Previous Page Next Page 

మెయిడ్ ఇన్ ఇండియా పేజి 3

 

    "ఏమిటోయ్ మాట్టడావు......నేను చెప్పింది నిజమేనా?"
    అది ఆ లాజిక్కో, గిమ్మిక్కో , సైన్సో అవునో కాదో అర్ధం కాకపోయినా తన మనసులో పడ్డ అనుమాన బీజంతో అవును అన్నట్టు తల ఊపాడు సురేష్.
    'ఇండియన్స్ లో వున్న పెద్ద సెంటిమెంట్ ఇదేనోయ్....భార్యపై గొప్ప ప్రేమ వున్నట్టు ఒలకపోస్తుంటారు, కానీ అది స్వార్ధ పూరితమయిన ప్రేమ.....దాని వెనుక కరుడు కట్టిన స్వార్ధం వుంది....శారీరక అవసరాలు తీర్చడానికి ఒక ఆడది కావాలి.....తన పనులు చేసి పెట్టడానికి ఒక ఆడది కావాలి.....కష్టపడకుండా తనకు తిండి, బట్టలు ఇతరత్రా అన్నింటా అడుగులకు మడుగులు వత్తడానికి ఒక దాసీ అవసరం కాబట్టి......పెళ్ళి అనే బంధంతో ఆడదానిని కట్టు బానిసగా చేసుకుని తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు మగవాడు. ఇది ఏమీ గ్రహించలేని అమాయకురాలు కాబట్టి భర్తే సర్వస్వం అనుకుని అతనిని నమ్మి మోసపోతుంది ఆడది......కేవలం సెక్స్ అవసరానికే మగవాడికి ఆడది కావాలి!.. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం!...."
    ఆమె ధోరణి అతనికి అంతుపట్టలేదు. ఆమె చెప్పిన అడ్రస్ రావడంతో టాక్సీని ఆపాడు సురేష్.
    "ఎక్స్ క్యూజ్ మీ మేడమ్ .....మీ....మ్మ......ల్ని ....మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా?"
    'వైనాట్," అంటూ భుజాలు ఎగురవేసింది.
    "మీరు ఏం పనిమీద బొంబాయి వచ్చారో తెలుసుకోవచ్చా?"
    "సెక్స్ మీద రిసెర్చ్ చేయడానికి....." అని వంద రూపాయాల నోటు అందించి చిల్లర తీసుకోకుండానే టాక్సీ దిగి వెళ్ళిపోయిందామే.
    "ఓరి నాయనోయ్ ఇది ఏదో కామపిశాచిలా వుంది.....సెక్స్ మీద రిసెర్చి చేయడానికి లండన్ నుంచి ఇండియాకు రావడమేమిటి?" అనుకుంటూ టాక్సీని రివర్స్ చేసుకుని కంగారుగా వెళ్ళిపోయాడతను.......
    సరిగ్గా ఇదే సమయానికి మరొక టాక్సీలో అక్కడే దిగిన భారత మహిళ తనకు కావాల్సిన చిరునామా కోసం వెదుకుతున్నది.


                                                   *    *    *    *

    "బ్యూటీ క్వీన్......"
    నగరంలో పేరుకున్న అత్యంత ఖరీదయిన బ్యూటీపార్లర్ అది....
    తనకు కావాల్సిన బ్యూటీ పార్లర్ అదేనని ఒకసారి బోర్డు వైపు చూసి అద్దాల తలుపులను నెట్టుకుని లోనికి వెళ్ళింది విదీశీ వనిత.
    మెత్తని కుషన్ చైయిర్ లో కూర్చుని తమ అందాలకు మెరుగులు దిద్దుకుంటున్న నలుగురైదుగురు అందగత్తెల చూపులు ఒక్కసారిగా ఆమె మీద పడ్డాయి.
    వయ్యారంగా నడిచి వస్తున్న విదేశీ వనితని చూసి వాళ్ళు అసూయ చెందారు.
    "వెల్ కమ్ మేడమ్ ......' అంటూ ఆహ్వానించింది బ్యుటేషియన్.
    హంస గమనలా వచ్చి ఖాళీగా వున్న కుషన్ చైర్ లో కూర్చుంది.
    వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడమ్......."
    "ఈ నగరంలో మీ బ్యూటీ పార్లర్ కు ఉన్న నేమ్ అండ్ ఫేమ్ తెలుసుకుని వచ్చాను. నా హెయిర్ కు బ్లాక్ డై చేయండి.....' అన్నది .
    "వాట్......" నివ్వేరపోతూనే అనేసిందామే.!
    "ఎస్......నా బ్రౌన్ హెయిర్ ను బ్లాక్ కలర్ లోకి మార్చాలి........'
    'మేడమ్ ...మా ఇండియన్స్ కావాలనే తమ హేయిర్స్ కు బ్రౌన్ టచ్ చేసుకోడానికి ఇప్పుడు తాపత్రయపడుతున్నారు. ఒక విధంగా ఇక్కడ బ్రౌన్ హెయిర్ స్టయిల్ నడుస్తుంది, మరి మీరేమో.......' అంటూ అర్ధంతరంగా ఆపేస్తూ ఆమె వేపు చూసింది.
    'ఆఫ్ కోర్స్......ఎవరి అభిరుచులు వాళ్ళవి....నాకు కావలసింది బ్లాక్ హెయిర్ డై......అసలు సిసలయిన భారతీయ స్త్రీ ఎలా వుంటుందో అలా వుండాలి నేను . కట్టూ, బొట్టూ దగ్గర నుంచీ నాలో ప్రతిదీ ఇండియన్ కల్చర్ ప్రతిబింబిస్తూ వుండాలి. మీరు అలా మేకప్ చేయగలరా? లేదా? సే ఎస్ ఆర్ నో....ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు." ఆమె గొంతు స్థిరంగా పలికింది.
    ఆమె పట్టుదలకు క్షణం ఆశ్చర్యపోయినా మరలా తనలో తానే సమర్ధించుకుంది. పాశ్చత్తులు భారతీయ సంస్కృతీకి ఆకర్షితులై అలా తయారు కావాలనుకోవడం కొత్తేమీ కాదు........
    ఆమె వుద్దేశ్యం ఏదయినా తనకు తన బిజినెస్ ముఖ్యం కాబట్టి తల వూపింది.
    "ఐయామ్ ఎట్ యువర్ సర్విస్ మేడమ్' అందామె మరింత ఆప్యాయంగా.
    తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఆ విదీశీ వనితను అసలు సిసలయిన భారత మహిళగా తీర్చిదిద్దడంలో మునిగిపోయింది బ్యూటీషియన్.
    "మిస్.....ఇఫ్ యూ డోంట్ మైండ్........మే ఐనో యువర్ స్వీట్ నేమ్?"
    "వాట్ ........నా పేరు భారతి' అంది చిరునవ్వుతో.
    "నో..........నో........మేడమ్! అలాంటిదేమీ లేదు. మీ పేరు ఏమిటో తెలుసుకుందామని అడిగాను.'
    "దెన్ వాట్........బిల్ ఎంతయింది?"
    బ్యూటీషియన్ ఎంతయిందో చెప్పకముందే వానిటీ బాగ్ తెరచి రెండు ఐదు వందల రూపాయల నోట్లు అందించి , వెనుదిరిగింది భారతి.
    "మిస్ భారతి.......మీకు ఇంకా చేంజ్ వస్తుంది."
    "కీపిట్......'
    భారతి లయబద్దంగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది.
    ఆమె వెళ్ళిన ఐదు నిమిషాల తరువాత -----

 Previous Page Next Page