Previous Page Next Page 

జీవాత్మ పేజి 3


    కంటికి కనిపించే భౌతిక శరీరంలో రోగం బయట పడకముందే, ఆ వ్యాధిని జీవధాతు శరీరంలో చూడగలమని దివ్యజ్ఞానంతో చూడగలిగి నప్పుడే తెలుస్తుంది. అటువంటి దివ్యజ్ఞానం లేనివారు ఆ అనారోగ్యం సోకినా భాగంలో గల లోపలి కాంతిమండలాన్ని 'స్కాన్' చేసి, లేదా గ్రహించి అది సాధారణంగా వుండే పరిణామం కంటే తక్కువగా వుందో, లేక ఎక్కువగా వుందో తెలుసుకోవచ్చు.
    
    ఉదాహరణకు, ఒక వ్యక్తికి దగ్గు, పడిశం వచ్చే ముందే, అతని జీవధాతు శరీరంలోని గొంతు, ఊపిరితిత్తులలో గల ప్రాణశక్తి క్షీణిస్తుంది.
    
    దివ్యదృష్టి ద్వారా ఇది బూడిదరంగులో వున్నట్లు చూడగలరు. ఈ ప్రాంతాలను 'స్కాన్' చేసినప్పుడు అక్కడ లోపలి కాంతిమండలంలో గుంటలు పడినట్లుగా గమనించగలరు.
    
    ఇంకొక ఉదాహరణ : కామెర్ల వ్యాధి సోకబోయే వ్యక్తి యొక్క సోలార్ ప్లక్లెస్, కాలేయాలు బూడిదరంగులో వున్నట్లు దివ్యజ్ఞానంతో ముందుగానే తెలుసుకోవచ్చు. శారీరక పరీక్షలు, ఆరోగ్య నిర్ధారణ పరీక్షలలో రోగి ఆరోగ్యవంతంగా, మామూలుగానే వున్నట్లు తెలుస్తుంది.
    
    కానీ ఆ రోగికి చికిత్స చేయకపోతే, త్వరలోనే ఈ కామెర్ల వ్యాధి భౌతిక శరీరంలో కన్పించి తీరుతుంది.
    
    తలనొప్పితో బాధపడే రోగికి, అనాసిన్, ఆస్ప్రిన్, అనాల్జిన్, పారా సిటమాల్ లాంటి అల్లోపతి మందులేవీ లేకుండానే శ్రావ్యమైన సంగీతం వినిపించడం ద్వారా అతని బాధని పోగొట్టొచ్చని చెప్పేందుకు మ్యూజిక్ ఫర్ హెల్త్ లాంటి ఆడియో క్యాసెట్స్ ఈరోజు మార్కెట్లోకి వస్తున్నాయి.
    
    శారీరకంగా ఏ రకమైన ట్రీట్ మెంట్ లేకుండానే తలనొప్పి ఎలా మాయమైపోతోంది? శ్రావ్యమైన సంగీతం మందులా
.ఎలా వుపయోగపడుతోంది..."
    
    మనసుకు విశ్రాంతి కల్పిస్తే అది శారీరక అనారోగ్యాన్ని బాగు చేయటం అన్నది కొత్త విషయమేమీ కాదు. ఇది అందరికీ తెలిసినా, కోట్లు పెట్టి మందుల కంపెనీలు ప్రారంభించే బడా పారిశ్రామిక వేత్తలు, లక్షలు పెట్టి అల్లోపతి వైద్యం నేర్చుకునే నేటి సోకాల్డ్ డాక్టర్స్ వలయంలోంచి ప్రజలు బయటికి రాలేకపోవడం దురదృష్టకరమైన విషయం.
    
    మనసును ఆనందకరంగా వుంచుకోగలిగితే తొంభైశాతం శారీరక రుగ్మతలు దూరమైపోతాయని ఋషుల కాలంనాదే రుజువు చేయబడింది.
    
    అయినా మనం అవేమీ పట్టించుకోం-
    
    ఎందుకంటే నిన్నటిరోజు చెల్లని చెక్కు కదా!
    
    మనకెంతసేపు వర్తమానం, ఈ రోజు గడిస్తే చాలు అన్న ధోరణే...
    
    నిజానికి మనిషి శరీరమే ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ ఏ యంత్రం విరిగిపోయిన, అరిగిపోయిన, తన భాగాలను తనే బాగు చేసుకోలేదు.
    
    కానీ మనిషి శరీరం, జంతు క్రిమికీటకాదుల శరీరాలు, పక్షులు, పచ్చటి చెట్లు, పూలమొక్కలు వాటికవే వాటి జబ్బల్ని నయం చేసుకోగలవు. పీల్చుకునే ప్రాణశక్తి ద్వారా, జీవనాధారా శక్తి ద్వారా తాగే నీటి ద్వారా, తీసుకునే ఆహారం ద్వారా శరీరం తన భాగాన్ని తనే బాగుచేసుకోగలదు.
    
    మనిషి శరీరం ఓ అద్భుతమైనది....
    
    మనకు తెలియకుండానే, మనసుకు చెప్పకుండానే ఎన్నోసార్లు చిన్న చిన్న జబ్బులను తనే నయం చేసేసుకుంటుంది.
    
    మనిషి ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ, అతనికి ప్రాణధార శక్తులు గురించి ఏ మాత్రం తెలియదు. అందుకే తాను అంటే ఈ భౌతిక శరీరమే అన్న భ్రమలో పడిపోయి, తాను కూడా ఒక పదార్ధమేనని నమ్ముతూ వుంటాడు.
    
    మనందరికీ సహజమైన చికిత్స గురించి తెలుసు. మనకు తెలియనిదల్లా సహజాతీతమైన చికిత్సే....
    
    సహజాతీతమైన చికిత్స గురించి అపారమైన శోధన చేసిన డాక్టర్ చోవాకోక్ సుయ్ ఈ రోజు ప్రపంచానికంతటికి అరాధ్యదైవం అయిపోయాడు.
    
    అతనికి ప్రపంచ ప్రజ ఎంతో కొంత రుణపడి వుందనటంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. మన ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల నుంచి, ధ్యానం నుంచే డాక్టర్ చోవాకోక్ సుయ్ ఎంతో నేర్చుకోవడం జరిగింది.
    
    మనిషి ఆరోగ్యాన్ని శాసించే పదకొండు ప్రధాన చక్రాలపై పాజిటివ్ గా జీవశక్తిని కేంద్రీకరిస్తే అనారోగ్యం అనేదే వుండదని మన పూర్వీకులు ఎప్పుడో రుజువు చేశారు అలా రుజువు చేసే రుషులు, దివ్యపురుషులు, అఘోరీలు ఎంతోమంది హిమాలయ పర్వతాలలో ఇప్పటికీ వున్నారు.
    
    వీరు మనిషి శరీరంలో నిక్షిప్తమై వున్న పదకొండు ప్రాణహిత చక్రాల్ని ఆజ్ఞాపించటం ద్వారా స్వస్థత చేకూరుస్తారు.
    
    ధ్యానాన్ని చెడు దిశకేసి మరలించే క్షుద్రులు ఈ పదకొండు ప్రాణహిత చక్రాల్నే హింసిస్తూ మనుషుల్ని అనారోగ్యానికి గురిచేస్తారు.
    
    మూలాధారచక్రం, స్వాధిష్టాన చక్రం, మెంగ్ మెయిన్, మణిపూరక చక్రం, ప్లీహచక్రం, సోలార్ ప్లక్సెస్, ముందు - హృదయచక్రం, వెనక హృదయ చక్రం, నిశుద్ద చక్రం, అజ్ఞాన చక్రం, ఫాలచక్రం, సహస్రార చక్రం.
    
    వీటిని అధీనంలో ఉంచుకునే వ్యక్తి అనారోగ్యానికి గురికావటం జరగదు.
    
    ఎన్నో వందల సంవత్సరాలు జీవించే దేవదారు వృక్షాలు (ఇప్పుడని హిమాలయాలలో మాత్రమే వున్నాయి) ఎంతో ఆరోగ్యకరమైనవిగా గుర్తించబడ్డాయి. ఈ చెట్లు అధికంగా తమలో వున్న ప్రాణశక్తిని చాలా ఎక్కువ పరిమాణంలో బయటకు వెదజల్లుతూ వుంటాయి. అలసట చెందినవారు, లేదా అనారోగ్యానికి గురయినవారు ఈ చెట్ల కింద విశ్రాంతి తీఉస్కున్నా పడుకున్నా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు.
    
    పూర్వకాలంలో రుషులు. మనీశ్వరులు ఈ తరహా చెట్లకిందే కూర్చుని ధ్యానం చేసుకునేవాళ్ళు. ఆధ్యాత్మిక సాధకుడికి ప్రాణశక్తీని బయటకి వదిలే ఈ చెట్లే బంధువులు.
    
    షిరిడి సాయిబాబా వేపచెట్టుకింద కూర్చొని ధ్యానం చేసుకునేవారట. అయినా మనం చెట్లను బ్రతకనివ్వం - అవి కాలి బూడిదయ్యే వరకు, మనకు వుపయోగపడేవరకు.

 Previous Page Next Page