Next Page 

పాదాభివందనం పేజి 1


                                 పాదాభివందనం


`                                                         యామిని సరస్వతి.

 

                            


                                                        ఆ క్షణం

"ఎంత అన్యాయం జరిగిపోయింది ఒక్క క్షణంలో అతను మనిషా? కాదు కాదు రాక్షసుడు. మానవతమున్న మనిషైతే అలా చేసేవాడు కాదు. మానవత్వం నశించిన తర్వాత తను మనిషేట్లాఅవుతాడు? విచిత్రం! తను అంత ఘోరం చేసినా యింకా బ్రతికే ఉన్నాడు. మానవులు సామాన్య పరిస్థితుల్లో చావాలనుకుంటారు.

అంత ఘోరం చేసినా ఇలాంటి పరిస్థితుల్లో చావాలనుకోరు చస్తారు ! తను అది చెయ్యలేకపోతున్నాడు.  తానొక పశువు. అంతకన్నా హీనం దానికి తనకు ఏమిటి తేడా? సంబంధబంధ్యాలు లేకుండా పశువు కామం తిర్చుకుంటుంది. తను అదే పని చేశాడు. ఇంక తను బ్రతికి ఏం లాభం? తను మళ్ళీ ఆమె ముఖం ఎలా చూస్తాడు?"

ఎంత ఘోరం చేశాడు! పాలు తాగిన రొమ్మునే గుద్దురా అన్నట్టు తనకు మేలు చేసినదేవతనే తాను ఎవరికి చేయ్యారని అన్యాయం చేశాడు. తనకు నిష్కతి ఎట్లా ఉంటుంది? లేదు....లేదు.

ఆమె తనను ఎంతగా నిందించుతున్నదో! ఎంత నెమ్మదైనమనిషి! ఎంతగా బ్రతిమాలుకుంది! తిట్టింది, రక్కింది, చివాట్లు పెట్టింది. తను వినిపించుకున్నడా? ఒట్టి పశువు? కాముకుడు నిజంగా కళ్ళు మూచుకుపోయాయి. ఎలా కనిపిస్తుంది అంతస్తుల తారతమ్యం?"

ఆమె ఎక్కడ? తనెక్కడ? తనను ఎంతగా ఆదరించేది! భర్త ఉన్నా, లేకున్నా తనను ఎలా సమర్ధిస్తూ ఉండేది! నిజం! అంతపురానికి ఎంత రక్షణ ఉంటే అంత మంచిది. స్త్రీ. పరుషునికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు. ఊరికే చెప్పారా పూర్వులు?

"ప్రతిరోజూ వెళ్ళుతూ ఉన్నాడు అక్కయ్యా! అని పిలుస్తూ ఉండేవాడు. ఎంత దుర్మార్గం చేశాడు! ఆమె ఏమనుకుంటుంది? అదంతా దొంగ చేష్టలనుకొదూ? అక్క లేని లోటు తీర్చావమ్మా అన్నాడు. అప్పుడేమయింది ఆ భావన?"

"పాపం! ఎంత దీనంగా చూసిందా చూపు! అవన్నీ తను గమనించాడా? ఆమె అందం ఉన్మత్తుడ్ని చేస్తుంది. బుద్దిగాసున్నీచేసింది. పాపిని చేసింది. తనకిక శాంతి లేదు. మోక్షం లేదు. భగవాన్! భగవాన్!

జుట్టు పిక్కున్నాడు. తల నేలకేసి కొట్టుకున్నాడు. క్రిందటి సాయంత్రం నుంచి అలాగే గదిలో మంచం పై పడి వున్నాడు. స్నానం లేదు. సంధ్య లేదు. తిండి లేదు. అలాగే పై కప్పు కేసి చూస్తూ పడుకున్నాడు. ఒకటే ఆలోచన సుళ్ళు తిరుగుతూ ఉంది.

"ముఖం పిక్కుపోయింది. కళ్ళు లోపలికి వెళ్ళాయి. కళా విహినంగా ఉంది ముఖం.

ఏడ్చి ఏడ్చి వాసిపోయింది. ఎంత ఏడిస్తే ఏం లాభం? అతను చేసిన పాపం ఆ కన్నీరు క్షాలనం చేస్తుందా?"

అలోచించి అలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. హటాత్తుగా మంచం నుంచి లేచాడు. ఇల్లు తాళం వెయ్యలేదు. అలాగే రోడ్డు వెంట పోతున్నాడు. గుడ్డలన్నీ బాగా నలిగిపోయాయి. జుట్టు రేగి ఉంది. తెలిసినవారు దిగ్భ్రాంతులైచూస్తున్నారు. తెలియని వారు పిచ్చి వాడనుకున్నారు. త్రాగుబోతనుకున్నారు. వీధి చివర్లో ఓ కుక్క కూడా మొరిగింది. అతడి వన్ని ఏమి పట్టించుకోలేదు.

"వెళ్లాడు సరాసరి ఆమె ఇంటికే వెళ్ళాడు. ఇంట్లో దీపాలు వెలిగించిలేవు. ఆమె మనస్సులాగే ఆ ఇల్లు అంధకార బందురమైఉంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఆమె మనస్సులాగే అది మూగబోయి ఉందేమో!"

ఒక క్షణం నిలిచి తలుపు త్రోసుకుని లోపలికి వెళ్ళాడు. నెమ్మదిగా వెళ్ళితే మసక చీకట్లో ఆమె గోడనానుకుని కూర్చున్నట్లు కన్పించింది. లైట్లు స్విచ్ వేశాడు. చూచాడు. ముఖం వాడిపోయి ఉంది. చెక్కిళ్ళపై కన్నీటి చారలు కనిపిస్తున్నాయి.

ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినాయి. ఆవేదనతో వక్షస్థలం ఎగిరి పడుతుంది. 'ఆవేదన మనస్సులోనే ఉండి, దాన్నే కాలుస్తూ ఉందేమో! కళ్ళల్లో అది కనరావటం లేదు. నిశితంగా చూస్తే కళ్ళల్లో నిర్లిప్తత, మహా ఆవేదన అగుపదతాయేమో!

చూడలేకపోయాడు. లైట్లు అర్పివేశాడు. నెమ్మదిగా వెళ్ళాడు. ఆమె కాళ్ళ దగ్గర మోకాళ్ళ పై కూర్చుని నెమ్మదిగా నేలకు కరుచుకపోయి ఆమె పాదాలపై పడ్డాడు. మొదట ఆమె కళ్ళు వెనక్కు లాక్కున్నట్లు అన్పించింది. కానీ, తర్వాత ఆ ప్రయత్నం ఏమి చేసినట్లు లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం మాత్రం వినిపిస్తూ ఉంది. చీకటి అయినా, రెండు గొంతుకలు లేవు కాబట్టి ఎవరో ఒక్కరే ఏడుస్తూ ఉండాలి!

నెమ్మదిగా వినిపించింది! లే! రాజా, ఆ లైట్ వెయ్! ఆ గొంతులో ఏ విధమైన అసహ్యమూ లేదు. ఆగ్రహము లేదు. ఆవేశము లేదు. ఏదో భరింపరాని నిర్లిప్తత ఉంది. ఆ నిర్లిప్తతే మనస్సున్న వాళ్ళ మనస్సును రంపపుకోట పెడుతుంది. మహావేదన నిండి ఉంది ఆ గొంతుకలో.

అతను లైటు వేశాడు. ఈసారి దైర్యం చేసి ఆమె వేపు చూడలేకపోయాడు. తలవంచుకున్నాడు. కన్నీటి చారలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె మెల్లగా లేచి వెళ్లింది. స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది.

"రాజా!"

అతను తలెత్తి చూశాడు అదే చీర. అదే రవిక. అదే ముఖం. అదే అందం. క్రిందటి రోజు ఏవైతే తన్ను ఆకర్షించి తనచేత చెయ్యరాని మహా ఘోరం చేయించాయో, అవే ఈరోజు తనను విచారగ్రస్తున్ని చేస్తున్నాయి. నిన్న అనే తనకు పరవశతం కల్గించి కమోద్రిక్తున్ని చేస్తే ఈరోజు అవేతనను విచార గ్రస్తున్ని చేసి దుఃఖితున్ని చేస్తున్నాయి. ఒక్క రోజులో ఎంత తేడా?

ఆ ఒక్క క్షణం ఎంత భయంకరమైంది!

మెల్లగా దగ్గరకు వచ్చింది. అతని భుజంపై చేయి వేసింది. ఎన్నడూ అతన్ని తాకి ఎరుగడు.

"రాజా! లే! రైలుకి వేళ వుతుంది. నా వద్ద నగలు డబ్బూ , అన్నీ కలిపి సుమారు అయిదారు వేలున్నాయి. హైదరాబాదు పోదాం. అక్కడే ఉందాం అంది.

ఆ గొంతులో కోపం లేదు. కామం లేదు. శాంతం ఉంది. ప్రేమ ఉంది. ఆవేశం లేదు. అనురాగం ఉంది. అన్నిటికి మించి ఆమాటల వెనుక గాడమయిన నిశ్శబ్దత వుంది.

కృంగిపోయాడు. ఆమె ఎంత శీలవతి! ఎంత సుగుణవతి! నిప్పులాంటి మనిషి, ఎలాంటి మాటలు అంటున్నది! కారణం? తనను.....తనను కాల్చినా పాపం లేదు. తనను కలిస్తే పాపం పోతుందా? ప్రాణం పోతుంది. ఈశరీరానికి సంబంధించిన వేదన పోతుంది.

మనస్సుకు, ఆత్మకు చుట్టుకున్న వేధన ఎలా పోతుంది? ఆమె కాళ్ళు పట్టుకుందామనుకున్నాడు చీ! చీ! ఆమె తన అపవిత్ర చర్యతో, స్పర్ధతో కళంకిని అయింది. ఆమె పాతివ్రత్యమంతా మంట కలిసింది. ఇంకా ఆమెను అధఃపతితనుచేయాలా?

"శశక్కా! నన్ను క్షమించక్కా! ఇంకా నేను బ్రతికి ఉన్నాను. పాపిని. ఇంక మళ్ళీ ఇటు రాను, చెపుతున్నానక్కా! నిజం! నీవు! నీవు......." అతను ఆ తరవాత మాట్లాడలేకపోయాడు. మనస్సున సంతోషం నిండుకుంటే ఎలా మాటలు రావో ఆవేదన అవరించుకున్నా అలాగే రావు.

"ఏమంటున్నావ్, రాజా? నేను మళ్ళీ వారితో కాపురం చెయ్యాలా? వారితో మళ్ళీ ఎలా కాపురం చెయ్యగలను? అది సాద్యమా? నాకు మాత్రం కాదు. ఇదిగో వారితో కాపురం చేసినందుకు ఫలంగా, ఆ బాబూ,బేబి వారికి చాలు. నా ఈ కళంకమైన జీవితంతో, శరీరంతో వారికీ మచ్చ తేలేను. మళ్ళీ ఆయనను మభ్య పెట్టి ఈ అగ్నిగోళాన్ని నాలో దాచుకుని నాలో నేను కృశించలేను ఎక్కువ మాటలు పనిలేదు వెళ్దాం పద."

ఆమె గొంతులో కడలిన వేదన స్పష్టమౌతున్నదా మాటల్లో. దృడనిశ్చయమైన ఆమె గొంతులో మాటలు కరుకగానే దోర్లుతున్నవి. సూట్ కేసు తీసుకుంది.

"అమ్మా! నేను రా........"

Next Page