Previous Page Next Page 
శ్రీశ్రీ మన సంగీతం పేజి 2


                                      శ్రీశ్రీ ! నా శ్రీశ్రీ !!

                                              అదృష్టదీపక్

    మా కవితాలక్ష్యాలను రగిలించిన శ్రీశ్రీ
    మానవతా దీపాలను వెలిగించిన శ్రీశ్రీ
    మహాకవీ వందనం! ప్రభారవీ వందనం!
    తెలుగుజాతి అందించే విప్లవాభివందనం!                                 || మహాకవీ ||
    
    శ్రీశ్రీ అంటేనే అది ఎగిరే ఎర్రని జెండా
    మండే రెండక్షరాల విప్లవాగ్ని ఎజెండా
    జనజీవన పోరాటం చిరునామా శ్రీశ్రీ
    ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదమే శ్రీశ్రీ                                     || మహాకవీ ||

    అరుదెంచే అరుణారుణ సమభావం ధ్యాసగా
    తరతరాల పీడనపై తిరుగుబాటు శ్వాసగా
    కష్టజీవికిరువైపుల నిలచినవాడా
    కర్మజీవికి కవితను మలచినవాడా                                         || మహాకవీ ||

    నీ మాటలు గురిచూసిన తుపాకులై పేలగా
    నీ పాటలు హోరెత్తిన తుపానులై రేగగా
    నవజీవన క్రాంతికై మరోప్రపంచశాంతికై
    సామ్యవేదనాదంతో సాగెను నీ ప్రస్థానం                                     || మహాకవీ ||

    (శ్రీశ్రీ సాహిత్యనిధి ప్రచురణ, శతజయంతి విశేష సంచిక 'శ్రీశ్రీ-100' ఏప్రిల్, 2010)

        తెల్లవాడు నిన్నునాడు భగత్సింగు అన్నాడు
        నల్లవాడు నువ్వునేడు నక్సలైటు వన్నాడు
        ఎల్లవారు నిన్ను రేపు వేగుజుక్క అంటారు
        అల్లూరికి వారసుడా! శ్రీశ్రీ కవిత్వ లాలసుడా!
           (తుది పయనం:తొలి విజయం..'సృజన' మాసపత్రిక, జూన్,1971)


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS