Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 2

 

    
    సి.    ఆజాను దీర్ఘబాహా చతుష్క మునందు
               శంఖచక్ర గదాసిశార్ జ్గ సమితి
        ధరియించి నీలాంబుదము చెంత విలసిల్లు
                సౌదామినీ లతా సన్నిభముగ
        వామాంకమున రమావనితశోభిల్ల ర
                త్నంచల జంబూన దాంబరంబు
        దీధితుల్ దేసలందుఁ దేజరిల్లఁగ వక్ర
               కుండలదీప్తులు గండయుగళిఁ

    గీ.    దాండవము సల్ప నవమణిస్థగి తమకుట
        చారుకేయూరహారమంజీర కౌస్తు
        భోజ్జ్వలప్రభ లెసగ సర్వోత్తముండు
        విష్ణుదేవుండు నా మది వెలయుఁగాక.
    
    సీ.    పక్షవిక్షేపణ ప్రభవ ఝుంఝూమారు    
                 తాలోల సకల కులాచలుండు
        చారుజాంబూనద శైలాగ్రపూర్ణిమా
                 హరిణలాంచన సన్ని భాననుండు
        తారకాపద నటత్సమయ రయభ్రామ్య
                 మాణ దివ్యవిమాన మండలుండు
        అమృతాపహృతి నిమిత్తాహవరంగని    
                  ర్గత బాహుశౌర్య దిక్బాలకుండు
    
    గీ.    అంబుజో దరవహన మహాక్షముండు
        వజ్రమయకాయుఁ డాశ్రితవత్సలుండు
        భుజగ భూషణుఁ డభిలైక పూజితుండు
        వైనతేయుం డొసంగు మద్వాంచితములు.
    
    సీ.    మనము గారామునఁ బెనిచినయట్టిచ
                 కోరికా శిశువు లాకొనక యండ
        మన గొజ్జఁగలతో ఁటమహి నిందుకాంతంపుఁ
                 బాదులలో నీళ్ళు పాయకుండ
        మానసరోజినిలోన మరగిన జక్కవ
                 దోయి నీ చనుదోయిఁ దొరయకుండ

    గీ.    నుండుఁగాని సదాశివుం డొడ్డినా ఁడు
        మొలక చందురు గెలువుమీ పలకననుచు
        నగజచెలు లాడుమాటల కలరుశివుఁడు
        మనలఁ గరుడావిధేయుఁడై మనుచుఁ గాత.
    
    సీ.    కాశ్యపగోత్రుఁడై ఘనత కెక్కినవాఁడు
               ధర లక్షయోజనంతరము వాఁడు
        గ్రహరాజు వర్తులాకార మండలుఁడును
                హేమదృష్టి కళింగభూమి విభుఁడు
        మాణిక్యకుండల మకుటహారములతో     
                 మేరు ప్రదక్షిణ మేలఁగువాఁడు
        సప్తాశ్వరధశంఖచక్రముల్ గలవాఁడు
                 రక్తవర్ణుఁడు సింహరాశివాఁడు

    
    గీ.    నంబుజాప్తుండు మఱియు ఛాయావిభుండు
        శమనకర్ణులఁ గన్నట్టిజనకుఁ  డనఁగ
        రాజగురుఁడైన సూర్యనారాయణుండు
        మనలఁ గరుణా విధేయుఁడై ,మనుచుఁగాత.

    సీ.    పెనుఁబాప పేరు వేసినగట్టివా, కుంభి
                దైత్యావరోధ వైధవ్యదాయి
        కడవన్నే బంగారు గట్టు నిల్తుఁడు భక్త
                 రక్షణ క్రీడాపరాయణుండు
        చిగురుఁగై దువుజోదుపగతుండు పార్వతీ
                వదనచకోర పార్వణ విదుండు
        చేఁదు పానంబు చేసిన మొక్క లీఁడు ద
                 క్షాద్వరధ్వంస దీక్షాధికారి

    గీ.    కలిమిగ లబేరికూరిమి చెలిమికాఁడు
        అంబునిది వెష్టి తోర్వి మహారధుండు
        బుడుత వెన్నెల పూమొగ్గముడుచు వేల్పు
        చిర కృపాదృష్టి మనల రక్షించుఁ గాత!
    
    సీ.    మొగము నెలనవ్వు మొలకరేయేండలు
                 గాయువాఁ డావులఁ గాయువాఁడు
        పశుపాలికల మోవి బంగాళి చెక్కెర    
                   గ్రోలువాఁ డొకపిల్లఁ గ్రోలువాఁడు
        తిరుమేన బంగారు జరబాబు దుప్పటి
                    గలుగువాఁడు తనంత గలుగువాఁడు
        అఖిలపావనమైన యడుగుఁ దామరతేనే
                     జాలువా    ఁ డెలమి యీఁజాలువాఁడు
    
    గీ.    శ్రవణము;లు వ్రేలు కర్ణి కారములవాఁడు
        తీర్చినట్టున్న ముక్కుముత్తియమువాఁడు
        కశుకు లీనెడునేద మానికంబువాఁడు
        మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత!

    సీ.    మూడు కన్నుల వేల్పు ముంజేతిక డియంబు
                   పఱుపు పచ్చడమునై యోఱపుమిగుల
        అక్కున విలసిల్లు చక్కని పూఁబోణి
                    యాలును మనుమరాలై తనర్ప
        బొడ్డుదామరఁ బుట్టి పొలుపారు బిడ్డఁడం                                

                    తటికిఁ దీర్పరియుఁ దాతయును గాఁక
        పులుఁగులగమికాడు పలుదేఱంగుల దాట
                       గుఱ్ఱంబు బంటునై కోమరు మిగుల
    
    గీ.     ప్రాఁత చదువులు వలకాలి పసిఁడియందె
        యనుఁగుఁ గూర్చుండు పలకయునగుచు మీఱ
        (నందముల కెల్ల యైననిన్ డెందమందుఁ)
        డెల్లమిగఁ జేర్తు,మోయన్న నల్లనన్న.
    
    సీ.    కందర్ప కోటీ సంకాశుండు నీ పతి
                  భువన మోహన కళాపూర్ణ వీవు
        పేదసాదులపాలి పెన్నిధి నీ స్వామి
                    భూమి వారల కన్నపూర్ణ వీవు    
        సర్వలోకములకు జనకుండు నీ నాదుఁ
                     డెల్ల జీవులకునుఁ దల్లి వీవు        
        ప్రాణుల కెల్లను బ్రాణంబు నీ భర్త
                      మగనికిఁ బ్రాణమౌ మగువ వీవు

    గీ.    ధరనృలోక గృహస్థులు దొరలు మీరు    
        మిమ్ము గొలిచినవారికి మేలు గలుగు
        అంగ యక్కణి చొక్క నాయకునిరాణి
        మధుర మీనాక్షి వినుత పద్మయతక్షి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS