Previous Page Next Page 

పాదాభివందనం పేజి 2

మనసు మారిపోతున్నప్పుడు మనిషిని పిలిచే పద్దతి మరిపోతుంది కాబోలు.

సూట్ కేసు జారిపడింది.

"రాలేవా? నాకు తెలుసు, రాజా, నీవు రాలేవని. "అలాగే గోడకు చేరగిలబడింది.

"క్షణికవ్యామోహం ఎంతపని చేస్తుంది! ఇద్దరి జీవితాల్లో నిప్పులు చెరిగింది. ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి. ఒక్క సంగతి జ్ఞప్తికి ఉంచుకో రాజా! ఆడది సుఖంగా అనుభవించి అవతల పారవేసే వస్తువు కాదు. నీవు నాకు ఇహమూ, పరమూ లేకుండా చేశావు.

పరమూపోతే పోయింది. ఇహమైనా దక్కించుకుందామనుకుంటే అది దూరం చేస్తున్నావు. నిన్నని లాభం లేదు రాజా! ఒక విధంగా మేలే చేస్తున్నావు. తప్పు చేశామని తెలిసి ప్రాణం పై తీపితో మళ్లీ మళ్లీ తప్పు చేస్తూనే బ్రతకాలనుకోవటం అవివేకం. ఆ పని చేయకుండా కాపాడుతున్నావు. ఇకపరమునే వెతుక్కుంటాను వెళ్ళు బాబూ, వెళ్ళు"

నిశ్శబ్దంగా బయటికి నడిచి వెళ్ళాడు. వెళ్ళేప్పుడు ఆమె వైపు చూద్దామనుకున్నాడు. దైర్యం చాల్లేదు.

ఓ గంట గడిచింది. ఏం నిశ్చయానికి వచ్చిందో లైటార్పి వేసింది. కట్టుకున్న చీరమార్చి నగలన్నీ తీసివేసింది. పిల్లలను ఓ మారు గట్టిగా ముద్దు పెట్టుకుంది. చంటిది కన్నీళ్ళు చెక్కిలి పై పడితే అటూ ఇటూ కదిలి చెంపలు తుడుచుకుంది. పిల్లవాడు మూల్గి అటు తిరిగి పడుకున్నాడు. దుఃఖంలో గొంతులోంచి సన్నగా జీవం వస్తున్నది. అక్కడే ఉన్న పంచెతో తుడిచి తిరిగి అక్కడే తగిలించి, కడసారిగా నమస్కరించి బయటికి నడిచింది.

తలుపు తాళం వేసి, తాళం చెవి తలుపు దగ్గరగా లోపల వేసి బయల్దేరింది. నిండుగా చెంగు కప్పుకోంది. ఎక్కడో పదకొండు కొట్టారు.

అమావాస్య చీకటి! చక చక నడుస్తూ పోతూ ఉంది. కార్నర్ వద్ద రిక్షా వాళ్ళు ఎగాదిగా చూశారు. ఏదో గొణుక్కున్నారు. తుంగభద్ర వైపు వెళ్ళుతూ ఉంటే దేవాలయం వద్ద పడుకున్న ముసలిది చూసి "ఎవరూ" అని గొణిగి మళ్ళీ ఒరిగింది.

అటూ ఇటూ చూచింది. ఎవరూ లేరు. అలా తేరిపార చూస్తే ఫర్లాంగు దూరంలో ఎవరో వ్యక్తి మెల్లమెల్లగా గులకరాళ్ళు ఏట్లోకి విసురుతున్నట్లు ఉంది. నిశ్శబ్దంలో అవి బుడక్ బుడక్! అనిచేసే శబ్దం బాగా స్పష్టంగా వినిపిస్తున్నది.

మళ్ళీ అటూ ఇటూ చూచి మనస్సులో ఏదో అస్పష్టంగా గొనుక్కుంది. భగవంతుణ్ణి ప్రార్ధించిందేమో బహుశా! గభాలున దూకేసింది.

దూరంగా కూర్చున్న వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి అటూ ఇటూ చూచి ఎవరూ లేకపోవటంతో దిక్కుతోచక గభాలున దూకేశాడు.

పాపం దూకిన తర్వాత తెలిసింది. అక్కడో సుడి ఉందని, పెదవులపై మందహాసం మెరిసింది. రక్షించబోయి తాను చస్తున్నాన్నని అనుకున్నాడు. ఒక్క మునక వేసిన తర్వాత ఏదో గొణిగాడు. బహుశా "శివ ఇకనైనా నన్ను క్షమిస్తుంది లెమ్మని కావచ్చు. అతనికి చిత్రంగా ఆ క్షణంలో అనిపించింది. తాను, శశి అక్కయ్య కొడుగ్గా పుడుతానేమోనని! నవటానికి కూడా విల్లేకుండా సుడి ముంచేసింది. విధి విడదీస్తే కలిపేసింది!

పాదాభివందనం

ప్రతిరోజూ సాయంకాలం అయ్యేసరికల్లా మనస్సు అటువేపుగా పరిగెత్తుతుంది. చేతులు యాంత్రికంగా అలంకరిస్తాయి. మనస్సులో కలిగే పరవళ్ళకి దీటుగా అలంకారం సాగదు. గుండెలో కదిలేకదలికకి రాగమధురులు వచ్చినట్టుగా, సరతరంగాలపై జీవితం ప్రవహించినట్టుగా ఆమె అందానికి తగినట్టుగా అలంకరణ సాగదు. కుదురుగా ఉండే శిరోజాలు సెలయేటి తరమ్గాలపై తేలియాడే పిల్లగాలుల్లా కదిలాడుతాయి.

సూర్యోదయం వేళ రవిబింబం మెరిసినట్టుగా నుదుట సింధూరం వెలుస్తుంది. రాగ భావనకే కెంపులై పోయే చెక్కిళ్ళకి ఏ గంధమూ అందాన్నివటం లేదు. రాగారంజితాలై మొవల్లామెరిసే పెదాలకి ఏ రాగమూ అంటటం లేదు.

చేసుకున్న అలంకరణ తృప్తినివదు మనసు నివదు. కాళ్ళు తరపెడతాయి. కళ్ళు ఆశ పడతాయి. గుండె గుబు లేక్కుతుంది.

"ఎక్కడమ్మ?"

'సరిగ్గా గడపదాటే వేళకి ఏకైక పుత్రిక ప్రియంవద పలకరిస్తుంది.'

అవును! ఈ దేశంలో ఏ  ఆడది గడపదాట కూడదు. కారణం లేనిదే చరణం కదలరాదు.

ఎగసెగసిపడుతున్న వూహలఅలలు ఒక్కసారిగా ఆగిపోతాయి. ప్రేమ సంద్రం నిస్సంద్రం అవుతుంది. కళ్ళలో మిలమిలలు కాలనిలోని చేపల్లా అక్కడే ఆగిపోతాయి.

అలా చెరువు గట్టుకి......యధాలాపంగా జవాబిస్తుంది.

నేనూవస్తానమ్మా.

కూతురి అభ్యర్ధనని త్రోసిరాజనలేదు. పదిహేనేళ్ళగా ప్రాణానికి ప్రాణం ఇచ్చి పెంచిన ఆత్మీయత అడ్డు చెప్పలేదు.

కానీ వెన్నెల రహదారుల్లో బ్రతుకంతా ఒక్క వేడి వెన్నెల పంట అన్నట్టుగా చకోరిలా పయనించబోయేతనకి ఉస్సురుమంటుంది మనసు.

ఆ వేళకి ప్రేమ జీవన్ ఇంట్లో ఉండడు. ఆటలు ఆడుకునేందుకు వెళ్ళి ఉంటాడు. భువనేశ్వర్ ఇంకా ఇంటికి వచ్చి ఉండడు. ఉద్యోగ బాధ్యతలు ఆయన్ని ఒకపట్టాన ఇల్లు చేరనివవు. అయన ఇంట్లో అడుగుపెట్టే వేళకి ఆంగ్లంలో వార్తలు ప్రారంభమవుతూ ఉంటాయి.

అంతటి బంగళాలో ఇద్దరే తల్లి కూతుళ్ళు సాయం దీపాల్లా బిక్కుబిక్కుమంటూ కూర్చోవాలి. ప్రియంవద పురుగు. అది ఇది అని లేదు. వార, మాస పత్రికలతో పాటు ఏ నవల అయినా సరే! తెలుగో, అంగ్లమో ఏదయితేనేం రోజు కొత్త పుస్తకం చదివేయ్యాలి. అదంతా మనస్సులో ముద్ర పడిపోవాలి. కొత్త పుస్తకం లేకపోతే తోచదు. చదవకపోతే దిక్కు తోచదు.

భువన మాత్రం సాయంకాలాల్లో బయట పచ్చికలో పడక కుర్చీ వేసుకుని కూర్చుంటుంది. చుట్టూ అందంగా విసిరినపూలు ఆ పూలపై ఆరాటంగా వాలే తుమ్మెదలు గాలి కదిలిపోయే చివురు టాకులసౌరులు చిరు చిరుసవడికైనా చలించిపోయే అతి ప్రశాంతత.

కొండదిగిపోయే సూర్యబింబాన్నో, కొండెక్కి వచ్చేచంద్ర బింబాన్నో చీకటిని వేయి కిరణాలతో పాడదోలబోయే సైనికుల్లా వెలిగే నక్షత్ర మాలికలనో చూస్తూ గడపటం అలవాటామెకి.

కానివారం రోజుల నాడు అనుకోకుండా చెరువుగట్టుకు వెళ్ళవలసి వచ్చింది, ఏదో వ్రతం, ఉద్యాపన అయింది. ఆ సమిధలు, ఆ అక్షింతలు ఆ పూజా పుష్పాలు అన్నీ నీటిపాలు చెయ్యాలి. తోక్కేచోట, తొక్కుడు ఉండే చోట వేయకూడదు. అది అపచారం.

పనిమనుషులని పంపకూడదు. భర్త ఆ సమయంలో ఇంట్లో ఉండరు. కొడుకు ఆటలు, కూతురి చదువు, తప్పనిసరిగా అడుగు బయటకి పెట్టింది భువన.

సాయంకాలం అందాలన్నింటిని తన గర్భంలో దాచుకుంటుంది చెరువు-ఎర్రగా మెరుస్తున్న కలువలు తెల్లగా వెలుగుతున్న తామరలు, నీటిని కప్పెసేట్టుగా అల్లిబిల్లిగా అల్లుకుంటున్న తామరాకుల తీగలు చిరుగాలుల సవడికి బెదిరిపోయి కదిలిపోయే నీటి కన్నె-

 Previous Page Next Page