Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 2


    రచ:1961. సెన్ సెన్  ప్రకారం హైదరాబాదు జనసంఖ్య 2, 92 , 12, 891. ఇందులో సగంమందికి పైగా  గ్రాడ్యుయేట్సు -ఉన్నత విద్యవంతులు. వీరిపేర్లు వేరయినా వీరి ఆర్ధిక పరిస్ధితులలో బేదం వున్నా వీరంతా  మధ్య తరగతికి చెందిన వ్యక్తులు. వీరంతా బుద్దిజీవులు కేవలం బుద్దితోనే బ్రతకటానికి ప్రయత్నిస్తే ఇందులో చాలామందిక ఆకలితో చచ్చివుండేవాళ్ళు. డిగ్రీని విద్యగా  అంగీకరిస్తే,  వీరంతా విద్యావంతులు చిన్నవాళ్ళను దూరం ఉంచుతారు కనుక వీరంతా పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళే ఈ విమల్- అమల్ - కమల్-
    [ముగ్గురూ స్టేజినుంచి బయటకు వెళ్ళిపోతారు. బంధవిముక్తి పోందినట్లు.]
    రచ: ఏవం ఇంద్రజిత్ !
    [ఇంద్రజిత్ ఉలిక్కిపడి రచయితకేసి చూస్తాడు. తర్వాత- అమల్ మొదలైనవాళ్ళు వెళ్ళినవైపుకే వెళ్ళిపోతాడు. అతని  చూపుల్లో బాధ, నడకలో అలసట కనిపిస్తుంది.]
    రచ: బహుశా, వీరి జీవితాల్లో - నాటకాలు - దొరకవచ్చును. చిన్న చిన్న  నాటకాలు- చిత్రమైన నాటకాలు- భవిష్యత్తులో ప్రతిభావంతుడైన నాటకీకారుడు. వీరి నాటకాలను రాయవచ్చు నేమో చెప్పలేము.
        [పిన్ని ప్రవేశం]
    పిన్ని:భోజానానికి వస్తావా ?రావా?
    రచ: రాను!
    [పిన్ని వెళ్ళిపోతుంది- మానసి ప్రవేశిస్తుంది]
    మా :రాశావా?
    రచ: లేదు.
        [మానసి వెళ్ళిపోతుంది]
    రచ: నేను ఎన్నో నాటకాలు  రాశాను. ఇంకా ఎన్నో రాస్తాను. కాని-సామాన్య మానవుని కష్ట-సుఖాలు నాకు తెలియవు. పోలాంలో - హలాన్ని పట్టే కష్టజీవుల గాధలు నాకు తెలియవు. పాములవాడు - పల్లె కారు- గిరిజనుడు- వీరేవర్నీ నేను ఎరుగను. నా చుట్టూ ఉన్నవాళ్ళలో నాకు కథలు దొరకడంలేదు. ప్రత్యేకత కన్పించదు. వీరిదగ్గర నాటకాలను ఇతివృత్తం దొరకదు. అమల్ - విమల్ - కమల్ - ఇంద్రజిత్.
    [స్టేజిమీద ఒక్కసారిగా చీకటి పరచుకొంటుంది.]
    నేనే అమల్-విమల్ -కమల్ - ఇంద్రజిత్ - అందరూ నేనే.
    [చీకట్లో గుసగుసలాడుతున్నట్టు స్వరం వినిపిస్తుంది.]
    కంఠస్వరం___
    అమల్ - విమల్ - కమల్ - ఏవం ఇంద్రజిత్-
    అమల్ - విమల్ - కమల్ -ఏవం ఇంద్రజిత్-
      విమల్ - కమల్ - ఏవం ఇంద్రజిత్-
          కమల్ - ఏవం ఇంద్రజిత్-
           ఏవం ఇంద్రజిత్-
             ఇంద్రజిత్-
             ఇంద్రజిత్-
              ఇంద్రజిత్-
    [వాద్యనాదాలతో-కంఠస్వరం కలసిపోతుంది. తీక్షణమైన వెలుతురు వస్తుంది. స్టేజినిండా -అందమైన నీడలు పడటం లేదు. స్టేజి ఖాళిగా  వుంటుంది. ఆకస్మాత్తుగా ప్రారంభం అయిన వాద్యనాదం. అంతే  ఆకస్మాత్తుగా  ఆగిపోతుంది. కాలేజీగంట వినిపిస్తుంది.]
    [ఇంద్రజిత్ ప్రవేశిస్తాడు. 35 సంవత్సరాల - ఆ యువకుడు మేకప్ లో వుండడు. పడకలో యువకత్వం కనిపిస్తుంది. ఆ వెనకే అమల్ ప్రవేశిస్తాడు. అతనిలో మాస్టారు ముఖంలో వుండే గాంభీర్యం ఉట్టిపడుతూ వుంటుంది. ఇప్పటినుంచి అమల్ - విమల్ - కమల్ -  కీలుబొమ్మల్లా నడుస్తారు. అవసరానికి అనుకూలంగా భావ భంగిమలు చూపిస్తారు.  అయినా యంత్రాలలా వుంటారు. నవ్వోస్తుంది. జాలిగూడా వేస్తుంది.]
    అమల్: రోల్ నంబర్ థర్టీ  ఫోన్ ?
    ఇంద్ర: యస్ - సర్ !
    అమల్:
        Every body continues in its state of rest or-of uniform mition in a stright line un less it is compelled by an  external  impressed force to chang that  state.
    (గంట మ్రోగుతుంది. ఆయల్ - నిష్ర్కమణ - ఇంద్రనిల్చొని వుంటాడు. విమల్ - ప్రవేసిస్తాడు.)
    విమల్: రోల్ నెంబరు థర్టీఫోర్!
    ఇం: యస్- సర్!
    విమల్__
    Poetry in general sence may for  defined to for the expresston of imaginatiaon.
    (గంట మ్రోగుతుంది. విమల్ నిష్ర్కమిస్తాడు. కమల్-ప్రవేశము)
    కమల్ : రోల్ నెంబరు థర్టీ ఫోర్.
    ఇంద్ర: యస్-సర్!
    కమల్: వ్యాసరచనకు ప్రధాన అంశాలు- తర్కం -భాష-భావ పరిపుష్టత- శృంఖలాబద్దమైన ఆలోచనలు- తత్త్వం- అథ్యం- మొదలైన భావ సమ్మేళనం.
    (గంట- కమల్ నిష్ర్కమణ)
    ఇంద్ర: తత్త్వం -తథ్యం - సమ్మేళన - తత్త్వం - తథ్యం- సమ్మేళన____
    Expression of imaginatiaon-
     Expression of imaginatiaon-
    State of rest or - of Uniform motion-
    State of rest or - of Uniform motion-
    State of rest or - of Uniform motion-
    (గల గల మంటూ - కమల్ - విమల్ - అమల్ ప్రవేశం)
    (ముగ్గురూ ఇంద్రను చుట్టివేస్తారు. ముగ్గురూ యీసారి నవయువకులుగా వుంటారు.)
    అమల్ : ఆటగాడే గాడా? రెండు  రన్సులో పోగానే ఆట గాడు గాకుండా పోతాడా?__
    విమల్: అంటే చాలా గొప్ప  ఆటగాడనా! నీ అభిప్రాయు! రెండో ఆటలోమాత్రం-ఏం-పొడిచేశాడేమిటి?-
    కమల్: క్రికెట్ ! Gold of dlorius uncertanity అవునా  ఇంద్ర!
    ఇంద్ర: తప్పకుండా?
    అమల్: అంటే- కౌశలం అనేది లేదంటావా? ఏం చెబుతున్నావయ్యా!
    ఇంద్ర: కాదని ఎవరన్నారు?
    విమల్ : ఏమన్నాఅను. పుట్ బాల్ మాత్రం ఎక్సయింటింగ్ గేం.
    ఇంద్ర: అదీ నిజమే!
    :కమల్: టెక్సాస్ మార్కు సినిమాకూడా- ఎక్సయింటింగ్ గానే వుంటుందిమరి. మంచి సినిమాలెందుకు చూస్తావ్?-


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS