Previous Page Next Page 
అందరూ మేధావులే  పేజి 2

    అందరూ మేధావులే!?!
                                                                           - కండ్లకుంట శరత్ చంద్ర             

పార్ట్ - 3

ధర్మవ్యాదుడు తన చేతిలోని రివాల్వర్ ను...కిరణ్ కు గురిపెట్టి, "బాబూ...రామశాస్త్రీ, వీళ్ళందరినీ కట్టెయ్యి...తాడు...డిక్కీలో ఉంది చూడు." అన్నాడు.
    శాస్త్రి...ముగ్గురి కాళ్ళూ, చేతులూ కట్టేసాడు. అది బొమ్మ తుపాకీ అని వారికి తెలియదు.
    "ఇక...నువ్వెళ్ళొచ్చు." అన్నాడు శాస్త్రితో.
    శాస్త్రి అతని వంక విచిత్రంగా చూసాడు.
    "ఊఁ...వెళ్ళు."
    "నేను వెళ్ళను. మీరు మా మిత్రులను...ఏం చెయ్యబోతున్నారు?" టెన్షన్ తో అడిగాడు శాస్త్రి.
    "నీ ఖర్మ...అయితే! ఉండు. నాపనికి అడ్డొచ్చావంటే...నిన్ను కీర్తిశేషుణ్ణి చేస్తాను." అనేసి, ధర్మవ్యాదుడు... తన జేబులో నుండి ఒక గుండుసూదిని తీసి రవి చేతిని పొడిచాడు.
    "ఆఁ..." రవి బాధగా మూలిగాడు.
    ఆ తర్వాత...కిరణ్ మోకాలిమీద, శేషు తొడమీద...గుండుసూదితో...వేగంగా...కసక్కుమని... రెండుపోట్లు పొడిచాడు.
    వాళ్ళు బాధతో...క్రిందపడిపోయారు.
    రక్తంతో...వాళ్ళ ప్యాంట్లు తడుస్తున్నాయి.
    "ఏయ్...ఏంటిది...మా వాళ్ళను ఏం చేస్తున్నావ్..." అరిచాడు శాస్త్రి.
    "రేయ్...నేను, నిన్ను ఏమీ చెయ్యడం లేదుగా! ఎందుకలా... అరుస్తున్నావ్? నోర్మూసుకో!" అని ధర్మవ్యాదుడు...మళ్ళీ రవి, కిరణ్, శేషుల వైపు తిరిగి, గుండుసూదితో... వాళ్ళ బుగ్గల మీద పొడిచాడు.
    రక్తం...సర్రున కారి...వాళ్ళ చొక్కాలు తడిసిపోయాయి.
    "ఒరేయ్...దొంగనాకొడకా...ఎవడురా నువ్వు...ఎందుకిలా చేస్తున్నావ్?" బాధతో అరుస్తూ...తిట్టాడు శేషు.
    "ఒరేయ్...వీడెవడో సాడిస్టుగాడిలాగున్నాడు." అన్నాడు రవి, ఏడుస్తూ.
     "ఒరేయ్...ఈయనను తిట్టకండిరా...మనల్ని ఇంకా హింసిస్తాడు." బాధను అణుచుకుంటూ చెప్పాడు కిరణ్.  
    శాస్త్రి...ముందుకు రాబోతుంటే...ధర్మవ్యాదుడు శాస్త్రి గొంతుకు రివాల్వర్ ను ఆనించి...వాళ్ళముగ్గురినీ చూస్తూ చెప్పాడు. "ఏరా...చిన్నగుండుసూదితో...రెండే...రెండు పోట్లుపొడిచితే...గిలగిలా తన్నుకుంటున్నారు. మరి...రెస్టారెంట్లో...మటన్ తింటూ...నాన్ వెజిటేరియన్ గురించి ఏదో లెక్చర్లిచ్చారు. ఏం...కోడినో, మేకనో...కోస్తున్నప్పుడు.... దానికి బాధగా ఉండదా?"
    "మా మతగ్రంధంలో తినమనే ఉంది." అన్నాడు రవి.
    "ఆంత్రోపాలజీ చదువు నాయనా! అలా ఎందుకుందో తెలుస్తుంది. మీ మతం, సముద్రతీరంలో పుట్టింది. అక్కడ, మూడు నెలలు మాత్రమే పంటలు పండుతాయి. మిగిలిన కాలమంతా...భూమి...మంచుతో కప్పబడి ఉంటుంది. మరి, ఆ ప్రాంతంవారు, ఏం తినాలి? సముద్రంలో దొరికే...చేపలు. కొన్నిమతాలు ఎడారి ప్రాంతంలో పుట్టాయి. అక్కడ ఖర్జూరపళ్ళు తప్ప ఏమీ దొరకవు. ఒంటెలు, గొర్రెలు, ఆవులు...ఏవి దొరికితే అవి తింటారు. తినాలి కదా...మరి బ్రతకడానికి!! ధ్రువప్రాంతాలలో ఉన్నవారిని...సీల్ చేపలనూ, వాల్ రస్ లనూ తినకుండా...ఏ మతాలు ఆపగలవు? తప్పదు...వారు అవే తినాలి. మనదేశపు భౌగోళిక పరిస్థితి అలా లేదు. అందుకే...ఇక్కడ పుట్టిన బౌద్ధ, జైన మతాలు...మాంసారాన్ని నిరసించాయి. అసలు...మనం, మతాల గురించి ఎందుకు మాట్లాడాలిరా ఇప్పుడు...! పాలకూర, గోంగూర, బెండ, దొండ, పొట్ల, బీర ,చిక్కుడు, కాకర, వంకాయ... ఇన్ని ఉండగా...కోళ్ళూ, మేకల గొంతులు కొయ్యాలా?! అయినా, మీతో మాటలేమిట్రా! హింస...అంటే ఎలా ఉంటుందో చూడండి." అంటూ సూదితో, వాళ్ళ మొహాలూ, వీపులూ, కడుపు, కాళ్ళూ...ఎక్కడపడితే అక్కడ తూట్లు పొడవసాగాడు.
    శాస్త్రికి అతడు చెప్పిందంతా విని...దిమ్మతిరిగిపోయింది.
    మాటలు చూస్తే...తార్కికంగా ఉన్నాయి...చేతలు మాత్రం వికృతంగా ఉన్నాయి.
    ధర్మవ్యాదుడు అక్కణ్ణించి కదిలాడు.
    ముగ్గురూ...గిలగిలా తన్నుకుంటున్నారు.
    "దొంగల...కొ...డు...కు..! సాడిస్టుముం...డా...కొ...డు...కు..." శేషు గిలగిలా తన్నుకుంటూనే తిట్టాడు.
        *    *    *
    సమయం...రాత్రి పన్నెండయ్యింది. సగం నగరం...నిద్రలో ఉంది!!   
    నెక్లెస్ రోడ్ లో ఒక బైక్ ఆగింది.
    కార్తీక్, స్వప్న...బైక్ దిగారు. మసకమసక చీకటి...!
    ఇద్దరూ...ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని...అడుగులో అడుగువేసుకుంటూ నెమ్మదిగా నడవసాగారు.
    "మళ్ళీ నన్ను...హాస్టల్ దగ్గర ఎప్పుడు దింపేస్తావ్?" అడిగింది స్వప్న.
    "హేయ్...వచ్చింది ఇప్పుడే కదా...అప్పుడే వెళ్ళిపోయే టైమ్ గురించి ఆలోచిస్తున్నావా?" అన్నాడు కార్తీక్.
    "జస్ట్...క్యాజువల్ గా అడిగాను..." అంది, అతని భుజం మీద తలవాలుస్తూ.
    ఇద్దరూ మరో పది అడుగులు వేసాక...అక్కడ ఉన్న ఓ పొదచాటుకు వెళ్ళి కూర్చున్నారు.
    కార్తీక్...స్వప్న పెదవులను, తన పెదవులతో అందుకుని చప్పరించాడు.
    ఆమె తియ్యగా మూలుగుతూ...కళ్ళు మూసుకుంది.
    ఆ తర్వాత...అతని చేతులు...ఆమె వొంటిని తమకంతో తడిమాయి.
    ఆమె...మెలికలు తిరిగి...గడ్డిలో పడుకుంది.
    అతడు, ఆమె మీదికి వంగి...మెడ ప్రక్కన...కంఠం మీద నాలుకతో రాసాడు.
    "ఎక్స్ క్యూజ్ మీ..." ఒక మగాడి కంఠం వినిపించింది.
    కార్తీక్, స్వప్న ఉలిక్కిపడి, ఈ లోకంలోనికి వచ్చారు.
    వాళ్ళ వెనక...యాభైఏళ్ళ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
    "ఏయ్...ఎవరు నువ్వు?" అడిగాడు కార్తీక్.
    "ఛ...పట్టుమని రెండు పదులు నిండలేదు. చదువుకునే...వయసులో...నీకు రొమాన్సు కావాల్సివచ్చిందిరా.... అదీ...రాత్రిపూట పొదల చాటున..."
    "ఏయ్...ఎవర్రా నువ్వసలు? నోర్మూసుకుని పో. ఇది మా ప్రైవేటు పని. ఇప్పుడు...హైదరాబాద్ లో ఇదంతా... కామన్. పో...పోపో..."అన్నాడు కార్తీక్ విసుగ్గా.
    "హేయ్! నువ్వు చేస్తున్నది తప్పు." అన్నాడు ఆ వ్యక్తి.
    "మేమిద్దరం లవ్వర్స్. పో...పోపో..." కసిరాడు కార్తీక్.
    "అయితే మాత్రం...ఇలానా..."
    "ఎహే...పోతావా లేదా..." ఏవేవో చెయ్యాలని ఉబలాటంగా వచ్చిన కార్తీక్ కు, ఆ వ్యక్తి వాలకం పిచ్చికోపాన్ని తెప్పిస్తోంది.
    "చూడు బాబూ! నా కూతురిని...ఇలా వదిలివెళ్ళడం...నాకు ఇష్టం లేదు." కార్తీక్ అదిరిపడ్డాడు. "కు...కూతురా!!"
    ఆ వ్యక్తి, స్వప్న తండ్రి అని తెలియగానే...కార్తీక్ చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆమె, ఆశ్చర్యంగా చూస్తూ, "నేను...నీ కూతురినా?" అంది...కోపంగా.
    "అవును."
    "ఏయ్...పిచ్చిపిచ్చిగా ఉందా! కార్తీక్...వీడెవడో నాకు తెలీదు." మొదటివాక్యాన్ని ఆ వ్యక్తితోనూ...రెండవ వాక్యాన్ని కార్తీక్ తోనూ అంది.
    "చూడమ్మా! ఎంత ప్రేమలో పడితే మాత్రం, ఇలా...కన్నతండ్రిని...తిట్టడం...బాగాలేదు. పదమ్మా..." అన్నాడు.
    "అయ్యో...ఎవర్రా నువ్వు? ఎందుకు మమ్మల్ని చంపుకుతింటున్నావ్...ఏదో సరదాగా ఎంజాయ్ చెయ్యాలని వస్తే...ఇలా దాపురించావేంట్రా?" అంది.
    "తండ్రిని అలా ఏకవచనంలో పిలవమని...నీకు ఏ గాడిదకొడుకు చెప్పాడు?" అన్నాడు ఆ వ్యక్తి, సీరియస్ గా. 
    ఆమె, కార్తీక్ ను పట్టుకుని చెప్పింది. "కార్తీక్...నిజంగా వీడెవడో నాకు తెలీదు. వీడు...మా నాన్నకాదు. మా నాన్న బాపట్లలో ఉన్నాడని తెల్సుగా!"
    కార్తీక్, ఆ వ్యక్తి వంక కోపంగా, అనుమానంగా చూసాడు.
    "ఈరోజే...బాపట నుండి వచ్చానమ్మా. నీకు ఇష్టం అని...జీడిపప్పు కూడా తెచ్చాను." అన్నాడు ఆ వ్యక్తి.
    బాపట్ల, చీరాల చుట్టుప్రక్కల ప్రాంతాలలో...జీడిపప్పు బాగా దొరుకుతుందని...స్వప్న, కార్తీక్ కు చాలాసార్లు చెప్పింది.
    "కార్తీక్! వీడు ఎవడోగానీ...అబద్దాలు చెపుతున్నాడు." అంది.
    కార్తీక్, ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని, "ఏయ్...నోర్మూసుకుని పోతావా? ట్యాంక్ బండ్ లో...ముంచమంటావా?" అన్నాడు.
    "నా కూతురిని నాతో పంపు...వెళ్ళిపోతా..."
    "మళ్ళీ అదే కూత!"
    "చివరిపదంలో...చివరి అక్షరానికి కొమ్ము ఇచ్చి...దానిప్రక్కన రు...అనే అక్షరం రాస్తే...వచ్చేది కావాలి."
    కార్తీక్ కు, అతడేమి చెప్పాడో అర్ధం కాలేదు.
    స్వప్నకు అర్ధమయ్యింది. కార్తీక్ అన్న వాక్యంలో... చివరి పదం...కూత!
    కార్తీక్, అతణ్ణి వదిలేసి, "పద స్వప్న...పోదాం." అన్నాడు.
    ఇద్దరు...వేగంగా...బైకు దగ్గరికి నడిచారు.
    బైకు టైరు...ఎవరో విప్పేసారు!!
    "బాక్ టైరు...!" అరిచాడు కార్తీక్. మిస్సయిన వెనకటైరు భాగాన్ని చూస్తూ.
    స్వప్న...ఆందోళనగా అటూ ఇటూ చూసింది.
    ఆ వ్యక్తి...తమవైపే వస్తూ...మరో పొద దగ్గరున్న టైరును చేతిలోనికి తీసుకుని...ఆమెకు చూపించాడు.
    ఆమె, కార్తీక్ ను గిల్లి...ఆ వ్యక్తి వైపు చూడమని చెప్పింది.
    ఆ వ్యక్తి...టైరును...కొరుకుతున్నాడు. ఐతే...పటిష్టమైన రబ్బరు కాబట్టి...చిన్నముక్క కూడా...ఊడిరాలేదు.
    "నేనే...టైరు విప్పాను. హ్హిహ్హిహ్హి...నువ్వెలాగూ నా కూతురిని నాతో పంపవని, నాకు తెలుసు." ఆ వ్యక్తి వెకిలిగా నవ్వుతున్నాడు.
    కార్తీక్ కు పట్టరాని కోపం వచ్చింది. వేగంగా...ఆ వ్యక్తి వైపు కదిలాడు.
    ఆ వ్యక్తి...అంతకంటే వేగంగా...టైరును హుసేన్ సాగర్ లో విసిరేసాడు.
    కార్తీక్ కు...ఏడుపు, కోపం, ఆవేశం...ఒకేసారి తన్నుకొచ్చాయి.
    "దొంగనా..." అరుస్తూ...ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేసి, కడుపులో గుద్దబోయాడు. ఆ వ్యక్తి...ఆ దెబ్బను తప్పించుకుని...పిడికిలి బిగించి, కార్తీక్ మొహంమీద...గుద్దాడు.
    ఆ దెబ్బకు...కార్తీక్ కు కళ్ళు బయర్లు కమ్మాయి.
    ఆ వ్యక్తి మరో దెబ్బకొట్టాడు. కార్తీక్ క్రింద పడిపోయాడు.
    ఆ వ్యక్తి...గబగబా...కార్తీక్ చొక్కా, ప్యాంటు విప్పి...తన భుజంమీద వేసుకుని...వెనక్కి తిరిగాడు.
    వెనక...పదడుగుల దూరంలో...ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు.
        *    *    *
    సమయం...రాత్రి పన్నెండున్నర!
    "వ్వాట్?!" దాదాపుగా అరిచినట్లుగా అడిగాడు జ్ఞానచంద్ర.
    "అవును." అన్నాడు అతని హాస్పటల్ లో పనిచేసే...సైకియాట్రిస్టు రాఘవేంద్ర.
    "కానీ...అలా చెయ్యడం మంచిది కాదు. మనవాళ్ళనే...మనం బంధించడం అంత మంచిది కాదేమో?"
    "తప్పదు సార్! నిజానికి...మీరు చేసిన ఫోన్...కమీషనర్ ఎత్తకపోవడమే మంచిదయ్యింది. ఒకవేళ... ఎత్తుంటే... ఈపాటికి మీడియాకు తెలిసి అల్లకల్లోలం అయ్యుండేది. ముందు...నేను చెప్పినట్లు చెయ్యనివ్వంది. లేదంటే...చిక్కుల్లో పడతాం."
    "పడతామేమిటయ్యా...ఆల్ రెడీ పడ్డాం!" జ్ఞానచంద్ర మొహం...పది లంఖణాలు చేసిన వాడిలా ఉంది.
    "మరింత చిక్కుల్లో పడకుండా...జాగ్రత్తపడదాం."
    జ్ఞానచంద్ర...రెండు నిమిషాలు ఆలోచించి, "సరే!" అన్నాడు.
    ఆ తర్వాత...ఇద్దరూ...ఆ గదిలో నుండి...మరో గదిలోనికి నడిచారు. అక్కడ...నలుగురు వార్డ్ బాయ్స్ కూర్చునివున్నారు.
    సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోవాల్సినవారు...ఆ రోజు జరిగిన సంఘటనతో...వాడిపోయిన మొహాలతో... కూర్చుని వున్నారు.     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS