Next Page 
విషవలయం పేజి 1

   
                                                                విషవలయం

                                                                                            కొమ్మూరి వేణుగోపాలరావు

 

 



    రైలు కూతవేసింది సత్యమూర్తి ఫస్టుక్లాస్ కంపార్టుమెంటు తలుపు దగ్గర నిలబడ్డాడు.

    "మళ్ళీ ఎప్పుడూ?' అనడిగింది ఫ్లాట్ ఫారంమీద నిలబడ్డ ఉష ఆదుర్దాగా.

    "త్వరలోనే" అన్నాడు సత్యమూర్తి ఆమె ముఖంలోకి చూస్తూ.

    "అంటే? అలా అంటే నాకర్ధం కాదు. సరిగ్గా చెప్పండి" అంది ఉష గారాబంగా.

    "అక్కడి పరిస్థితి ఎలావుందో తెలీదు. ఏమాత్రం అవకాశం చిక్కినా పరుగెత్తుకు వచ్చెస్తాను" అన్నాడతను అనునయంగా.

    రివ్వున గాలివీస్తోంది. ఆమె ముంగురులు కళ్ళమీదిగా వచ్చి పడ్తున్నాయ్. జనమంతా రైల్లో ఎక్కేసి ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు వున్నారు.

    రైలు మరోసారి ఘార్ణిల్లి కదిలింది.

    "అన్నయ్య ఊళ్ళో లేడు. రేపు రాగానే మీరింత హఠాత్తుగా వెళ్ళి పోయారని తెలిసి నిర్ఘాంతపోతాడు" అంది ఉష రైలుతోపాటూ నడుస్తూ.

    "అతన్ని అడిగినానని చెప్పు. ఇంకా ఉండు ఉషా, ఎంత దూరం వస్తావు?"

    "మీ నాన్నగారికి ఎలా వుందో రాస్తారు కదూ?"

    "అలాగే"

    ఆమె ఆగిపోయింది. అతను చెయ్యి ఊపుతూ తలుపు దగ్గరే నిలబడ్డాడు. ఆమె చెయ్యి పైకెత్తి వ్రేళ్ళు ఆడిస్తూ అతను కనుమరుగైపోయే వరకూ అలాగే చూస్తూ నిలబడింది.

    ఆమె కనిపించేటంతవరకూ అక్కడే నిల్చుని తర్వాత సత్యమూర్తి మెల్లగా లోపలకు వచ్చాడు. పెట్టెలో అతనుగాక యింకా ముగ్గురున్నారు. ముగ్గురూ నడివయసు దాటినవాళ్ళే. ఇద్దరు లోకాభిరామాయణంలో వున్నారు, మూడోవ్యక్తి దినపత్రిక చదువుకుంటున్నాడు.

    సత్యమూర్తి కిటికీ దగ్గరగా కూర్చుని బయటకు చూస్తున్నాడు. అతనికి రైలు ప్రయాణాల్లో ఎవరితోనూ మాట్లాడే అలవాటులేదు. ఎక్కువ భాగం ఆలోచనలతో గడుపుతాడు. లేకపోతే ఏదయినా పుస్తకం తీసుకొని పేజీలు త్రిప్పుతూ కూర్చుంటాడు.

    ఆ రోజు ట్రెయిన్ లేటయింది. మధ్నాహ్నం రెండుగంటల ప్రాంతములో బయల్దేరవల్సింది_అయిదింటికి గాని అసలు విశాఖపట్నం స్టేషన్ కె ఊడిపడలేదు.

    ఆ చిక్కటి సంధ్యలో రంగులు పులుముకున్నట్లు గోచరించే ప్రకృతిని తిలకిస్తూ కూర్చున్నాడు అతను. కాని అతను పకృతి సౌందర్యాన్ని చూసి తన్మయత్వం చెందడంలేదు. అతని మనసంతా కలగాపులంగా ఆలోచనలు అలుముకుని వున్నయ్.

    అంతకు ముందురోజునే అన్సర్ పరీష చివరి పేపరు రాశాడు కాని అతనికి వెంటనే తమ వూరికి ప్రయాణం కావడం చివరి యిష్టంలేదు అక్కడే ముంది? గోరీలాంటి పెద్ద భవంతి. అందులో మెసిలే తల్లీతండ్రీ_ వేరే ఎవరూ వుండరు. ఒంటరి తనంలో విసుగెత్తి ఎక్కడకన్నా పారిపోబుద్దయ్యే వాతావరణం. కాని అనుకుని విధంగా యీ ఉదయం యిమ్తినుమ్ది టెలిగ్రామ్ వచ్చింది_ " తండ్రికి సీరియస్ గా వుంది వెంటనే బయల్దేరిరమ్మని" అతను కంగారుపడ్డాడు ఉద్రేకపడ్డాడు. ఈ వైర విన్న తన పరిక్షలకీ పోయే ముందు వచ్చివుంటేతన పని ఏమయ్యేది?

    రూమ్ లో దిగాలుపడి కూర్చున్నాడు__ ఏమే చెయ్యటానికి పాలుపోక.

    అంతలో ఉష వచ్చింది, "ప్రొద్దున్నే వస్తానని యింతవరకూ వచ్చారు కాదెం?" అంటూ.

    అతనికి కొండంత ధైర్యం వచ్చినట్లయింది. "ఉషా! మా నాన్నకి సీరియస్ గా వుండట. నేను అర్జంటుగా బయల్దేరిపోవాలి. ఈ సారి ఓక్కడ్ని పోవాలంటే ఎందుకో భయంగా వుంది. నాతోపాటు నువ్వూ రావూ?" అన్నాడు ప్రాధేయపడుతూ.

    అంతా దిగుల్లోనూ ఉష పెదవులు చిరునవ్వుతో విప్పారినయ్! "నేనా? మీ యింటికి యిప్పుడేలా వచ్చేది ఎంతో పరాయిదాన్ని" అంది.

    అవునవును అనుకున్నాడు  సత్యమూర్తి. తన తెలివితక్కువ తనానికి అతనికి సిగ్గు కలిగింది.
 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS