Next Page 
హేల్త్ సైన్స్  పేజి 1

                                                                   హెల్త్__ సైన్స్

                                                                                                                            ---డా" సమరం
                                                           1.వడదెబ్బ ప్రారంభ లక్షణాలు

    ఆఫీసు నుంచి తిరిగివచ్చిన అంజనేయులకు బాగా అలసటగా ఉన్నట్లు, కడుపులో తిప్పుతున్నట్టు చాలాసేపు అనిపించి చివరకి ఒకటి రెండు వాంతులు అయ్యాయి. తరువాత అతనికి కాళ్ళూ, కండరాలు బిగాదీసుకు పోతున్నట్టు బాధ పెట్టాయి. మామూలు రోజుల్లో ఇలాంటి రుగ్మతలే కలిగితే ఇంకేదో అనుకునేవాడు . కాని ఎండాకాలంలో ఈ లక్షణాలు కనిపించటంతో తనకు వడ దెబ్బ తగిలిందేమోనని భయపడిపోయాడతను. అయితే అతనికి చమట పడుతూనే వుంది. కాని వడదెబ్బలో మాదిరిగా జ్వరం లేదు.స్పృహాకూడా వుంది. ఇంతకీ ఈ లక్ష్యాలన్నీ అతనికి ఎందువల్ల వచ్చినట్టు?

    ఇవన్నీ వడదెబ్బకి ప్రారంభ లక్షణాలు. ఎండా కాలంలో చమటపట్టి తద్వారా శరీరంలోని ఉప్పు_ నీరు బయటకు పోవడంతో తలనొప్పి, వికారం, వాంతులు, కాళ్ళుగుంజడం , తలతిరగడం లామ్యి లక్షనాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన పరిస్థితినివైద్య భాషలో ఢీఫీషయన్సీ హీట్ ఎక్సాస్టన్" అంటారు.

    ఈ పరిస్థితి ఎండాకాలంలో శారీరకశ్రమ చేసే వారికీ ఎక్కువుగా ఏర్పడుతుంది. దీనికి కారణం వరు ఎక్కువ చమట కారుతున్నా తగినంత నీరు తాగాకపోవడం .ఉప్పు తీసుకోకపోవడం చమట ఎక్కువ పెట్టెవాళ్ళు, ఎండలో పనిచేసేవారు, ఎక్కువ నీళ్ళతోపాటు ఉప్పు కూడా తప్పక తీసుకోవాలి. ఆరుబయట పనిచేసేవాళ్ళు గాలి తగినంతలేని ప్రదేశంలో పని చేసేవాళ్ళలోనే కాకుండా ఇతరులకు కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎప్పుడూ చల్లని స్థలాలలో ఉంటూ హఠాత్తుగా ఎండలు ఎక్కువ ఉండే ప్రదేశాలకు వచ్చే వారిలోనూ, జ్వరం వస్తున్నావారిలోను వంతులు, విరోచనాలు అవుతున్న వారిలోనూ ఎండా కాలంలో ఇలాంటి లక్షణాలు కలగడం సహజం. కొందరు ఉప్పు ఎక్కువ వాడుతూనే వుంటారు. కాని ఎండలో తిరగడం అలవాటులేక కోడిపాటి వేడి. చమతాలకే వారికీ తలతిరగడం, కాళ్ళు గుంజడం లాంటి లక్షణాలు అవహిస్తాయి.

      హీట్ ఎక్సాస్టన్ లక్షణాలు కొందరికి రోజూ కొద్దో_ గొప్పోవున్నట్టు అనిపిస్తూ కొంతకాలానికి తీవ్రరూపం దాల్చవచ్చు.కొందరికి ఈ లక్షణాలు పరిమితంగానే ఉన్నప్పుడు రోజూ కొద్దిగా పనిచేయగానే త్వరగా అలసిపోతూ వుంటారు. ఆకలి మందగించడం, కడుపులో వికారం. తలనొప్పి. కండరాల నొప్పులు, ఒళ్ళు, తూలడం లాంటి లక్షణాలు వుంటాయి. వీటివల్ల కొంత బాధగా ఉన్నా పని చేసుకుంటూనే వుంటారు. ఎండాకాలంలో కొంత బరువు కూడా కోల్పోతారు . ఎపుడూ నీరసంగా వున్నట్టు అనిపిస్తూ యుంటుంది. జ్వరం వస్తున్నాట్టు ఉంటుంది. జ్వరం వస్తున్నట్టు ఉంటుంది కాని అది పెద్ద లెక్కలోకి రాడు. చమట ద్వారా ఉప్పు, నీరు పోవడంతో జ్వరం తీవ్రగా మారితే కొందరు అపస్మారక స్థితికి లోనయ్యేప్రమాదంవుంది.

    హీట్ ఎక్సాస్టన్ ఒక మాదిరిగా వచ్చిన వారిలో రక్తం మామూలుగా కంటె తగ్గిపోతుంది. కూర్చున్నవాళ్ళు లేచి నిలబడగానే కళ్ళు బైర్లుకమ్మి, తలతిరుగుతూనట్లు అయి పడిపోతారు . గుండె కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. మూత్ర విసర్జన తగ్గిపోతుంది. రక్తంలో నీరు శతం తగ్గిపోతుంది. మొదల్లోనే గుర్తించి ఈ పరిస్తితులని చక్కదిద్దడం అవసరం. లేకపోతే కొందరు హఠాత్మరిణామాలకుటట్టుకోలేరు.

    హీట్ ఎక్సాస్టన్ లక్షణాలు కనబడినపుడు ఆ వ్యక్తిని చల్లని ప్రదేశంలో విశ్రాంతిగా పడుకోబెట్టాలి. తాగాడానికి ఉప్పు కలసిన నీళ్ళు గాని, మజ్జిగగాని ఎక్కువ ఇవ్వాలి. ఉప్పు లేకుండా కేవలం చల్లని మంచి నీళ్ళు ఏంట తాగినా ఫలితం వుండడు. ఒక మాదిరిగా హీట్ ఎక్సాస్టన్ లక్షణాలు ఏర్పడిన వాళ్ళకి 24గంటల్లో 5లీటర్లకి తక్కువ కాకుండా తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. కనీసం 25గ్రాముల ఉప్పు రోజు మొత్తం మీద తీసుకోవాలి. హీట్ ఎక్సాస్టన్ తీవ్రరూపంలో ఉన్నవారికి నరానికి సలైను ఎక్కించడం ద్వారానూ, ప్లాస్మా ఇవ్వడం ఇబ్బందిగా ఉన్న పక్షంలో మజ్జిగలోగాని, పళ్ళరసంలోగానీ, మరోరకంగా ఉప్పును స్వీకరిస్తే ఎండా కాలంలో అలసటను ఇతర ఇబ్బందులను అధిగమించవచ్చు.


Next Page 

WRITERS
PUBLICATIONS