Previous Page Next Page 
అరుణ పేజి 2

 

    "నీకింకా చిన్నతనం అరుణా! అందుకే ఆవేశంగా మాట్లాడుతున్నావు అనాలోచితంగా : చిన్నతనం ఒకటే కాదు. నీవుఆడ పిల్లవు. ఇలాంటి ఆశయాలు, ఆదర్శాలు ఆచరణలో పెట్టాలంటేనీవల్ల జరిగే పనికాదమ్మా!"
    "ఏం? ఆడపిల్లని చదవగాలేనిది ఉద్యోగం ఎందుకుచేయలేను?"    
    "ఆ ఉద్యోగం ఇలాంటి ఊళ్ళల్లో అయితే నిక్షేపంగా చేయచ్చు. నీవన్నట్లు ఏదోపల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టడం,    
    మానవసేవచేద్దామనుకోవడంఅదంతా నీ వనుకున్నంత తేలిక కాదమ్మా నీ ఆశయాలు మంచివేగాని..... అవి ఆచరించడం కష్టం.    
    అందులో నీలాంటిస్త్రీలకు ఇదే నీవుకొడుకువయితే, నీ ఆశయాన్ని నిరభ్యంతరంగా ఆమోదించడమేకాక ప్రోత్సహించిఉండేవాడిని."    
    "ఇదిగో, నాన్నా అందుకే నాకు కోపం వస్తుంది. ఎంత చదివినా ఏం చేసినా ఆడదనగానే మీరందరూఅంత నీరసంగా ఎందుకు మాట్లాడతారోనా కర్ధం కాదు. మగవాడుచేయగలిగింది. ఆడది ఏది చేయడంలేదు? ఆడపిల్లనయిచదవగాలేంది....."ముక్కు ఎర్రబరాచుకుని మూతి ముడుచుకుని అందిక అరుణ.    
    ఆమాట అంటే అరుణకి కోపం అని రామారావుకి తెలుసు. "ఆడదానివి" అంటే అరుణకి పట్టరానికోపం వస్తుంది. ఆడదయినంతమాత్రాన పురుషులతోసమానంగా చదవడంలేదా? ఉద్యోగం చేయడంలేదా? విదేశాలు తిరిగి రావడంలేదా?  
    ఏ విషయంలో మగవాడి కంటే తఃక్కువని ఆడదనగానే చిన్నచూపు చూస్తారు?" అరుణ వాదన అది. అరుణతో ఈ విషయంలో వాదించలేక చాలాసార్లు ఊరుకున్నారు ఆయన. అందుచేత ఈ విషయంలో రెచ్చగొట్టకఇంకో విషయం ఎత్తారు.    
    "అయితే, అరుణా, బాగానే ఉంది కానీ, నీవెప్పుడన్నా అసలు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూశావా?"   
    అరుణతల అడ్డంగా తిప్పింది. నిజానికి అరుణ ఇప్పటివరకు పల్లెటూరు ఎలా ఉంటుందో చూడలేదు. పుట్టడం, పెరగడం, చదువు అంతా విశాఖపట్టణంలోనే అయిపోయింది. మాతామహులు, పితామహులు అందరూ పట్టణాలలోనే  వుండడం చేత ఏ పల్లెటూరూ వెళ్ళవలసినఅవసరం ఆమెకి కలగలేదు. మహా చూస్తే బొమ్మలలో, సినిమాలలో తప్ప చూసింది లేదు.    
    "పల్లెటూళ్ళంటే ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఊరేకాక అక్కడి మనుష్యులు, ఆ వాతావరణం అవి ఎలాంటిదో నీకు తెలియవు. అందుకే పెద్ద పెద్ద ఆశయాలు వల్లిస్తున్నావు"    
    "చూడకపోతేమాత్రం ఆ తెలియదానాన్నా, సిటీలాగా ఎలక్ ట్రిసిటీ, సినిమాలు, కార్లు బస్సులు అవీ లేకపోవచ్చు. కోరిక ఉంటే ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అంతకష్టం ఉండదు." పట్టుదలగా అంది అరుణ.    
    "అంతేకాదు అక్కడి మనుష్యులతత్త్వం నీకు తెలియదు. పల్లెటూళ్ళలో ఉండే మోతుబారులు, పార్టీలు, కక్షలు, కొట్లాటలు......వాటితో"    
    నాకుసంబంధం ఏమిటినాన్నా?" "ఎందుకు ఉండదమ్మా? ఊరిలో ప్రజలు రెండేసిమూడేసి పార్టీలుంటారు. నీవు ఒకళ్ళతో కాస్తమంచిగా ఉన్నావా, తక్కినవాళ్ళు కక్షకట్టి సాధిస్తారు. ఎన్ని విధాల ఇబ్బందిపెట్టాలో అన్నివిధాలబాధపెడతారు. రోగంతో చస్తున్నా నీ దగ్గరికి మందుకిరారు. వాళ్ళపార్టీ వాళ్ళని రానీరు. పేషంట్సే లేకపోతే నీ ఆశయాలకి ఆదర్శాలకి అవకాశం ఎక్కడ ఉంటుందమ్మా!" సవాల్ చేస్తున్నట్లు చూశారు.
        అరుణ తేలిగ్గా నవ్వేసింది. "మీరు భయపెడుతున్నారునాన్నా! నాకీ పార్టీలతో కక్షలతో ఏం సంబంధం! ఒకళ్ళతోనే మంచిగాఎందుకు ఉండాలి? అందరూ సమానమే మనకు! ఇంతకీ నేనేం గవర్నమెంటు డాక్టరు వాళ్ళ ప్రభావాలు నామీద చూపడానికి: స్వంతప్రాక్టీసు పెడతాను. ఎవరిఇష్టం అయితే వారువచ్చి వైద్యం చేయించుకుంటారు."

    "ఊ....... ఉండదని నీ వనుకుంటున్నావు సరే ఇప్పుడు నేను చెప్పినా అర్ధంగాదు, అనుభవం అయితేనేగాని పోనీ పల్లెలో ప్రాక్టీసు పెడతానంటావుబాగానేవుంది పల్లెటూరిలో ఉండే జనాభా ఎంత? అందులో డబ్బిచ్చి వైద్యం చేయించుకునేశక్తి ఉన్నవాళ్ళెందరు? అలాంటిచోట నీకువచ్చే డబ్బుఏపాటి? ఆశయాలు ఆదర్శాలుతిని బ్రతకలేవుగదా?"  
    "నాకెంతకావాలి. నాన్నా వేలు అర్జించాలన్న కోరికనాకు లేదు. జీవనోపాధిదొరికితేచాలు.  ఆ మాత్రంరాదంటారా? సాధారణంగా ఓ ఊరు ఉందంటే చుట్టుపక్కల రెండు మూడు చిన్నచిన్నఊళ్ళు కలిసేవుంటాయి. అలాంటివి రెండు మూడుకలిపి చూస్తే సరిపోతుంది."    
    కూతురిధోరణి చూస్తే ఇదంతా ఊసుపోకకి. కాలక్షేపానికి జరిపే సంభాషణకాదనిఅర్ధం అయిపోయింది రామారావుగారికి. అరుణ ఆలోచన పటిష్టమైనదనే అనిపించింది. ఆడపిల్ల ఒక్కర్తీ ఏదో ఊళ్ళో ఉండి ప్రాక్టీసు పెడతానంటుంది. ఎలా కుదురుతుంది? ఎవరూ లేనిచోట ఆడపిల్ల ఒక్కర్తీ ఎలానెగ్గుకొస్తుంది? ఎంత చదువుకున్నా ఆడపిల్లఆడపిల్లేగా? ఒక్కర్తిని అంత బాధ్యతారహితంగా ఎలాపం పెయగలరు?    
    అందులో ఇలాంటి ఆలోచనహఠాత్తుగా పుడుతుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు. ఏదో చదువుకుంది. ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుంది ఎవరో ఇంకో డాక్టరుని చూసి పెళ్ళిచేస్తే తమ బాధ్యత తీరిపోతుందని ఇన్నాళ్ళుగా అనుకుంటూండేవారు. ఇంచుమించు అరుణకి భర్తనికూడా మనసులోనే స్థిరపరచుకున్నారు ఆయన. అరుణ కోసం ఇంటికి వచ్చేవేణుగోపాల్ ని చూసినమొదటి రోజునే ఎంతో నచ్చాడు ఆయనకి, అరుణకి రెండేళ్ళు సీనియర్ అతను. హౌస్ సర్జన్సీ పూర్తిచేసి, ఆ హాస్పిటల్ లోనే అసిస్టెంట్ గా ఉంటున్నాడు సంవత్సరంనుంచి. అరుణ మూడో సంవత్సరంలో ఉండగా, ఒకరోజు ఇంటికితీసుకొచ్చి తండ్రికిపరిచయం చేసింది. చూడగానే ఈడు జోడు ఎంతో బాగుందనిపించింది ఆయనకి.    
    మాటల మధ్య కులం, కుటుంబం, మంచీ చెడ్డా తెలుసుకున్నారు. అన్నీ బాగున్నాయని సంతృప్తిపడ్డారు. ఇద్దరూ డాక్టర్లు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నట్లే కనబడుతూందని వాళ్ళ మాటలవల్ల, చూపులవల్ల, తరువాత ఎన్నో సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసితిరగడం - అన్నీ చూసినిశ్చయానికి వచ్చారు. అయినా, ఆయన ఆ ప్రస్తావన అరుణ దగ్గిర ఎన్నడూ ఎత్తలేదు. అరుణచదువు పూర్తయ్యాక ఆలోచించవచ్చని, ఈలోపల వారిద్దరి స్నేహం పటిష్టం అయి, ఏ రూపు దాల్చేది తేలిపోతుంది అప్పుడింక తమ వంతు రెండు అక్షింతలు చల్లితే సరిపోతుంది. ఇన్ని రకాలుగా ఆలోచించారు ఆయన అప్పుడు.  
    కాని, ఇప్పుడు అరుణ ఆలోచనలు ఈ విధంగా మారడంతో ఆయనకేం చెప్పాలో తోచలేదు. ఆ పెళ్ళేదో అయ్యాక దాని ఇష్టం, దానిమొగుడిష్టం. కాని ఇప్పుడు ఒక్కర్తిని ఎలా ఊళ్ళకిపంపడం: ఈ ఆలోచనవేణుగోపాల్ కి నచ్చుతుందో, లేదో? అసలు వివాహంగురించి వాళ్ళిద్దరి అభిప్రాయం ఏమిటో? అంతా గడబిడగా అనిపించింది ఆయనకి.    
    "ఏమిటమ్మా, నీవు ఊరికే ఏదో అంటున్నావా? లేక అంతా నిశ్చయించుకునే మాట్లాడుతున్నావా?" గంభీరంగా అడిగారు రామారావుగారు.        
    "ఊరికే ఎందుకంటాను నాన్నా? నిన్న రాత్రంతా ఈ విషయమేఆలోచించాను. నేను ఏదో ప్రత్యేకతకావాలని ఆరాటపడ్డాను ఇన్నాళ్ళూ కాని, దానికినిర్దిష్టమైన రూపం ఏమిటో తెలీలేదు నిన్నటి వరకు. ఇప్పుడు తెలిసింది." స్థిరంగా అంది అరుణ.    
    "అరుణా! నీవా ఊళ్ళలో ఉండలేవమ్మా నా మాట విను నీ ఆశయం మంచిదేగాని. ఆ ఊళ్ళలో ఉండడానికి తగిన వసంతయినా ఉండదు. నీ ఆసుపత్రికిదానికి తగిన వసతిదొరకదు. ఆఖరికి నీకు కావలసినమందులూ అవి పై ఊరినించేతెప్పించుకోవాలి. ఈ అవస్థలవీ నీవెక్కడపడగలవు? ఇంతకీనీకు మానవసేవచేయాలంటే పల్లెటూరికి పరుగెడితేనేగాని కాదా? ఆ మానవసేవ ఏదో ఇక్కడుండే చేయచ్చు? నీకు గవర్నమెంటు ఉద్యోగం నచ్చకపోతేస్వంతంగా ప్రాక్టీసు పెట్టుకోవాలంటే బీదవాళ్ళకి డబ్బు తీసుకోకుండా వైద్యం చేయి. నిజానికి నీ ప్రతిభ పైకి రావాలంటే నలుగురు వచ్చేచోటు, నాలుగు రకాలరోగాలు వచ్చే ఈ పట్టణాలలోనేవీలు. పల్లెలలోనీ చేత వైద్యం చేయించుకునే వారెవరు?" తన మాటల ప్రభావం కూతురిమీద ఎలా పని చేస్తుందోనని కూతురి మొహంలోకి చూశాడు.   
    అరుణ ముఖంలో భావాలు చదవలేకమళ్ళీ ఆరంభించారు. "అమ్మా! ఈ మాత్రం ఆశయాలు లేకనా, నీలా ఆలోచించలేకపోతునంరు అందరూ? మనపల్లెలస్థితిగతుల బట్టి ఎవరూ ముందంజ వేయలేరు. ఆ ఇబ్బందులన్నీ పడే ఓపిక ఎవరికీ ఉంటుంది?"   
    "అందుకే, ఎవరికీ వారే స్వలాభంచూసుకోబట్టే మన పల్లెలగతి అలా ఉంది. మనదేశం ఎప్పటికీ ఇలావెనకబడే ఉండడానికి కారణం ఇదే....." ఆవేశంగా అంది అరుణ.  
    ఆ తండ్రి, చెల్లెలు ఏదో వాదించుకోవడంవిని కృష్ణమూర్తి గదిలోంచి వచ్చాడు కుతూహలంగా, అదేమిటో తెలుసుకోవడాని   
    "ఏమిటి, నాన్నగారూ, ప్రొద్దుటే తీరుబాటుగా ఏదో చర్చిస్తున్నారు ఇద్దరూ?"    
    "చూశావురా? అరుణ ఏమంటోందో?" ఫిర్యాదుచేసినట్లు అన్నారు.    
    "ఏమిటంటోంది? ఏమిటమ్మా?" అరుణవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు కృష్ణమూర్తి.   
    "నీచెల్లెలు గారు డాక్టరమ్మ అయి, పల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టి మానవసేవచేస్తుందిట పెద్దపెద్ద ఆశయాలు వల్లిస్తోంది.......విను."   
    "పల్లెటూరిలో నా: ఇదెప్పటినించి? ఏం పట్టణాలు గొడ్డుపోయాయేమిటి పేషంట్లు లేక!"    
   "అబ్బే! డాక్టర్లు లేక పల్లెలు గొడ్డు పోతున్నాయని." అన్నగారి గొంతుననుకరిస్తూ అంది అరుణ నవ్వుతూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS