూ "సుదీ! నువ్వు అప్సరసలకన్నా బాగుంటావు. తెలుసా?" అన్నాడు.


    "యూ ఆర్ పుటింగ్ మీ అన్! మునగచెట్టు ఎక్కిచేస్తున్నావు. అవునా?" అని నవ్వి, "హల్లో జెన్ని!" అంటూ దూరంగా జరిగిపోయింది సుదీర.


    "సుదీ! యూ ఆర్ లుకింగ్ డివైన్! ఎక్కడ కొన్నావ్ ఈ ఈవినింగ్ గౌను?" అంది జెన్ని మెచ్చుకోలుగా చూస్తూ.


    "పియర్రి కార్దిన్" అంది సుదీర. మృదువుగా తన ఒంటి ఓంపులని అంటిపెట్టుకుని ఉన్న గౌను మీద లేని మదతలని సరిచేసుకుంటూ.

    జెన్ని వెంటనే కళ్ళప్పగించేసి ఆరాధనగా చూసింది ఆ గౌను వైపు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆ ఫ్రెంచ్ డిజైనర్  తయారు చేసే అద్భుతమైన డ్రెస్ స్ గురించి పుస్తకాల్లో చదవడమే గానీ, ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి తనకి.


    "ఎంత?" అంది.


    చెప్పింది సుదీర. వెంటనే జెన్ని పెదిమలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.


    "దీప ఎక్కడుంది? ఏం చేస్తుంది?" అంది సుదీర.


    మోహం వెగటుగా పెట్టింది జెన్ని. "తను ఇంటర్ కాస్ట్ మేరేజి చేసుకుంది. విజయవాడలో ఉంటుందనుకుంటాను ఇప్పుడు. ఇంతలో మరొక అరడజను మంది అబ్బాయిలు సుదీరను చుట్టేశారు.


    అందరి దృష్టికి తనే కేంద్రమై , సంతోషంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న కూతురి వైపు మురిపెంగా చూస్తున్నారు సీతా, రత్నాకరరావూ.


    వాళ్ళకి తెలుసు. ఈ ఫంక్షను దాదాపు ఒక స్వయంవరంలా మారే అవకాశం ఉందని. సిటిలో ఉన్న పెద్ద కుటుంబాల తాలుకూ బ్రహ్మచారులు చాలా మంది వచ్చారు ఆ పార్టీకి. వాళ్ళలో మంచి వరుణ్ణి సెలెక్ట్ చేసుకోవచ్చు సుదీర. లేదా, వాళ్ళలోనే చొరవవున్న కుర్రాడేవరన్నా సుదీరని చూసి ఇష్టపడి పెళ్ళి ప్రపోజలు చెయ్యవచ్చు.


    అసలు ఈ ఫంక్షన్ అందుకోసమే ఏర్పాటు చేయించింది మిసెస్ సీతా రత్నాకరరావ్. పనిలో పనిగా ఫంక్షనుకి ఒక మంత్రిగారిని కూడా ఇన్వయిట్ చేసింది. ఆయనకి ఒక దండ వేసి దండం పెడితే అయన ద్వారా తమకి అత్యవసరంగా జరగవలసి ఉన్న ఒక పని కూడా జరిగిపోవచ్చు.


    అంత ముందు చూపు ఉంది కాబట్టే,  సీత రాజకియల్ల్లో త్వరత్వరగా పైకి వచ్చేస్తుంది.

 

    వేదిక మీద ఆర్కెస్ట్రా సందడిగా వాయించేస్తోంది. హిందీ పాటని పూర్తీ చేసి తెలుగు పాట అందుకుంది పాడుతున్న అమ్మాయి.

 

    పాటల ప్రోగ్రాం పూర్తి అయ్యాక తెల్లటి పొడుగు చేతుల బనీను , ఒంటికి అతుక్కున్నట్లు ఉన్న తెల్ల పాంటూ , తెల్ల కాన్వాస్ షూసూ వేసుకుని, మొహానికి సుద్దలాగా తెల్లరంగు పూసుకుని వున్న ఒకతను రంగం మీదికి వచ్చాడు. అతని కనుబొమ్మలూ, పెదవులూ చిక్కటి రంగుతో టచ్ చేసి వున్నాయి.


    "లేడిస్ అండ్ జంటిల్మన్! నౌ వీ ప్రెజెంట్ మిస్టర్ అశ్వని ద గ్రేట్ మైమ్ ఆర్టిస్ట్!" అన్నాడు కొంపీర్, తన చిత్రమయిన ఉచ్చారణతో.


    మైమ్ అంటే ఏమిటో ముందుగా కొద్ది వాక్యాలతో వివరించాడు అశ్వని. ముఖాభినయం అది. మాటలు, శబ్దాలూ లేకుండా కేవలం చేతులతోనే మిమిక్రి లాంటిది చేస్తూ, ఆడవాళ్ళు చీరె ఎలా సింగారించుకుంటారో, దొంగ ఇంట్లో ఎలా దూరతాడో, ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యలేని కానిస్టేబుల్ ఏల సతమతమై పోతాడో అనుకరించి చూపి నవ్వించాడు.


    'అవర్ నేక్స్ట్ అయిటమ్ ఈజ్ కూచిపూడి డాన్స్- బై ది రినోన్ద్ ఆర్టిస్ట్ విజయ భరత్!" అని చెప్పాడు కొంపీర్.


    గజ్జెలు ఘల్లుమన్నాయి.


    విజయ భరత్ వచ్చి అందరికి నమస్కరించాడు.


    చిన్నప్పటినుంచి క్రమం తప్పకుండా చేసిన యోగభ్యాసం వల్లా, నిరంతర నృత్య సాధనవల్లా, అతని శరీరం బిగువుగా కండలు తిరిగి గ్రీకు శిల్పంలా ఉంది. చాలా తెల్లగా, బంగారు రంగులో వున్నాడతను. కావలసిన భావాన్ని సులభంగా పలికించగల విశాల నేత్రాలు, ఎత్తుగా ఉన్న ముక్కూ గుబురు మీసాలు , గిరజాల జుట్టు.


    చాలా అందంగా ఉన్నాడతను.

 

    ఇంతలో కలకలం!


    "మంత్రిగారు వచ్చారు. మంత్రిగారు వచ్చారు!" అంటున్నరెవరో.


    తెల్లటి అంబాసిడర్ కారు వచ్చి లాన్ పక్కన ఆగింది. మంత్రి కృష్ణస్వామీ కారు దిగి అందరికి నమస్కారం పెట్టి, "క్షమించాలి! కొంచెం ఆలస్యమయింది నా రాక!" అంటూ షామియానా వైపు నడిచారు.


    మంత్రిగారి పక్కనే నడుస్తూ వినయంగా ఏదో మాట్లాడుతోంది సీత.


    ముందు వరసలో కూర్చున్నారు కృష్ణస్వామీగారు.


    నృత్యం మొదలయింది.


    సీత కొంచెం దూరంలో నిలుచున్న సారధి వైపు సాభిప్రాయంగా చూసింది. అతను వాళ్ళ ఫామిలి లాయరే కాకుండా, ఆ కుటుంబ సభ్యుల్లో ఒకడుగా చెలామణి అవుతాడు.


    ఆమె భావం అర్ధం చేసుకుని ఒక పెడగా వేసిన మరో షామియానా వైపు నడిచాడు అతను.


    మంత్రిగారికి మర్యాదలు మొదలయ్యాయి. తెల్లటి యునిఫారాలు వేసుకుని, నడుముకి ఎర్ర పటకాలు , కుచ్చు తలపాగాలు పెట్టుకున్న నౌకర్లు ట్రేలలో బాటిల్సు గ్లాసులూ అమర్చి తీసుకొచ్చారు. గ్లాసులు బాటిల్సుని తాకుతూ, మృదువుగా శబ్దం చేస్తున్నాయి.

 

    పెదవులను ఈ చెవి దగ్గర్నుంచి ఆ చెవిదాకా సాగదీసి నవ్వుతూ మంత్రిగారి చెవిలో చెప్పింది సీత. "మంచి ఫాంపెను! మా లోకల్ తయారి కాదు. ఫామిలి ప్రెండు ఒకాయన బర్గండి వెళ్ళి వస్తూ ఒక బాటిల్ తెచ్చి ప్రెజెంట్ చేశారు. ఇది మీకోసం ప్రత్యేకం!" అంది వగలుపోతూ.


    బట్లరు షాంపేను కార్క్ ఓపెన్ చేశాడు. "ఠప్" మని శబ్దం. షాంపేను బుసబుసమని నురగలు కక్కుతూ పొంగింది.


    ఆ షాంపేను లాగే పొంగింది భరత్ కోపం కూడా. అతను ఆగ్రహంగా చూస్తూ నృత్యం ఆపేశాడు. అతనికి నృత్యమంటే భక్తీ. దానిపట్ల ఆలక్ష్యాన్ని భరించలేడు. వేదిక మీద నుంచి కిందకి దిగి చరచర నడవడం మొదలెట్టాడు.


    మంత్రిగారి మొహం జేవురించింది. అయన కూడా చటుక్కున లేచి నిలబడ్డాడు.

 

    సీత వైపు తీక్షణంగా చూసి, "మీకు తెలియదేమో నేను మద్యం తాగటం మాట అటుంచి తాకను కూడా తాకను" అన్నారు.


    పెద్దపులి తన కోసం ఏర్పాటు చేసిన విందుకు వచ్చి "నేను పచ్చి శాకాహారిని! ఆకులలములు తప్ప భోజనం చెయ్యను!" అని ప్రకటించినంత విడ్డురంగా అనిపించింది సీతకు, తెల్లబోయి, అంతలోనే తేరుకుని మనోహరంగా నవ్వింది. "సారు మరి పబ్లిక్ మీటింగు ల్లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు. మరేం ఫర్లేదు. ఇక్కడంతా మనోళ్ళే! మీరు ఫ్రీగా వుండొచ్చు!" అంది.

 

    "నేను చెప్పేది చేసేది కూడా ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది" అన్నారు మినిస్టర్ కృష్ణస్వామి తీవ్రంగా.


    ఈడ్చి చెంపమీద కొట్టినట్లు అనిపించింది సీతకు. మొహం గంటు పెట్టుకుని, "క్షమించండి! మీకోసం ఆపిల్ జ్యూస్ తెప్పిస్తాను" అని సారధి!" అని పిలిచింది.


    "అతనేడి? ఆ డాన్సర్ విజయ్ భరత్! వెళ్ళిపోయాడా?"

 

    భరత్ అప్పటికే గేటు దగ్గిరికి వెళ్ళిపోయాడు.


    రత్నాకరరావు ముందుకొచ్చాడు. "వాడంతేలెండి! క్రాక్ గాడని ముందే ఎవరో చెప్పారు. ఇదివరకు కూడా ఒకటి రెండు చోట్ల ఇలాగే తల తిక్కగా చేసి సగంలోనే వెళ్ళిపోయాడట! వాడి సంగతి నేను జూసుకుంటాలెండి" అన్నాడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.

 

    "ఏమిటి మీరు చూసేది? అతను చేసిన డాన్సు చూశారా అసలు? అద్బుతంగా చేస్తాడు. అసలు అతని డాన్సు చూడడానికే తక్కిన ఎంగేజ్ మెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని వచ్చాను నేను. అతను డాన్సు చేసున్న టైములోనే మీరు డ్రింక్స్ సర్వ్ చేసి డిస్టర్బ్ చెయ్యడం చాలా తప్పు! అమర్యాద! ఆ కుర్రాణ్ణి వెనక్కి పిలవండి అన్నారు.


    "అతను ఎటు వెళ్ళాడో కనిపించడం లేదు. బహుశా ఏ లారినో ఆపి, ఎక్కేసి ఉంటాడేమో" అన్నాడు సారధి, గేటు దాకా వెళ్ళి చూసి వస్తూ.


    ఆ తరవాత మీరేవరన్నా వెళ్ళి అతనికి మన అందరి తరుపునా క్షమార్పణ చెప్పిరండి! మీకు వీలుకాకపోయినా, లేదా చిన్నతనమనిపించినా నేనే స్వయంగా అతని దగ్గరకు వెళ్ళి, మన్నించమని అడుగుతాను" అంటూ విసవిసా వెళ్ళి కారేక్కారు కృష్ణస్వామీగారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS